సైబర్ నేరాల ఫిర్యాదు నంబరు మరింత బలోపేతం

Cyber Crime Number 1930 మరింత బలోపేతం:

  • పెరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రణ చేయడానికి హోమ్ అఫైర్స్ మంత్రిత్వ తీసుకువచ్చిన ఫిర్యాదు నంబర్ 1930ను మరింత బలోపేతం చేస్తుంది.
  • సైబర్ మోసాల బారినపడిన వారు దీనికి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుంటారు.కానీ ఎక్కువగా కాల్స్ రావడం వాళ్ళ ఈ నంబర్ ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉంటుంది.
  • దీనికి పరిష్కారంగా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా లింకును మెస్సేజ్ చేయనున్నారు.
  • దీనిద్వారా బాధితుడి వివరాలు సేకరించి తరువాత దర్యాప్తు వేగవంతం చేయనున్నారు.
  • ప్రయోగాత్మక పరిశీలనలో ఉన్న దేనిని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తారు.

గతంలో సైబర్ నేరాల నమోదు ఇలా:

  • గతంలో సైబర్ మోసాలకు ఎదుర్కున్న వారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తే,సిబ్బంది బాధితుడి ఖాతా ఉన్న బ్యాంకుకి లెటర్ రాసి,నిధులు బదిలీ కాకుండా ఆపాలని కోరేవారు.దీనికి చాలా సమయం పట్టేది.
  • చాలా బ్యాంకులు సరిగ్గా స్పందించేవారు కాదు.ఈలోపు నేరగాళ్లు బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకునేవారు.డబ్బు డ్రా చేసిన తర్వాత ఫిర్యాదు నమోదు చేసినా ఉపయోగం ఉండదు.
  • దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను సమన్వయ పరచి ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ పరిధిలోకి తెచ్చారు.
  • 1930 నంబరుకి కాల్ చేస్తే వెంటనే సిబ్బంది బ్యాంకును అప్రమత్తం చేసి సైబర్ దాడికి గురి అయినా ఖాతా నుండి నగదు బదిలీ అవ్వకుండా ఆపుతారు.
  • ఆ తర్వాతా విచారణ జరిపి సైబర్ నేరం జరింగింది అని నిర్ధారణ జరిగితే ఆ డబ్బు తిరిగి బాధితుడి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.

గత ఏడాది కేసులు:

  • 2023 సంవత్సరంలో దేశంలో అత్యధికంగా తెలంగాణాలో 107కోట్ల సొమ్మును ఆపగలిగారు.అయితే నేరం జరిగిన తరువాత ఎంత వేగంగా పిర్యాదు చేస్తే డబ్బు తిరిగి రాబట్టేందుకు అంత అవకాశం ఉంటుంది.
  • ఈ నేపథ్యంలో 1930కి రోజూ వేళల్లో కాల్స్ వస్తున్నాయి.
  • గత ఏడాది తెలంగాణ నుంచే 85,030 ఫిర్యాదులు వెళ్లాయి.

కాల్ చేస్తే లింక్ వెళ్లేలా:

  • ఈ క్రమంలోనే ఎంగేజ్ సమస్య ఉత్పన్నమవుతుంది.ఇక మీదట ఎంగేజ్ వస్తే ఆటోమేటిక్ గా ఒక లింకు వెళ్లేలా చూస్తున్నారు.దాన్ని తెరవగానే అందులో అడిగిన వివరాలను పూరించి తిరిగి అదే నంబరుకి పంపించాల్సి ఉంటుంది.ఇలా చేయడం ద్వారా ఐ4సి రికార్డుల్లో నిక్షిప్తమవుతుంది.
  • దీనివల్ల ఫిర్యాదు చేరి,డబ్బు నేరస్తుల ఖాతాల్లో జమకాకుండా చూడవచ్చు.ఈ కొత్త విధానం విజయవంతమైందని,త్వరలో అందుబాటులోకి తెస్తామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు.

 

 

1 thought on “సైబర్ నేరాల ఫిర్యాదు నంబరు మరింత బలోపేతం”

Leave a comment

error: Content is protected !!