NTPC-నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందింది.మహారత్న పీ.ఎస్.యు. హోదాను సైతం సొంతం చేసుకుంది.తాజాగా ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NTPC AE Recruitment 2024 Notification Details
మొత్తం ఖాళీల సంఖ్య:
- NTPC తాజా నోటిఫికేషన్ ద్వారా ఆపరేషన్స్ విభాగంలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యుటివ్స్ పోస్టులను భర్తీ చేయనుంది.
- ఓపెన్ కేటగిరీలో 98 పోస్టులు,EWS కేటగిరీలో 22,ఓబీసీ కేటగిరీలో 40,ఎస్.సి. అభ్యర్థులకు 39 అదేవిధంగా ST లకు 24 పోస్టులు ఉన్నాయి.
అర్హత:
- ఎలక్ట్రికల్/మెకానికల్ బ్రాంచులలో బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
- NTPC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీటెక్ తరువాత వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి.
- 100 మెగా వాట్లు అంతకంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పవర్ ప్లాంటులలో..ఆపరేషన్ లేదా మెయింటనెన్స్ విభాగాల్లో కనీసం ఏడాది వర్క్ ఎక్స్పీరియన్స్ పొంది ఉండాలని స్పష్టం చేసారు.
వయస్సు:
- ఫిబ్రవరి 08,2024 నాటికి 35 ఏళ్లకు మించకూడదు.ఎస్.సి.,ఎస్.టి. వర్గాలకు ఐదేళ్లు,ఓబీసీ వర్గాలకు మూడేళ్ళ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
కాంట్రాక్ట్ విధానంలో భర్తీ ప్రక్రియ:
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.NTPC మొదటగా మూడేళ్ళ కాల వ్యవధికి నియామకాలు చేపట్టనుంది.ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంది.అంటే ఈ పోస్టులకు ఎంపికైన వారు గరిష్టంగా అయిదేళ్లపాటు NTPC లో పనిచేసే వీలుంటుంది.
జీత భత్యాల వివరాలు:
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.55 వేల జీతం లభిస్తుంది.దీనితో పాటు ఇంటి అద్దె,నైట్ షిఫ్ట్ అలవెన్స్,ఉద్యోగికి,అతని కుటుంబానికి వైద్య సదుపాయాలను సైతం అందిస్తారు.
స్క్రీనింగ్ టెస్ట్:
- నోటిఫికేషన్ లో మెరిట్ ప్రాతిపదికన నియామకాలు ఖరారు చేస్తామని పేర్కొంటూనే.. తప్పనిసరి అయితే స్క్రీనింగ్ టెస్ట్,పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని NTPC పేర్కొంది.
- Exam Pattern:ఈ స్క్రీనింగ్ టెస్టులో రెండు విభాగాల నుంచి ప్రశ్నల అడుగుతారు.టెక్నికల్ సబ్జెక్టు విభాగం నుంచి 120 ప్రశ్నలు;ఆప్టిట్యూడ్ టెస్ట్ విభాగం నుండి 30 ప్రశ్నలు ఉంటాయి.
- మొత్తం 150 మార్కులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది.పరీక్ష సమయం-2 గంటలు.
- Interview:స్క్రీనింగ్ టెస్టులో పొందిన మర్క్స్ ఆధారంగా..కటాఫ్ నిబంధనల మేరకు మెరిట్ జాబితా రూపొందిస్తారు.
- ఈ జాబితాలో చోటు సాధించిన వారికి మలిదశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.పర్సనల్ ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.ఇందులో అభ్యర్థుల వర్క్ ఎక్స్పీరియన్స్,అకడమిక్ నేపథ్యం,సబ్జెక్టు నాలెడ్జ్ వంటి అంశాలను పరిశీలిస్తారు.
స్క్రీనింగ్ టెస్టులో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశాలు:
- మెకానికల్ ఇంజనీరింగ్:ఈ విభాగంలో థర్మల్ ఇంజనీరింగ్ మెకానిక్స్,మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ,ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్,మెషిన్ డిజైన్,ఇంజనీరింగ్ మెటీరియల్స్,హైడ్రాలిక్ అండ్ హైడ్రాలిక్స్ మెషినరీ,ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్:బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ బ్యాటరీస్,ఎలక్ట్రికల్ సర్క్యూట్స్,డీసీ మెషీన్స్,మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్,ఏసీ మెషీన్స్,ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్,పవర్ సిస్టమ్స్,ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్,యుటిలైజేషన్ అండ్ ట్రాక్షన్,పవర్ ఎలక్ట్రానిక్సుకు సంబందించిన అన్ని అంశాలపై పరిపూర్ణ అవగాహన పొందాలి.
ఆప్టిట్యూడ్ టెస్ట్:
- ఆప్టిట్యూడ్ టెస్టుకు సంబంధించిన జనరల్ అవేర్ నెస్,రీజనింగ్ ఎబిలిటీ,రీడింగ్ కాంప్రెహెన్షన్,క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,డేటా ఇంటర్ ప్రిటేషన్,వొకాబులరీపై పట్టు సాధించాలి.
- జనరల్ అవేర్నెస్ కు సంబంధించి కరెంటు అఫైర్స్ పై అవగాహన పెంచుకోవాలి.
- డేటా ఇంటర్ప్రెటేషన్ కు సంబంధించి గ్రాఫ్స్,డేటా ఎనాలిసిస్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
- క్వాంటేటివ్ ఆప్టిట్యూడ్ లో బేసిక్ మ్యతేమేటిక్సుతో పాటు,అర్థమెటిక్ అంశాలపై పట్టు సాధించాలి.
- జనరల్ ఇంగ్లీష్,వొకాబులరీలో రాణించేందుకు బేసిక్ గ్రామర్ అంశాలు,రీడింగ్ కాంప్రెహెన్షన్,కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్,జంబుల్డ్ సెంటెన్సెస్,ప్రిపోజిషన్స్,ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
వెయిటేజీ ఎలా ఉంటుంది అంటే:
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో..వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు.రాత పరీక్షలో పొందిన మార్కులకు 85 శాతం,పర్సనల్ ఇంటర్వ్యూ మార్కులకు 15 శాతం వెయిటేజీ ఇచ్చి దానికి అనుగుణంగా అభ్యర్థులు పొందిన మార్కులతో తుది జాబితా రూపొందిస్తారు.మెరిట్ జాబితాలో ఉన్న వారికి నియామకాలు ఖరారు చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 8,2024
అఫీషియల్ వెబ్సైట్: NTPC
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?
Your article helped me a lot, is there any more related content? Thanks!