TS Polycet 2024 Notification Released

పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది.

పశు సంవర్ధక,మత్స్య,ఉద్యానవన,వ్యవసాయ,ఇంజనీరింగ్,నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరాలంటే ఇందులో అర్హత సాధించాలి.

TS Polycet 2024 Notification Released

TS Polycet 2024 Important Dates

అప్లికేషన్ ప్రారంభ తేదీ 15 ఫిబ్రవరి 2024
అప్లికేషన్ చివరి తేదీ 22 ఏప్రిల్ 2024
ఆలస్య రుసుముతో చివరి తేదీ 24 ఏప్రిల్ 2024
పరీక్ష తేదీ 17 మే 2024

ఫిబ్రవరి 15వ తేదీ నుండి ఏప్రిల్ 22 వరకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది.ఆలస్య రుసుము 100/- లతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు వివరాలు:

ఎస్సి మరియు ఎస్టీలకు 250/- ఇతరులకు 500/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అర్హత:

  • పాలీసెట్ పరీక్షకు అప్లై చేయాలంటే అభ్యర్థి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే సెకండరీ స్కూల్ పరీక్ష ఎస్.ఎస్.సి. లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • పరీక్షకు హాజరు కావాలంటే విద్యార్థి ఖచ్చితంగా భారతీయుడై ఉండాలి.
  • NIOS,APOSS,CBSE,ICSE తెలంగాణ రాష్ట్రంలో SSC కి సమానమైన బోర్డుగా గుర్తించదగిన బోర్డు నుండి విద్యార్థులు ఫిజిక్స్,కెమిస్ట్రీ,మ్యాథెమటిక్స్ వంటి అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి.
  • విద్యార్థులు అర్హత పరీక్ష అయిన SSCలో కనీసం 35% మార్కులు సాధించి ఉండాలి మరియు ఫిజిక్స్,కెమిస్ట్రీ మరియు మాథెమాటిక్స్ వంటి సబ్జెక్టులలో కనీసం 35% మార్కులు సాధించి ఉండాలి.

అప్లికేషన్ విధానం:

  1. పాలిసెట్ వెబ్సైటు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి వివరాలు నింపాలి.
  2. రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసిన తరువాత మొబైల్ నంబర్ ను ఓటీపీ తో ద్రువీకరించాలి మరియు ఇదే నంబరుకి SMS ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ పంపించబడుతుంది.
  3. రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ తో పాలీసెట్ అప్లికేషనులో లాగిన్ అవ్వాలి.
  4. Pay Now పై క్లిక్ చేయాలి.
  5. చెల్లింపు గేట్ వేని ఎంచుకొని,చెల్లింపు ప్రక్రియ కొనసాగించాలి.
  6. ఫీజు చెల్లించాక అప్లికేషన్ ఫిల్ చేయడం ప్రారంభించాలి.
  7. వ్యక్తిగత వివరాలను నమోదు చేసి,Get Details పై క్లిక్ చేయాలి.
  8. కమ్యూనికేషన్ వివరాలను నమోదు చేసి,Next పై క్లిక్ చేయాలి.
  9. కేటగిరీ వివరాలను నమోదు చేసి,Next పై క్లిక్ చేయాలి.
  10. ప్రత్యేక కేటగిరీ వివరాలను నమోదు చేసి,Next పై క్లిక్ చేయాలి.
  11. పరీక్షా కేంద్రం వివరాలను నమోదు చేసి,Next పై క్లిక్ చేయాలి.
  12. తరువాత స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేసి Next పై క్లిక్ చేయాలి.
  13. ఫోటో అండ్ సైన్ అప్లోడ్ చేసి,సేవ్ మరియు ప్రివ్యూపై క్లిక్ చేయాలి.
  14. జనరేట్ హాల్ టికెట్ పై క్లిక్ చేసి,పాలీసెట్ పరీక్ష కోసం హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

పరీక్ష జరిగే విధానం:

పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించబడుతుంది.

పరీక్ష నిర్వహించబడు సమయం:

2 1/2 గంటల సమయంలో పరీక్ష నిర్వహించబడుతుంది.

  • 150 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ఉండి 150 మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఇవ్వడం జరుగుతుంది.
  • నెగటివ్ మార్కింగ్ అనేది ఉండదు.

పరీక్షలో ఉండే విభాగాలు:

సెక్షన్ సబ్జెక్టు ప్రశ్నల సంఖ్యమార్కులు
I మ్యాథెమటిక్స్ 6060
II ఫిజిక్స్ 3030
III కెమిస్ట్రీ 3030
IV బయాలజీ 3030
మొత్తం మార్కులు 150150
  • ఎంపీసీ(120 మార్కులు) మరియు MBiPc (150 మార్కులు)  రెండు వేర్వేరు ర్యాంకులు రూపొందించడం జరిగింది.
  • పాలిటెక్నిక్ లలో మరియు అగ్రికల్చరల్ డిప్లొమాలలో మరియు వెటర్నరీ మరియు హార్టికలుతురే డిప్లొమాలలో ప్రవేశం పొందడానికి రెండు వేర్వేరు ర్యాంకులు రూపొందించబడతాయి.
  • ఎంపీసీ ర్యాంక్:  SBTETకి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ లలో డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందే విద్యార్థులకు మ్యాథ్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ మార్కుల ఆధారంగా ర్యాంక్ జారీ చేయబడుతుంది.
  • ఎం.బై.పి.సి. ర్యాంక్: PJTSAU,SKLTSHU,PVNRTVU డిప్లొమా కోర్సులలో మ్యాథ్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ మరియు బయాలజీలో పొందిన మార్కుల ఆధారంగా ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది.

పాలీసెట్ సిలబస్:

గణితం:

  • బీజగణితం
  • క్షేత్రగణితం
  • జ్యామితి
  • బహుపదులు
  • వర్గీకరణ సమీకరణాలు
  • సాంఖ్యక శాస్త్రం
  • శ్రేఢులు
  • సమితులు మరియు వాస్తవ సంఖ్యలు
  • సంభావ్యత
  • సంఖ్యా వ్యవస్థ
  • ఉపరితల వైశాల్యాలు మరియు ఘన పరిమాణామాలు
  • త్రికోణమితి
  • రేఖీయ సమీకరణాలు
  • మాథమెటికల్ మోడలింగ్

ఫిజిక్స్:

  • ఉష్ణం
  • ఆమ్లాలు,క్షారాలు మరియు లవణాలు
  • రసాయన సమీకరణాలు మరియు ప్రతిచర్యలు
  • మెటలర్జీ
  • పరమాణు నిర్మాణం
  • నునుపు తలం వద్ద కాంతి వక్రీభవనం
  • విద్యుత్ ప్రవాహం
  • కార్బన్ మరియు దాని సమ్మేళనాలు
  • విద్యుదయస్కాంతం
  • రసాయన బంధం
  • మానవుని కన్ను మరియు రంగుల ప్రపంచం
  • వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం
  • కాంతి ప్రతిబింబం
  • మూలకాల వర్గీకరణ

కెమిస్ట్రీ:

  • పదార్థం యొక్క స్థితి
  • రసాయన పరమాణు శాస్త్రం
  • రసాయన గతి శాస్త్రం
  • రసాయన మరియు అయానిక్ సమతుల్యత
  • పరమణు నిర్మాణ శాస్త్రం
  • విద్యుత్ రసాయన శాస్త్రం
  • ఫేజ్ ఈక్విలిబ్రియం మరియు పరిష్కారాలు
  • రోజువారీ జీవితంలో రసాయన శాస్త్రం
  • రెడాక్స్ రియాక్షన్స్
  • రసాయన ఉష్ణ గతిక శాస్త్రం
  • పర్యావరణ రసాయన శాస్త్రం మరియు యూరియా పాలిమర్స్
  • ఆర్గానిక్ కెమిస్ట్రీ
  • స్టీరియో కెమిస్ట్రీ యొక్క ప్రాథమిక భావన
  • మాలోనిక్ ఈస్టర్

పాలిసెట్ లో క్వాలిఫైయింగ్ మార్కులు:

  • SBTET ద్వారా పాలిటెక్నిక్ కోర్సులో కౌన్సిలింగులో పాల్గొనాలంటే 120 మార్కులతో 30% అంటే మ్యాథ్స్,ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ కలిపి మొత్తం 36 మార్కులు రావాలి.
  • SBTET కాకుండా మిగతా యూనివర్సిటీలు అయినా PJTSAU (లేదా)PVNRTVU(లేదా)SKLTSHU లలో కౌన్సిలింగ్ లో పాల్గొనాలంటే  120 మార్కులతో 30% అంటే గణితం(60/2),బయాలజీ,ఫిజిక్స్ తో కలిపి 36 మార్కులు రావాలి.

పాలిటెక్నిక్ లో సీటు పొందే విధానం:

  • పాలిసెట్-పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టును స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్ నిర్వహిస్తుంది.
  • పాలిసెట్ లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కింది కోర్సులలో సీటు కేటాయించబడింది.
  • తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించే డిప్లొమా స్థాయి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ,గవర్నమెంట్ ఎయిడెడ్,ప్రయివేట్ అన్-ఎయిడెడ్ లో SBTET పాలిటెక్నిక్ లు మరియు ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ అన్-ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలలో నడుస్తున్నాయి.
  • ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ అందించే డిప్లొమా కోర్సులు మరియు దానికి అనుబంధ పాలిటెక్నిక్ కోర్సుల్లో సీటు పొందవచ్చు.
  • శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ అందించే డిప్లొమా కోర్సులు మరియు దానికి అనుబంధ పాలిటెక్నిక్ కోర్సుల్లో సీటు పొందవచ్చు.
  • పి.వి.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం అందించే డిప్లొమా కోర్సుల్లో సీటు పొందవచ్చు.
  • పాలిసెట్ కి హాజరైన అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులు కేటాయించబడతాయి.
  • దీనిద్వారా అభ్యర్థులు SBTET అందించే డిప్లొమా కోర్సులను లేదా PJTSAU(లేదా)PVNRTVU(లేదా)SKLTSHU లలో అందించే కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు.
  • పాలిటెక్నిక్ అందించే ఇంజనీరింగ్ లేదా నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందాలి అనుకునే అభ్యర్థులకు అడ్మిషన్ కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారం అవసరం లేదు,పాలిసెట్ కోసం నింపిన అప్లికేషన్ ఫారం సరిపోతుంది.
  • PJTSAUలో అందించే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది.దీనిలోనే పాలిటెక్నిక్ కాలేజీల వివరాలు,ఖాళీల వివరాలు మరియు ఫీజుకు సంబంధించి అన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్సైటులో అఫీషియల్ వెబ్సైటులో  ఉంచబడతాయి.
  • PJTSAU యొక్క డిప్లొమా కోర్సుల సీట్లను భర్తీ పాలిసెట్ లో అభ్యర్థులు పొందిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.
  • PVNRTVU ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది.
  • PVNRTVU నిర్వహించే కౌన్సిలింగ్ లో పాలిసెట్ లో పొందిన ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేయడానికి ప్రత్యేక అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.
  • PVNRTV యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైటులో సమాచారం ఇస్తారు.
  • PVNRTVU ఎనిమల్ హస్బెండరీ మరియు ఫిషరీస్ కి సంబంధించిన కోర్సులను అందిస్తుంది.
  • ఫార్మసీ మరియు హోటల్ మేనేజ్మెంట్ లలో ప్రవేశం పొందడానికి పాలిసెట్ అవసరం లేకుండానే దోస్త్ ద్వారా 10+2 అర్హతతో అప్లై చేసుకోవచ్చు.
  • SKLTSHU ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది.
  • SKLTSHU నిర్వహించే కౌన్సిలింగ్ లో పాలిసెట్ లో పొందిన ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేయడానికి ప్రత్యేక అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.
  • SKLTSHU యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైటులో సమాచారం ఇస్తారు.

కోర్సు వివరాలు కోసం: క్లిక్ చేయండి 

Also Read: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల 

 

2 thoughts on “TS Polycet 2024 Notification Released”

Leave a comment

error: Content is protected !!