మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కి దేశ అత్యున్నత పురస్కారం

ఈ సంవత్సరం దేశ అత్యున్నత పురస్కారం వీరికే:

బీహార్ యొక్క మాజీ సీఎం మరియు సోషలిస్టు నేత అయినా ఠాకూర్ గారికి దేశం యొక్క అత్యున్నత పురస్కారం అయిన భారత్ రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.భారత రత్న అవార్డు పొందనున్న వారిలో 49వ వ్యక్తి ఠాగూర్.మరణాంతరం ఇతనికి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది.

కర్పూరి ఠాకూర్ ఎవరంటే???

  • కర్పూరి ఠాకూర్ గారు 1924వ సంవత్సరం జనవరి 24వ తేదీన జన్మించారు.
  • బీహార్ రాష్ట్రానికి చెందిన ఇతను రాజకీయ నాయకుడు.ప్రజలందరూ ఇతనిని ప్రజా నాయకుడు అని పిలుస్తూ ఉండేవారు.
  • ముఖ్యమంత్రిగా వీరు 1970 డిసెంబర్ నుండి 1971 జూన్ వారికి మరియు 1977 డిసెంబర్ నుండి 1979 ఏప్రిల్ వరకు  బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది.
  • కర్పూర ఠాకూర్ బీహార్ లో ఉన్న సమస్తిపూర్ జిల్లాలోని గ్రామంలో గోకుల్ ఠాకూర్ మరియు రామదులారి దేవి దంపతులకు జన్మించారు.
  • వీరు పుట్టిన గ్రామం పేరును వీరు మరణించిన తర్వాత ఈయన పేరు మీదుగా కర్పూరి గ్రామంగా పేరు మార్చడం జరిగింది.
  • విద్యార్థిగా ఉన్నప్పుడే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు.
  • 1942-45 మధ్యన జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యి కొన్ని నెలలు జైలులో ఉన్నారు.
  • మధ్యలో కాలేజీ చదువు మానేసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు.
  • స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నందుకు గాను 26 నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

పాఠశాల ఉపాధ్యాయునిగా:

  • స్కూల్ లో టీచర్ గా కూడా పనిచేశారు.
రాజకీయ ప్రవేశం:
  • 1952లో తేజ్ పూర్ నియోజక వర్గం  అభ్యర్థిగా బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కావడం జరిగింది.
  • 1967-68 లో రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిష్టర్ గా కూడా సేవలందించారు.
నిరసనలు:
  • 1960లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సార్వత్రిక సమ్మె సందర్బంగా పీ అండ్ టీ అధికారులకు నాయకత్వం వహించినందుకు అరెస్టయ్యాడు.
  • 1970లో టెలి కమ్యూనికేషన్స్ కార్మికులు తమ లాభాలను కాపాడుకోవడానికి 28 రోజుల నిరాహార దీక్ష చేసాడు.

బీహార్ తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి:

  • 1970 వ సంవత్సరంలో బీహార్ తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించి కర్పూరి ఠాకూర్ రికార్డు సృష్టించారు.

సంపూర్ణ మద్యపాన నిషేధ అమలు:

  • బీహార్ లో వీరు1970 లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు పరిచారు.
  • ఇంగ్లీష్ ను మెట్రిక్యులేషన్ లో తప్పనిసరి సబ్జెక్టుగా తొలగించడం జరిగింది.
  • సోషలిస్టు నాయకుడు అయినా జయప్రకాష్ నారాయణ్ తో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండేవాడు ఠాకూర్.

బలహీన వర్గాలకి రిజర్వేషన్లు:

  • బీహార్ రాష్ట్రంలో బలహీనమైన వర్గాలకు రిజర్వేషన్లు ఠాకూర్ అమలుచేసిన సీఎంగా గుర్తింపు పొందారు.

మరణం:

  • ఫిబ్రవరి 17వ తేదీన 1988వ సంవత్సరంన వీరు మరణించారు.

2 thoughts on “మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కి దేశ అత్యున్నత పురస్కారం”

Leave a comment

error: Content is protected !!