తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ గా మహేందర్ రెడ్డి

TSPSC చైర్మన్ గా విశ్రాంత డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి:

  • తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేసింది.ఇందులో చైర్మన్ తో పాటు మరో అయిదుగురు సభ్యులున్నారు.
  • చైర్మన్ గా విశ్రాంత డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి,సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అనితా రాజేంద్ర,విశ్రాంత పోస్టుల సర్వీసు అధికారి ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్,JNTU ప్రొఫెసర్ మర్రి యాదయ్య,జెన్ కో ED యరబాడీ రామమోహన్ రావు,మాజీ మున్సిపల్ కమిషనర్ పాల్వాయి రజనీ కుమారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేసారు.

గతంలో చైర్మన్ వ్యవహరించిన బి.జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు రాజీనామా చేసారు.అనంతరం కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.చైర్మన్ గా  IPS అధికారి మహేందర్ రెడ్డి,సభ్యులుగా అయిదుగురు పేర్లను ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకి ప్రతిపాదించింది.పరిశీలించిన ఆమె వాటిని ఆమోదించారు.

ముదిరెడ్డి మహేందర్ రెడ్డి:

  • మహేందర్ రెడ్డికి పోలీసు శాఖలో సంస్కరణలకు ఆద్యుడిగా,ధీశాలిగా పేరుంది.
  • సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు.
  • వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఆయన సొంతగ్రామం కిష్టాపురం.వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ చదివారు.
  • ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చదువుతూ 1986లో సివిల్స్ కు ఎంపిక అయ్యారు.
  • సైబరాబాద్ కమిషనర్ గా నాలుగేళ్లు పనిచేసారు.
  • గ్రేహౌండ్స్ లో కమాండో ఆర్గనైజేషన్ చీఫ్ గా,ఇంటెలిజెన్స్ ఐజీ గా,హైదరాబాద్ సీపీ గా పనిచేసారు.
  • డీజీపీగా ఫ్రెండ్లీ పోలీస్ శాఖలో 30 ఏళ్ల పాటు పనిచేసిన ఆయనకు ఐపీఎం,పీఎం,పిపిఎం అవార్డులు లభించాయి.

అనితా రాజేంద్ర:

  • ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్,విశ్రాంత ముఖ్య కార్యదర్శి,తెలంగాణ ప్రభుత్వం  చెందిన అనితా రాజేంద్ర 1992లో ప్రభుత్వ సర్వీసుల్లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు.
  • పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ శాఖకు పలు అవార్డులు లభించాయి.
  • 2023 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు.

యరబాడి రామమోహన్ రావు:

  • రామమోహన్ రావు 1986లో విద్యుత్తూ బోర్డులో ఏఈ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ జెన్ కోలాలో ఈఈ,ఎస్ ఈ,సీఈ గా పనిచేసారు.
  • 2022లో తెలంగాణ జెన్ కో జల విద్యుత్తూ విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు గా పదోన్నతి పొంది ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్నారు.

నర్రి యాదయ్య:

  • సీనియర్ ప్రొఫెసర్,JNTU హైదరాబాద్ యాదాద్రి జిల్లా సర్వేల్ లోని మల్లారెడ్డిగూడకి చెందిన నర్రి యాదయ్య 1992లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బోధన వృత్తిని ప్రారంభించారు.
  • JNTU హైదరాబాద్ కు నాలుగున్నరేళ్లుగా రిజిస్ట్రార్ గా,ప్రిన్సిపాల్,వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేశాడు.
  • 2016 నుంచి ఈఈఈ విభాగం సీనియర్ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు.

పాల్వాయి రజినీకుమారి:

  • పాల్వాయి రజినీ కుమారి 1996లో నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో టీచరుగా నియమితులయ్యారు.
  • 2000 సంవత్సరంలో గ్రూప్-1 సర్వీసుకు ఎంపిక అయ్యారు.
  • 2004లో సర్వీసుకు రాజీనామా చేసి సూర్యాపేట నుంచి తెదేపా తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు.
  • 2014లో తుంగతుర్తి నుంచి బరిలో నిలిచారు.
  • అనంతరం భాజపాలో …గత ఏడాది కాంగ్రెస్ లో చేరారు.

ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్:

  • హైదరాబాద్ కు చెందిన అమీరుల్లాఖాన్ 1993లో ఇండియన్ పోస్టల్ సర్వీసుకు ఎంపిక అయ్యారు,
  • 1995లో స్వచ్చంద పదవీ విరమణ చేసారు.
  • 2004లో ఢిల్లీ జీఎంఐ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డీ. పొందారు.
  • ఉర్దూ యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ శిక్షణకు డైరెక్టర్ గా పనిచేశారు.
  • బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్ గా,పాలసీ అడ్వైజర్ గా వ్యవహరించారు.
  • గ్లోకల్ యూనివర్సిటీకి వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్.

Leave a comment

error: Content is protected !!