Today Top Current Affairs in Telugu
24 February 2024 Current Affairs in Telugu
1)లడఖ్ లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏ సరస్సులో మొట్టమొదటి ఫ్రోజెన్ లేక్ మారథాన్ నిర్వహించబడుతుంది?
-పాంగోంగ్ త్సో సరస్సు
2)ఆయుష్ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ ను ఎవరు ప్రారంభించారు?
-సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్
3)ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద గోల్డెన్ కార్డుల జారీలో ఏ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది?
-మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా
4)భారత ప్రభుత్వం అంతరిక్ష రంగంలో ఎంత శాతం ఎఫ్.డి.ఐ.ని ఆమోదించింది?
-100 శాతం
5)ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొదటి తాబేలు సంరక్షణ రిజర్వ్ ఏ జిల్లాలో ఏర్పాటు చేయబడింది?
-గోండా జిల్లా
6)మార్చి 1 నుండి ఏ దేశంలో అంతర్జాతీయ గీతా మహోత్సవ్ నిర్వహించనున్నారు?
-శ్రీలంకలోని కొలొంబో
7)ఇటీవల మరణించిన స్టార్ ఫుట్ బాల్ క్రీడాకారుడు ఆండ్రియాస్ బ్రెహ్మ్ ఏ దేశానికి చెందిన వాడు?
-జర్మనీ
8)బ్యాగ్ ఎక్విప్డ్ స్కూల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
-మధ్యప్రదేశ్
9)ఇంటర్నేషనల్ ట్రావెల్ షో 2024 కి హోస్టుగా మారిన రాష్ట్రం ఏది?
-ఉత్తరప్రదేశ్ లోని నోయిడా
10)అంతర్జాతీయ సౌర కూటమిలో నూతనంగా చేరిన 119 వ దేశం ఏది?
-మాల్టా