Daily Current Affairs in Telugu 31 January 2024

Daily Current Affairs in Telugu 31 January 2024

Daily Current Affairs in Telugu 31 January 2024:

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు:

  • జనవరి నెలలో కలెక్షన్లు గత ఏడాదితో  పోలిస్తే 10.4 శాతం పెరిగినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.రూ.1.72 లక్షల కోట్లు  వసూలైనట్లు వెల్లడించింది.ఫైనల్ వసూళ్లు పెరిగినట్లు వెల్లడించింది.ఫైనల్ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
  • నెలల వారీగా చూసుకుంటే ఇది రెండో అత్యధికం కావడం విశేషం.
  • కాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో జి.ఎస్.టి. వసూళ్లు సగటున నెలకు రూ.1.67 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఎంపీగా ప్రమాణం చేసిన స్వాతి మలివాల్:

  • ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ ప్రమాణం చేయించారు.
  • కాగా స్వాతిని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది.ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలపై ఆమె పోరాటం చేసారు.

మరొకసారి ఏ.సీ.సీ. చీఫ్ గా జై షా:

  • ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బీసీసీఐ కార్యదర్శి జై షా మూడోసారి ఎన్నికయ్యారు.బాలిలో జరిగిన ఏసీసీ వార్షిక సమావేశంలో షా పేరును శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమీ సిల్వా ప్రతిపాదించగా.. సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయి.
  • షా 2021 జనవరి ఏ.సీ.సీ. అధ్యక్షుడయ్యాడు.
Also Read: Daily Current Affairs in Telugu 27 January 2024

మంచు చిరుతల సంఖ్య పెరుగుతోంది!

  • దేశంలో మొత్తం 718 మంచు చిరుత పులులున్నాయి.భారతదేశపు మొట్టమొదటి శాస్త్రీయ నివేదిక ప్రకారం కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాక్ లో అత్యధికంగా 477 మంచు చిరుతపులులు ఉన్నట్లు తేలింది.
  • తర్వాతి స్థానాల్లో ఉత్తరాఖండ్ లో 124,హిమాచల్ ప్రదేశ్ లో 51,అరుణాచల్ ప్రదేశ్ లో 36,సిక్కింలో 21,జమ్మూ కాశ్మీర్ లో 9 మంచు చిరుత పులులు ఉన్నాయి.
  • 1971 లొకేషన్లలో కెమెరాలను ఉంచి వాటి జాడను కనుగొన్నారు.

తొలిసారిగా మానవుని మెదడులో చిప్:

  • తమ న్యూరాలింక్ ప్రాజెక్టులో భాగంగా తొలిసారిగా మానవ మెదడులో చిప్ ను అమర్చామని టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రకటించారు.
  • సర్జరీ జరిగిందని,చిప్ అమర్చిన వ్యక్తి ఆరోగ్యాంగా ఉన్నాడని వెల్లడించాడు.ఆరంభ పనితీరు అద్భుతంగా ఉందని తెలిపారు.
  • ఈ పరిశోధనల కోసం 1500 జంతువుల్ని టెస్లా వధించిందన్న విమర్శలున్నాయి.అయినప్పటికీ అమెరికా ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ గత ఏడాది న్యూరాలింక్ కే అనుమతులు జారీ చేసింది.

మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్-యునెస్కో నామినేషన్లో:

  • యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ ను భారత్ పంపింది.2024-25 సంవత్సరానికి సంబందించిన నామినేషన్లకు మరాఠా రాజులు నిర్మించిన అసాధారణ సైనిక దుర్గాలను నామినేట్ చేసింది.
  • మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ లో 12 దుర్గాలున్నాయి.వాటిలో మహారాష్ట్రలోని సల్హేర్ కోట,శివ్ నేరి కోట,లోహ్ ఘడ్,ఖందేరి కోట,రాయ్ ఘడ్,ప్రతాప్ గడ్,సువర్ణ దుర్గం,పన్హాలా కోట,విజయ్ దుర్గం,సింధు దుర్గం,తమిళనాడులోని గింజీ కోట ఉన్నాయి.ఇవి మరాఠా పాలకుల శక్తి సామర్థ్యాలను చాటుతాయి.

జ్ఞానవాసీలో విష్ణువు,హనుమంతుడి విగ్రహాలు:

  • కాశీలోని జ్ఞానవాసి మసీదులో ఏ.ఎస్.ఐ. జరిపిన తవ్వకాల్లో విష్ణువు,హనుమంతుడి విగ్రహాలు వెలుగుచూసినట్లు సమాచారం.
  • జ్ఞానవాసి ఒకప్పుడు హిందూ దేవాలయమన్న వాదనల మేరకు కోర్టు అనుమతితో ఏ.ఎస్.ఐ. మసీదులో అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విగ్రహాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది.
  • ఇవి సుమారు క్రీస్తు శకం 5వ శతాబ్దం మధ్యకాలానికి చెందినవి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణకు 13 ఖేళో ఇండియా కేంద్రాలు:

  • విశ్వ క్రీడల్లో పతకాలతో సత్తా చాటుతున్న భారత్ మరింత మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఖేళో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.అందులో భాగంగా భారత క్రీడా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణకు 13 కేంద్రాలను మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.

మలేషియా కొత్త రాజుగా???

  • మలేషియా రాజుగా జోహోర్ సుల్లాన్ ఇస్కాందర్ ప్రమాణ స్వీకారం చేసారు.
  • 65 ఏళ్ల ఇస్కాందర్ ఇప్పటివరకు జోహోర్ రాష్ట్రాన్ని పాలించారు.ఇప్పుడు మలేషియా 17వ రాజుగా గద్దెనెక్కారు.
  • అయన దేశంలోనే అత్యంత సంపనుల్లో ఒకరు.ఇతనికి రియల్ ఎస్టేట్,మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి.
  • 300కు పైగా లగ్జరీ కార్లు ఇతడి సొంతం.బోయింగ్ 737తో పాటు,ప్రైవేట్ జెట్ లు కూడా ఉన్నాయి.సుల్తాన్ కుటుంబానికి సొంత సైన్యం కూడా ఉంది.

ఝార్ఖండ్ సీఎం గా చంపై సోరేన్:

  • సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్న ఛాంపై సోరెన్ ను జేఎంఎం ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
  • ఈ మేరకు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు,సీఎం ప్రమాణ స్వెకారానికి ఆహ్వానించాలని ఎమ్మెల్యేలు కోరారు.

స్టూడెంట్ వీసాల్లో హైదరాబాద్ టాప్:

  • విద్యార్థులు వీసా మంజూరులో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
  • ఢిల్లీ,ముంబై,చెన్నై కంటే హైదరాబాద్ నుంచే అత్యధిక వీసాల జారీ జరిగింది.
  • భారత్ నుంచి అమెరికా వెళ్తున్న ప్రతీ 10 మందిలో ఒకరు హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు.కాగా గతేడాది 14 లక్షల మంది భారతీయులకు యూఎస్ వీసా జారీ చేసింది.అలాగే విజిటింగ్ వీసా వెయిటింగ్ పీరియడ్ సమయం కూడా 75 శతం తగ్గింది.

వ్యాఘ్రేశ్వరుడు గోల్డ్ అవార్డు:

  • వైజాగ్ కు చెందిన ప్రఖ్యాత వెన్నెముక సర్జన్ డా.వి.అరుణ్ కుమార్ వ్యాఘ్రేశ్వర్ గోల్డ్ మెడల్ తో సత్కరించబడ్డారు.
  • వీరు ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్ర చికిత్సలో నిపుణుడు.

కాశ్మీర్:ట్రావెల్స్ ఇన్ పారడైస్ ఆన్ ఎర్త్:

  • రొమేష్ భట్టాచార్య రచించిన కాశ్మీర్:ట్రావెల్స్ ఇన్ పారడైస్ ఆన్ ఎర్త్ అనే పుస్తకాన్ని ప్రచురించినట్లు హార్పర్ కాలిన్స్ ప్రకటించింది.
  • అనుభవజ్ఞుడైన ట్రెక్కర్ రాసిన ఈ పుస్తకం కాశ్మీర్ యొక్క వైభవాన్ని వివరిస్తుంది.

ఏక్ సమందర్-మేరే అందర్:

  • ఏక్ సమందర్-మేరే అందర్ పుస్తకాన్ని బ్రహ్మోస్ ఏరోస్పేస్ డిప్యూటీ సీఈఓ సంజీవ్ జోషి గారు రచించడం జరిగింది.
  • ఇందులో అతని యొక్క వివిధ అనుభవాలను మరియు రక్షణ రంగం నిజ జీవితంలో ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలను ప్రస్తావించారు.

న్యూ సోలార్ పాలసీ 2024:

  • న్యూఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ సోలార్ పాలసీ 2024 ని నగరంలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు సోలార్ ఎనర్జీని అడాప్ట్ చేసుకునే విధంగా పరిచయం చేస్తుంది.
  • ఇది 2016 సోలార్ పాలసీ ఆధారంగా మరియు దీనిలో దాదాపుగా 1500MW సోలార్ పవర్ కెపాసిటీ వరకు స్థాపించడం జరిగింది.దీని విజయం ఆధారంగా ఈ పాలసీని తీసుకురానుంది.

479 thoughts on “Daily Current Affairs in Telugu 31 January 2024”

  1. kamplengan hk
    It’s perfect time to make a few plans for
    the long run and it’s time to be happy. I have read this put up and if I could I desire
    to suggest you few interesting things or tips. Maybe you could write subsequent
    articles regarding this article. I want to read more things approximately it!

    Reply
  2. data hk data hk data
    hk data hk
    Magnificent beat ! I would like to apprentice
    while you amend your website, how could i subscribe
    for a blog site? The account aided me a acceptable deal.
    I had been a little bit acquainted of this your broadcast provided bright clear
    idea

    Reply
  3. birutoto birutoto birutoto
    I absolutely love your blog.. Very nice colors & theme.
    Did you develop this site yourself? Please reply back as I’m
    wanting to create my own personal blog and would like to find out where you got this from or
    just what the theme is named. Thank you!

    Reply
  4. akun demo akun demo akun demo
    I was recommended this website by way of my cousin. I’m not sure whether this put up
    is written by him as no one else realize such detailed approximately my problem.
    You are amazing! Thank you!

    Reply
  5. Great V I should definitely pronounce, impressed with your web site. I had no trouble navigating through all tabs and related info ended up being truly easy to do to access. I recently found what I hoped for before you know it in the least. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or something, web site theme . a tones way for your customer to communicate. Excellent task..

    Reply

Leave a comment

error: Content is protected !!