బ్రిక్స్ లో అధనంగా మరో అయిదు దేశాలు చేరబోతున్నాయి ఆ దేశాలు?(BRICS newly added countries list)
బ్రిక్స్ కూటమిలో మరో అయిదు దేశాలకు సభ్యత్వం ఇస్తూ రష్యా అధక్షుడు ఒక ప్రకటన విడుదల చేసాడు.దీంతో బ్రిక్స్ కూటమి యొక్క బలం రెట్టింపు కానుంది.
కొత్తగా చేరిన 5 దేశాలు???
బ్రెజిల్,రష్యా,ఇండియా,చైనా,దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన ఈ కూటమిలో కొత్తగా ఈజిప్ట్,ఇథియోపియా,ఇరాన్,సౌదీ అరేబియా,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశాలు సభ్యత్వం పొంది బ్రిక్స్ లో భాగం కానున్నాయి.ప్రస్తుతం కొత్తగా చేరిన ఈ పది దేశాలతో కలిపి మొత్తం 10 దేశాల కూటమిగా అవతరించిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు.
రష్యా అధ్యక్షుడు బ్రిక్స్ గురించి ఏమన్నారంటే ???
అంతర్జాతీయ వ్యవహారాల్లో బ్రిక్స్ కీలక పాత్ర పోషించే సాధికారతను సాధిస్తోందని పేర్కొన్నారు.బ్రిక్స్ కి చాలా దేశాల సహకారం మరియు మద్దతు లభిస్తుందని ఇంకా 30 దేశాలు బ్రిక్స్ లో చేరడానికి ఆసక్తి కనపరుస్తున్నాయని తెలిపారు.రాజకీయ భద్రత,ఆర్థిక,వాణిజ్య పరంగా,సాంస్కృతిక,మానవత్వ సేవల రంగాలలో బ్రిక్స్ కలిసి పనిచేస్తుంది అని చెప్పారు.
గత ఏడాది బ్రిక్స్ సమావేశంలోని ప్రతిపాదనలు :
గత ఏడాది బ్రిక్స్ సమావేశం ఆగస్టులో జొహాన్నెస్ బర్గ్ లో జరిగింది.ఈ సదస్సులో మొత్తం 6 దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవం జరిగింది.ఈ ప్రతిపాదన ప్రకారం 5 దేశాలకే సభ్యత్వం ఇవ్వడం జరిగింది.
బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడింది అంటే ????
B -బ్రెజిల్
R -రష్యా
I -ఇండియా
C-చైనా
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ 4 దేశాలతో 2006లో బ్రిక్(BRIC) ఏర్పాటైంది.
ఈ సంస్థ ఏర్పాటుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కృషి చేశారు.దీని యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని శాంఘైలో ఉంది.
మొదటి సమావేశం 2009 లో యొకాటెరిన్ బర్గ్(రష్యా) లో జరిగింది.24 డిసెంబర్ 2010లో దక్షిణాఫ్రికా చేరాక (S -సౌత్ ఆఫ్రికా) బ్రిక్స్ గా మారింది. ఈ కూటమి ప్రపంచ జనాభాలో 40 శాతం,ప్రపంచ జీడీపీ లో 20 శాతం వాటాను కలిగి ఉంది.ఆర్ధిక పరంగా,వైశాల్య పరంగా అత్యంత శక్తివంతమైన కూటమి.
బ్రిక్ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు ????
బ్రిక్ అనే పదాన్ని గోల్డ్మన్ అండ్ శాక్స్ కి చెందిన “జిమ్ ఓ నీల్” 2001 సంవత్సరంలో మొదటిసారి ఉపయోగించారు.
న్యూ డెవలప్మెంట్ బ్యాంకు:
2014లో ఆరవ సమావేశంలో న్యూడెవలప్మెంట్ బ్యాంకు పేరుతొ బ్రిక్స్ బ్యాంకు స్థాపించాలని నిర్ణయించారు.షాంఘై కేంద్రంగా 2015లో స్థాపించారు.న్యూ డెవెలప్మెంట్ బ్యాంకు లో సభ్యదేశాలుగా 2021 సెప్టెంబర్ లో బాంగ్లాదేశ్,యూఏఈ,ఉరుగ్వే చేరాయి.2021 డిసెంబర్ లో ఈజిప్ట్ చేరింది.దీనితో సభ్యుల సంఖ్య 9కి చేరింది.
2023 బ్రిక్స్ సదస్సులో చేసిన ప్రతిపాదనలు:
బ్రిక్స్ కూటమిలో మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి.అర్జెంటీనా,ఈజిప్ట్,ఇథియోపియా,ఇరాన్,సౌదీ అరేబియా,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది.దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో మూడు రోజుల శిఖరాగ్ర భేటీలో చివరి రోజున 24 ఆగస్టు 2023 న మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఈ మేరకు ప్రకటన చేశారు.
అయితే ప్రస్తుతం మొత్తం 5 దేశాలు అయిన ఈజిప్ట్,ఇథియోపియా,ఇరాన్,సౌదీ అరేబియా,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరడంతో బ్రిక్స్ లో మొత్తం దేశాల సంఖ్యా 10 కి చేరింది.
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో 2021 డిసెంబరులో కొత్తగా ఈజిప్ట్ దేశం సభ్యత్వం పొందింది.
ఇప్పటివరకు జరిగిన బ్రిక్స్ సమావేశాలు :
1.యొకాటెరిన్ బర్గ్(రష్యా)-2009
2.బ్రెజీలియా (బ్రెజిల్)-2010
3.సాన్యా (చైనా)-2011
4.న్యూఢిల్లీ(భారత్)-2012
5.డర్బన్(దక్షిణాఫ్రికా)-2013
6.పొర్టలెజా(బ్రెజిల్)-2014
7.ఉఫాసిటి(రష్యా)-2015
8.గోవా(భారత్)-2016
9.జియామెన్ (చైనా)-2017
10.జోహాన్స్ బర్గ్(సౌత్ ఆఫ్రికా)-2018
11.సెయింట్ పీటర్స్ బర్గ్(రష్యా)-2019 నవంబర్ 13-14
12.జైర్ బొల్సోనారో(రష్యా)-2020 నవంబర్ (వీడియో కాన్ఫరెన్స్)
13.ఇండియా – 2021 సెప్టెంబర్ (వీడియో కాన్ఫరెన్స్)
14.చైనా -2022 -జూన్ 23-24( (వీడియో కాన్ఫరెన్స్))
15.దక్షిణాఫ్రికా -2023 ఆగస్టు
బ్రిక్స్ యొక్క ప్రధాన లక్ష్యాలు :
1)సభ్యదేశాల మధ్య ఆర్ధిక సహకారం మరియు వాణిజ్యాన్ని మెరుగుపరచడం.
2)స్థిరమైన అభివృద్ధి మరియు సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తుంది.
3)సభ్యదేశాల మధ్య రాజకీయ సహకారం మరియు పరస్పర అవగాహనను సులభతరం చేస్తుంది.
2024 లో బ్రిక్స్ కి ఆతిథ్యము ఇవ్వనున్న దేశం :
రష్యా 2024 లో బ్రిక్స్ కి ఆతిథ్యము ఇవ్వనుంది.ఈ సమావేశంలో కొత్తగా చేరిన 5 దేశాలతో కలిపి 10 దేశాలు పాల్గొననున్నాయి.
Also Read: About Medaram Jathara
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.