దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన ప్రారంభం-Atal Setu

దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన:

పీఎం మోడీ గారు దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతును ప్రారంభించడం జరిగింది.ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా శేవా వరకు రూ.21,200 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు.దీనికి మాజీ పీఎం అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ‘అటల్ సేతు’గా నామకరణం చేశారు.ఈ వంతెన మొత్తం పొడవు-21.8 కి.మీ

India's Longest Sea Bridge-Atal Setu in Telugu

Atal Setu:

ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(MTHL)-అటల్ సేతు వంతెనను మోడీ గారు 12వ తేదీన ప్రారంభించడం జరిగింది.అయిదేళ్ల సమయంలో ఈ వంతెన నిర్మించబడింది.వంతెన భూకంప నిరోధకత,సముద్ర జీవుల రక్షణ,శబ్దం తగ్గించే సాంకేతికతో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ అటల్ సేతు యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు:

1)ఈ వంతెన భూకంప-నిరోధక సాంకేతికతను కలిగి ఉంది,మరియు ఇది 6.5 రిక్టర్ స్కేల్ పై పాయింట్ వరకు భూప్రకంపాన్ని తట్టుకుంటుంది.

2)ఆర్థోట్రోపిక్ స్టీల్ డెక్ అనే ఈ సాంకేతికత మొదటిసారి భారత్ లో వాడటం జరిగింది.

3)రివర్స్ సర్క్యులేషన్ రింగ్స్ అనే ఈ సాంకేతికత సౌండ్ మరియు వైబ్రేషన్ తగ్గించడానికి అమలు చేయబడిన ఈ సాంకేతికత సమీపంలోని సముద్ర జీవులను రక్షించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

4)నాయిస్ తగ్గింపు చర్యలలో భాగంగా వంతెనలో నాయిస్ సైలెన్సర్ మరియు శబ్ద ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి.

5)ఎకో-ఫ్రెండ్లీ లైటింగ్ వంతెనపై లైటింగ్ సిస్టం జల పర్యావరణానికి అంతరాయం కలగకుండా రూపొందించబడింది.

6)MTHL ఓపెన్ రోడ్ టోలింగ్ వ్యవస్థను కల్గి ఉండటం వలన ఇది టోల్ గేట్స్ వద్ద పొడవైన క్యూల సమస్యను పరిష్కరిస్తుంది.అధునాతన స్కాన్ చేయగలవు మరియు ఎలక్ట్రానిక్ పద్దతిలో టోల్ వసూలు చేయగలవు,నిరీక్షణ సమయాన్ని పూర్తిగా తగ్గిస్తాయి.

7)డ్రైవర్లకు రియల్-టైం లో జరుగుతున్నా సంఘటనల సమాచారాన్ని అందించడానికి వంతెన నిర్దిష్ట వ్యవధిలో డిస్ప్లేలను కూడా కల్గి ఉంటుంది.వారి మార్గంలో ట్రాఫిక్ జాములు లేదా ప్రమాదాల గురించి తెలియజేయబడుతుంది.

టోల్ ట్యాక్స్ ఎంత అంటే???

MMRDA ఈ వంతెన యొక్క టోల్ టాక్స్ పై కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.దీనిపై టోల్ టాక్స్ 500 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది.22 కి.మీ. వంతెన పైనుండి ప్రజలు వెళ్ళాలి అంటే 250 రూపాయలు చెల్లించాలి.ముంబై పోలీసులు గరిష్ట వేగాన్ని కూడా నిర్ధారించడం జరిగింది.గంటకి 100 కి.మీ. నిర్ధారించారు దీనితో పాటుగా వంతెన ఎక్కే మరియు దిగే సమయంలో వేగం అనేది 40 కిలో మీటర్లకి మించవద్దు.ఇదే కాకుండా ఈ వంతెన పైన ఆటోస్,మోటార్ సైకిల్స్,మోపెడ్స్ మరియు ట్రాక్టర్లు కి అనుమతి లేదు.అటల్ సేతు ముంబై మరియు నావీ ముంబయిని కలుపుతుంది.దీనిద్వారా 2 గంటల ప్రయాణ సమయం 20 నిమిషాల్లోనే పూర్తీ అవుతుంది.చలి కాలంలో ఇక్కడికి వలస వచ్చే ఫ్లెమింగో దృష్టిలోకి తీసుకోవడం జరిగింది.దానికోసం వంతెన ప్రక్కనే సౌండ్ బారియర్ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సేతుపైన పడ్డ పక్షులకు ఎలాంటి హాని కల్గకుండా ఎలాంటి లైట్లను ఏర్పాటు చేసారు.

అటల్ సేతు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిగారి పేరుమీద నామకారణం జరిగింది.

అటల్ బిహారీ వాజపేయి:

1996 లో మొదటిసారి ప్రధానమంత్రిగా 13 రోజులు బాధ్యతలు స్వీకరించారు.రెండోసారి 1998 లో 13 నెలలు కొనసాగారు.1999 లో లోక్ సభ ఎన్నికల తర్వాత పీఎం గా పదవీప్రమాణం చేసి 2004 వరకు ప్రధాన మంత్రిగా కొనసాగారు.బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు 1994 లో లభించింది.

వీరిని వరించిన అవార్డులు-రివార్డులు:

నరేంద్ర మోడీ హయాంలో 2014 సంవత్సరంలో డిసెంబర్ 24 న భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది.అదేవిధంగా వీరి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది.2015 లో అప్పటి రాష్ట్రపతి అయినా ప్రణబ్ ముఖర్జీ గారు భారత్ రత్నని మార్చి 27 న అందించడం జరిగింది.ఈ అవార్డు స్వయంగా రాష్ట్రపతి వాజపేయి ఇంటికి వచ్చి అందించాలరు.పద్మవిభూషణ్ 1992వ సంవత్సరంలో,డిలీట్ గౌరవ పురస్కారం  కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి,లోకమాన్య తిలక్ అవార్డు 1994లో,బెస్ట్ పార్లమంట్ పురస్కారం 1994 వ సంవత్సరంలో,గోవింద్ వల్లభ్ పంత్ అవార్డు 1994 వ సంవత్సరంలో 2014 లో భారతరత్న ప్రకటించి 2015 లో పురస్కారం అందించడం జరిగింది.

Also Read : Who won Swachh Survekshan Awards-2023

2 thoughts on “దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన ప్రారంభం-Atal Setu”

Leave a comment

error: Content is protected !!