మూడేళ్ళ తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం

మూడేళ్ళ తరువాత గణతంత్ర దినోత్సవంలో తెలంగాణ యొక్క శకటం :

న్యూఢిల్లీ రిపబ్లిక్ డేలో మూడు సంవత్సరాల నుండి తెలంగాణ కి చెందిన శకటం ప్రదర్శన లేదు.ఈ సారి ఉత్సవాల్లో తెలంగాణ శకటం ఉండనుంది.

  • జనవరి 26న ఢిల్లీలోని జరగనున్న జాతీయ వేడుకల్లో భాగంగా తెలంగాణ శకటాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
  • విశేషమేమిటంటే దాదాపు మూడేళ్ల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కింది.  సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ సారి తెలంగాణ శకటం ఉండనుంది. తెలంగాణ శకటంపై నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారు.
  • గతేడాది డిసెంబరు 27న రేవంత్‌రెడ్డి,భట్టి విక్రమార్క ప్రధాని మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో గణతంత్ర వేడుకల్లో తెలంగాణకి అవకాశం కల్పించాలని అడిగారు.
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక అప్లికేషన్ పంపాలని..మోడీ గారు చూస్కుంటానని మాట ఇచ్చారు.ఈ విధంగా మూడు రాష్ట్రాలు దరఖాస్తు చేయగా తెలంగాణకి అవకాశం దక్కింది.

తెలంగాణ శకటం థీమ్:

ఈసారి రిపబ్లిక్ డే కి తెలంగాణ శకటం యొక్క థీమ్ “మదర్ ఆఫ్ డెమోక్రసీ”

  • ప్రజల హక్కులు, ప్రజాస్వామిక విలువల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ సాయుధ పోరాటం సాగింది.
  • శకటం ద్వారా దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమే ఈ పోరాటమని తెలంగాణ ప్రభుత్వం చరిత్ర చూపనుంది.
  • తెలంగాణ ఉద్యమ నేపధ్యం నుంచి అభివృద్ధి వైపు ఎలా పయనిస్తుందో ప్రభుత్వం చూపనుంది.
  • ఆనాటి నియంతృత్వ ప్రాంతమైన తెలంగాణలో ఆడపిల్లలపై జరిగిన అవమానాల కథనాల నుంచి పుట్టుకొచ్చిన స్వరాష్ట్ర ఉద్యమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శకటంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
  • తెలంగాణ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఆదిలాబాద్ కుమురం భీమ్,గోండు వీరుడు, బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి ధైర్యంగా పోరాడిన రామ్ జీ గోండు, చాకలి ఐలమ్మ విగ్రహాలు శకటంపై ప్రదర్శనలో ఉండనున్నాయి.
  • ఉద్యమంలో అసువులు బాసిన ఎందరో అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శకటాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

2020 లో తెలంగాణ శకటం:

  • 2015లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత జాతీయ వేడుకల్లో తెలంగాణ తరపున శకటాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చింది.
  • తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా మేడారం సమ్మక్క సారలగమ్మ జాతర, వేయి స్తంభాల ఆలయానికి సంబందించిన రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
  • ఈ సమయంలో పాడిన పాటలు అలరించాయి.

2015 లో తెలంగాణ శకటం:

  • తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటి సరి రిపబ్లిక్ డే లో భాగంగా శకటం ప్రదర్శనకి ఉంచడం జరిగింది.
  • తెలంగాణ యొక్క సంస్కృతికి బోనాలు మరియు బతుకమ్మ రెండు కళ్ళవంటివి.
  • 45 అడుగుల పొడవుతో 14 అడుగుల వెడల్పుతో ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేయడం జరిగింది.
  • మహిళలకి రక్షణగా బలవంతుడైన పోతరాజుని శకటం ముందు భాగంలో ఉంచడం జరిగింది.
  • చివరలో గోల్కొండ యొక్క కోటను ఉంచడం జరిగింది.

ఇలా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా 2015వ సంవత్సరంలో,రెండవ సారి 2020 సంవత్సరం లో మరియు సీఎం రేవంత్ రెడ్డి గారి వల్ల మరల ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం ఉండనుంది.

ALSO READ: TSRTC NON-ENGINEERING APPRENTICESHIP POSTS

1 thought on “మూడేళ్ళ తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం”

Leave a comment

error: Content is protected !!