Who won Swachh Survekshan-2023?

స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు-2023(Who won Swachh Survekshan-2023?)

2023 సంవత్సరానికి గాను ఇండోర్ మరియు సూరత్ క్లీన్ సిటీ అవార్డును పొందాయి.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రోజున (11 జనవరి) ఈ రెండు నగరాలకు సంయుక్తంగా క్లీనెస్ట్ సిటీ అవార్డును అందించారు.ఇండోర్ వరసగా అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎంపికైంది.లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న టాప్ 10 క్లీనెస్ట్ సిటీల జాబితాలో గ్రేటర్ ,విశాఖపట్నం,భోపాల్,విజయవాడ,న్యూఢిల్లీ,తిరుపతి,గ్రేటర్ హైదరాబాద్ మరియు పూణే కూడా ఉన్నాయి.

Who won Swachh Survekshan Awards-2023

పరిశుభ్రత సర్వే యొక్క థీమ్-2023 “వేస్ట్ టు వెల్త్” ఈ సంవత్సారానికి థీమ్ “రెడ్యూస్,రి యూస్ మరియు రీ సైకిల్”.

ద్రౌపది ముర్ము గారు అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా:వృత్తాకార ఆర్ధిక వ్యవస్థ యొక్క రీ సైక్లింగ్ మరియు మరింత ఎక్కువ వస్తువులను తిరిగి ఉపయోగించడం యొక్క పద్ధతులు స్థిరమైన అభివృద్ధికి సాయకారిగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.వ్యర్థ పదార్థాల నిర్వహణలో కూడా ఇటువంటి వ్యవస్థ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆమె విశ్వాసం వ్యకం చేసారు .

హర్దీప్ సింగ్(కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి) గారు మాట్లాడుతూ:ఈ రోజు భారత దేశంలోని ప్రతి నగరం బహిరంగ మలవిసర్జిత రహితం అన్నారు. స్వచ్ భారత్ మిషన్  అనేది ప్రభుత్వ కార్యక్రమం   ఉద్యమంగా మారడం వల్లనే ఇది సాధ్యమైంది.వచ్చే వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో 100% సాధిస్తామని ఈ మిషన్ ముగిసేసరికి మాన్ హోల్ నుండి మెషిన్ హోల్ కి మారుతామని హర్దీప్ సింగ్ చెప్పడం జరిగింది.

2016లో 73 ప్రధాన నగరాల మూల్యాంకనంతో మొదలైన స్వచ్ఛ సర్వేక్షణ్ ఇప్పుడు 4,477 నగరాలను నగరాలను పరిగణలోకి తీసుకొని మూల్యాంకనం చేస్తుంది.ఈ సంవత్సరం మూల్యాంకనంలో 3000 మందితో కూడిన బృందం చేసింది.మొత్తం 4477 పట్టాన స్థానిక సంస్థలు,61 కంటోన్మెంట్ బోర్డులు,88 గంగా పట్టణాలు మరియు 18,980 వాణిజ్య ప్రాంతాలు సర్వేలో పాల్గొన్నాయి.దాదాపుగా 12 కోట్ల మంది పౌరుల స్పందనలు రావడం జరిగింది.

దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రం ఏదంటే???

దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తోలి స్థానంలో నిలిచింది.”స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్-2023″ టాప్-10 జాబితాలో తెలుగు రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి.తెలంగాణ 5వ,ఏపీ 6వ స్థానంలో నిలిచాయి.మధ్యప్రదేశ్,చత్తీస్ ఘడ్,ఒడిశా రాష్ట్రాలు 2,3,4 స్థానాల్లో ఉన్నాయి.ఇక పంజాబ్ ,గుజరాత్,ఉత్తర్ ప్రదేశ్,తమిళనాడు వరసగా 7,8,9,10 వ స్థానాలను దక్కించుకున్నాయి.

దేశంలోనే ‘క్లీన్ సిటీ’లు ఇండోర్,సూరత్:

దేశంలో పరిశుభ్రమైన నగరాల్లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్,గుజరాత్ లోని సూరత్ సంయుక్తంగా తొలి స్థానాన్ని దక్కించుకున్నాయి.2023కు గాను “స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు”ను ఇండోర్ ఏడోసారి సొంతం చేసుకుంది.నవీ ముంబై మూడో స్థానంలో ఉండగా..తెలుగు రాష్టాల నుండి వైజాగ్(4),విజయవాడ(6),తిరుపతి(8),హైదరాబాద్(9) టాప్-10 లో ఉన్నాయి.

డర్టీయెస్ట్ సిటీగా హౌరా:దేశంలో డర్టీయెస్ట్ సిటీగా హౌరా(బెంగాల్) నిలిచింది.లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న మురికి నగరాల్లో 10 ఆ రాష్ట్రానికి చెందినవే.అందులో కళ్యాణి,మధ్యగ్రామ్,కృష్ణానగర్,అసన్నోల్,రిష్రా,బిధాన్ నగర్,కంచరపరా,కోలకత్తా ,భత్పరా ఉన్నాయి.షిల్లాంగ్(మేఘాలయ),సీతామర్హి(బీహార్) కూడా ఈ జాబితాలో ఉన్నాయి.క్లీనెస్ట్ సిటీలైన ఇండోర్,సూరత్ స్కోర్ 9348 కాగా,బెంగాల్ నగరాల స్కోర్ 1000 లోపేనని వెల్లడైంది.

జాతీయ స్థాయిలో తెలంగాణకి స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో నాలుగు అవార్డులు:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సత్తా చాటింది.దేశంలోనే క్లీన్ సిటీల్లో 9వ స్థానంలో నిలిచినా హైదరాబాద్…మరో 3 విభాగాల్లోనూ సత్తా చాటింది.5 స్టార్ రేటెడ్ గార్బేజ్ ఫ్రీ సిటీ,క్లీన్ సిటీ ఇన్ తెలంగాణ ,ఫస్ట్ 5 స్టార్ రేటెడ్ సిటీ ఇన్ తెలంగాణ నిలిచింది.ఢిల్లోలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ చేతుల మీదుగా GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్,సిబ్బంది అవార్డులు అందుకున్నారు.

ఆరో స్థానం దక్కించుకున్న విజయవాడ:స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్-2023 లో విజయవాడ ఆరో స్థానం దక్కించుకుంది,ప్రతి సంవత్సరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ‘సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్’,’గార్బేజ్ ఫ్రీ సిటీ’,’సిటిజెన్ వాయిస్’ కేటగిరీలలో నగరాల పనితీరు ఆధారంగా ఇస్తుంది.హర్దీప్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి ఆదిమూలపు సురేష్,విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి,కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు.ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ సిటీ(ODF) విభాగంలో విజయవాడ 5 స్టార్ రేటింగ్ సాధించింది.

Also Read: BRICS newly added countries List

 

3 thoughts on “Who won Swachh Survekshan-2023?”

Leave a comment

error: Content is protected !!