కేంద్రం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించడం జరిగింది.
- 2024లో మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా..5 గురికి పద్మ విభూషణ్,110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
- తెలుగు రాష్ట్రాల నుండి 8 మంది పద్మ పురస్కారాలకు ఎంపికవ్వగా ఏపీకి రెండు పద్మ విభూషణ్ లతో పాటు ఒక పద్మశ్రీ అవార్డులు తెలంగాణకు 5 పద్మశ్రీలు దక్కాయి.
పద్మ విభూషణ్ గ్రహీతలు:
- వెంకయ్య నాయుడు(ప్రజా వ్యవహారాలు)-ఆంద్రప్రదేశ్
- కొణిదెల చిరంజీవి(కళారంగం)-ఆంద్రప్రదేశ్
- వైజయంతి మాల బాలి(కళారంగం)-తమిళనాడు
- బిందేశ్వర్ పాఠక్(మరణాంతరం)-సామాజిక సేవ-బీహార్
- పద్మ సుబ్రహ్మణ్యం(కళారంగం)-తమిళనాడు
ఏపీ కి చెందిన ఇద్దరికి పద్మ విభూషణ్ అవార్డులు రావడం జరిగింది.
తెలుగు రాష్ట్రాల నుండి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు:
- హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరి(కళలు)-ఆంద్రప్రదేశ్
- దాసరి కొండప్ప(బుర్ర వీణ వాయిద్యకారుడు)(కళలు)-తెలంగాణ
- గడ్డం సమ్మయ్య(యక్షగాన కళాకారుడు)(కళలు)-తెలంగాణ
- ఆనందా చారి(కళలు)-తెలంగాణ
- కేతావత్ సోమ్ లాల్(సాహిత్యం)-తెలంగాణ
- కూరెళ్ల విఠలాచార్య(విద్యారంగం)-తెలంగాణ
గడ్డం సమ్మయ్య(తెలంగాణ):
- గడ్డం సమ్మయ్య తెలంగాణాకి చెందిన ప్రముఖ యక్షగాన కళాకారుడు.
- జనగాం నుండి ప్రముఖ చిందు యక్షగానం కళాకారుడు.
- ఈ గొప్ప వారసత్వ కళారూపాన్ని 5 దశాబ్దాలకి పైగా 19,000 ప్రదర్శలు ఇచ్చారు.
- సంపూర్ణ అక్షరాస్యత,పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక సమస్యలని వీరి యక్షగానంలో ప్రతిబింబించేలా ప్రదర్శిస్తారు.
- ఈ కళను ప్రోత్సహించడానికి చిందు యక్ష కళాకారుల సంఘం మరియు గడ్డం సమ్మయ్య యువ కళా క్షేత్రం స్థాపించారు.
- నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చిన ఇతను వ్యవసాయ కూలీగా పనిచేశాడు.చిందు యక్షగానం కళాకారులైన తన తల్లిదండ్రుల నుండి కళారూపాన్ని నేర్చుకున్నాడు.
- 5 దశాబ్దాలకు పైగా చిందు యక్షగానం ప్రదర్శనల ద్వారా సామాజిక సమస్యలను హైలెట్ చేస్తూ ప్రదర్శన ఇస్తున్నారు.
దాసరి కొండప్ప(తెలంగాణ):
- దాసరి కొండప్ప మూడవ బుర్ర వీణ వాయిద్యకారుడు.
- నారాయణపేట లోని దామరగిద్ద గ్రామం కళారూపాల పరిరక్షణకే తన జీవితాన్ని అంకితం చేసాడు.బుర్ర వీణను అంతరించిపోకుండా కాపాడాడు.
- తెలుగు,కన్నడ భాషలలో తత్వాలు,సామాజిక-మతపరమైన నైతిక కూర్పులు మరియు ఆధ్యాత్మిక-తాత్విక వివరణలు పాడారు.
- బుర్ర వీణ అనేది వెదురు,పొట్లకాయ పెంకు మరియు లోహ తీగలను ఉపయోగించి ఉపొందించిన స్వదేశీ తీగ వాయిద్యం
- బుర్ర వీణ అనేది వారి యొక్క కమ్యూనిటీలో వాయించడమే కానీ దాసరి విస్తృతమైన ప్రేక్షకులను ఆకర్షించడానికి ముందుకు వచ్చారు.
- స్వదేశీ కళకు తన యొక్క జీవితాన్ని అంకితం చేసిన బుర్ర వీణ వాయిద్యకారులలో ఒకరు దాసరి కొండప్ప.
వేలు ఆనందాచారి(తెలంగాణ):
- ఏపీ లోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952లో పుట్టిన ఆనందాచారి వేలు హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
- 1980లో దేవాదాయశాఖలో సహాయస్థపతిగా చేరిన వేలు అన్నవరం,శ్రీశైలం,విజయవాడ,కాణిపాకం,సింహాచలం,యాదగిరిగుట్ట,బాసర,వేములవాడ,శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేశారు.
- 2010లో పదవీ విరమణ చేసిన అనంతరం శీశైల దేవస్థానంలో ఆస్థానపతిగా ఉన్నారు.
కూరెళ్ల విఠలాచార్య(తెలంగాణ):
- యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో పుట్టిన కూరెళ్ల విఠలాచార్య మధుర కవి.
- 2014లో తన ఇంటినే గ్రంథాలయంగా చేసి 5వేల పుస్తకాలతో పుస్తక భాండాగారాన్ని స్థాపించారు.
- ప్రస్తుతం అందులో రెండు లక్షలకు పైగా గ్రంథాలున్నాయి.
- 2018లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం అందుకున్నారు.
- 2019లో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారంతో సత్కరించింది.
కేతావత్ సోమ్లాల్(తెలంగాణ):
- యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతో టబావి తండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ భగవద్గీతలోని 701 శ్లోకాలను 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి తెలుగు లిపిలో బంజారా భాషలోకి అనువదించాడు.
- ఎస్.బీ.ఐ.లో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఈయన బంజారా జాతి జాగృతి కోసం 200కి పైగా పాటలు రాశాడు.
ఉమా మహేశ్వరి(ఆంద్రప్రదేశ్):
- హరికథా ఘట్టాన్ని సంస్కృత పారాయణం చేసి తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన మొదటి మహిళ ఉమా మహేశ్వరి.
- సావిత్రి,భైరవి,శుభపంతువరాలి,కేదారం,కళ్యాణి వంటి బహుళ రాగాలలో కథలను పఠిస్తారు.
- తెలుగు మరియు సంస్కృత భాషలలో ప్రావీణ్యం-రమణ మహర్షి మరియు పొట్టి శ్రీరాములు వంటి కవర్ చేస్తూ నాలుగు హరి కథలను రచించారు.
- చాలామంది యువతులు తమకి ఉన్న అడ్డంకులను దాటి బయటకు వచ్చి ఈ కళను స్వీకరించడానికి ఈమె సంహరించింది.
- ప్రపంచ వ్యాప్తంగా విభిన్న రాగాలలో ప్రదర్శన ఇచ్చిన మొదటి మహిళ దివంగత దాలిపర్తి పిచ్చిహరి మనుమరాలు ఈమె.