ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) అవార్డులు-2023

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అవార్డ్స్-2023

మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్:

  • ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఎంపికయ్యారు.
  • గతేడాది అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేయడంతో అతడికి ఈ అవార్డు దక్కింది.
  • కాగా కమిన్స్ నాయకత్వంలోనే గతేడాది ఆసీస్ వన్డే వరల్డ్ కప్ సాధించింది.
  • మరోవైపు ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా అయన చరిత్ర సృష్టించారు.
  • రూ.20.25 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ హైదరాబాద్ కమిన్స్ ను దక్కించుకుంది.

ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్:

  • ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ నాట్ సీవర్ బ్రాంట్ ఎంపికయ్యారు.
  • గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు గాను ఆమెను ఐసీసీ ఎంపిక చేసింది.
  • 2022లో కూడా సీవర్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచారు.
  • వరుసగా రెండు సార్లు ఈ అవార్డుకు ఎంపికై చరిత్ర సృష్టించారు.
  • సీవర్ గతేడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 33 మ్యాచులు ఆడి 1,346 పరుగులు బాదారు.22 వికెట్లు కూడా తీసి సత్తాచాటారు.

ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్:

  • ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా నిలిచారు.
  • రవిచంద్రన్ అశ్విన్,జో రూట్,ట్రావిస్ హెడ్ పోటీలో ఉన్నా అతడినే ఈ అవార్డు వరించింది.
  • కాగా ఖవాజా గతేడాది మొత్తం 13 టెస్టులు ఆడి 1210 రన్స్ చేసారు.
  • సౌతాఫ్రికాలో జరిగిన మ్యాచ్ లో అతడు 195 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ నమోదు చేశారు.

ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు:

  • న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ‘ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు-2023’ గెలుచుకున్నారు.గతేడాది అతడు చూపిన ప్రతిభకు ఈ అవార్డు వరించింది.
  • 23 ఏళ్ల రచిన్ ప్రపంచ కప్ అరంగేట్ర మ్యాచ్ లోనే 123 పరుగులతో అజేయంగా నిలిచారు.
  • ప్రస్తుతం కివీస్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్నారు.

టీ 20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్:

  • భారత్ స్టార్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ను ప్రతిష్టాత్మక ICC అవార్డు లభించింది.
  • 2023 ఏడాదికి గాను టీ 20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు.
  • సూర్య ఈ ఘనత సాధించడం ఇది రెండోసారి కాగా..వరసగా రెండేళ్లు ఈ అవార్డు అందుకున్న ఏకైక క్రికెటర్ గా అయన చరిత్ర సృష్టించారు.

కింగ్ కోహ్లీ సరికొత్త రికార్డు:

  • గత ఏడాది ప్రదర్శన ఆధారంగా ఐసీసీ వన్డే  దక్కించుకున్న విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు.
  • అత్యధిక సార్లు(14) ఐసీసీ జట్టులో స్థానం పొందిన భారత ఆటగాడిగా ఘనత సాధించారు.
  • రెండో స్థానంలో ధోనీ(13) ఉండగా ఆ తర్వాత రోహిత్(8) సచిన్(7),సెహ్వాగ్(6),బుమ్రా(4),అశ్విన్(4) ఉన్నారు.
  • కోహ్లీ గత ఏడాది 24 వన్డేల్లో 72.47 సరాసరితో 1377 పరుగులు చేశారు.ఇందులో 6 సెంచరీలు,8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఐసీసీ జట్లలో భారత్ క్రికెటర్లదే హవా:

  • ఐసీసీ ఇవాళ టీ20,వన్డే,టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2023ను ప్రకటించింది.
  • ఈ మూడు జట్లలో కలిపి భారత్ నుంచి అత్యధికంగా 12 మంది స్థానం దక్కించుకున్నారు.
  • ఆ తర్వాత ఆస్ట్రేలియా(7),ఇంగ్లాండ్(3),న్యూజిలాండ్(3),సౌతాఫ్రికా(2),జింబాబ్వే(2),వెస్టిండీస్(1),శ్రీలంక(1),ఐర్లాండ్(1),ఉగాండా(1) ఉన్నాయి.
  • పాకిస్థాన్,ఆఫ్ఘనిస్థాన్,బంగ్లాదేశ్,నెదర్లాండ్స్,స్కాట్లాండ్ నుండి ఒక్కరు స్థానం దక్కించుకోలేదు.

2 thoughts on “ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) అవార్డులు-2023”

Leave a comment

error: Content is protected !!