Australia Open గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడు Rohan Bopanna:
ఒకటి కాదు రెండు కాదు తన 61వ ప్రయత్నంలో పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకున్నాడు.
- ఆస్టేలియన్ ఓపెన్ 2024 ఫైనల్స్ లో ఇటాలియన్ జోడి సిమోన్ బోలెల్లి మరియు ఆండ్రియా వవస్సోరిని ఓడించి తన ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎబిడెన్ తో జంటగా బోపన్న గెలిచారు.
- 2017 ఫ్రెంచ్ ఓపెన్ విజయం తర్వాత బోపన్నకి ఇది రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్.
గ్రాండ్ స్లామ్ గెలిచిన అతిపెద్ద వయస్కుడు:
- బోపన్న ఈ ఘనత సాధించేకంటే ముందు ఈ రికార్డు ఆస్టేలియా టెన్నిస్ ఛాంపియన్ కెన్ రోజ్ వాల్ (37 ఏళ్ళు) పేరు మీదుగా ఉండేది.
- ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసి మన భారత టెన్నిస్ ఛాంపియన్ రోహన్ బోపన్న 43 ఏళ్ల వయస్సులో ఆ ఘనత సాధించాడు.
వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే
బోపన్న కెరీర్ లో సాధించిన విజయాలు:
- 2009 లో అమెరికన్ భాగస్వామి ఎరిక్ బుటోరాక్ తో కలిసి బోపన్న మొదటి ఏటీపీ డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు.
- 2010లో యూఎస్ ఓపెన్ లో పాకిస్థాన్ కు చెందిన ఐసామ్-ఉల్-హక్ ఖురేషీతో కలిసి బోపన్న యొక్క మొదటి గ్రాండ్ స్లామ్ పురుషుల డబుల్స్ ఫైనల్ కు చేరుకున్నాడు.
- 2011 సంవత్సరంలో డబుల్స్ లో టాప్-10లో స్థానం దక్కించుకున్నాడు.
- 2012 సంవత్సరంలో స్వదేశీయుడైన మహేష్ భూపతితో కలిసి మొదటి మాస్టర్స్ డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నాడు దీనితో పాటు వీరు ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో రన్నరప్ గా నిలిచారు.
- 2017వ సంవత్సరంలో ఫ్రెంచ్ ఓపెన్ లో కెనడా క్రీడాకారిణి గాబ్రియేలా డబ్రోవ్ సుకీ తో కలిసి తన మొదటి మిక్సుడ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది.
- 2023వ సంవత్సరంలో ఎబడెన్ తో కలిసి మాస్టర్స్ ఛాంపియన్ గా నిలిచారు.యూఎస్ ఓపెన్ లో ఫైనల్ కు చేరిన గ్రాండ్ స్లామ్ లో అత్యంత ఓల్డెస్ట్ ఫైనలిస్ట్ మరియు ఏటీపీ ఫైనల్స్ లో మ్యాచ్ గెలిచినా అత్యంత పెద్ద వయస్సు కలిగిన పెద్ద వయస్కుడు.
- 2024 లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్ లో బోపన్న తన యొక్క 500వ డబుల్స్ విజయాన్ని సాధించాడు.
- 43 సంవత్సరాల 329 రోజుల వయస్సులో గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచారు.
Also Read: BCCI Awards 2024 Ceremony
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.