పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది.
పశు సంవర్ధక,మత్స్య,ఉద్యానవన,వ్యవసాయ,ఇంజనీరింగ్,నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరాలంటే ఇందులో అర్హత సాధించాలి.
TS Polycet 2024 Notification Released
TS Polycet 2024 Important Dates
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 15 ఫిబ్రవరి 2024 |
అప్లికేషన్ చివరి తేదీ | 22 ఏప్రిల్ 2024 |
ఆలస్య రుసుముతో చివరి తేదీ | 24 ఏప్రిల్ 2024 |
పరీక్ష తేదీ | 17 మే 2024 |
ఫిబ్రవరి 15వ తేదీ నుండి ఏప్రిల్ 22 వరకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది.ఆలస్య రుసుము 100/- లతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు వివరాలు:
ఎస్సి మరియు ఎస్టీలకు 250/- ఇతరులకు 500/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అర్హత:
- పాలీసెట్ పరీక్షకు అప్లై చేయాలంటే అభ్యర్థి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే సెకండరీ స్కూల్ పరీక్ష ఎస్.ఎస్.సి. లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- పరీక్షకు హాజరు కావాలంటే విద్యార్థి ఖచ్చితంగా భారతీయుడై ఉండాలి.
- NIOS,APOSS,CBSE,ICSE తెలంగాణ రాష్ట్రంలో SSC కి సమానమైన బోర్డుగా గుర్తించదగిన బోర్డు నుండి విద్యార్థులు ఫిజిక్స్,కెమిస్ట్రీ,మ్యాథెమటిక్స్ వంటి అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి.
- విద్యార్థులు అర్హత పరీక్ష అయిన SSCలో కనీసం 35% మార్కులు సాధించి ఉండాలి మరియు ఫిజిక్స్,కెమిస్ట్రీ మరియు మాథెమాటిక్స్ వంటి సబ్జెక్టులలో కనీసం 35% మార్కులు సాధించి ఉండాలి.
అప్లికేషన్ విధానం:
- పాలిసెట్ వెబ్సైటు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి వివరాలు నింపాలి.
- రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసిన తరువాత మొబైల్ నంబర్ ను ఓటీపీ తో ద్రువీకరించాలి మరియు ఇదే నంబరుకి SMS ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ పంపించబడుతుంది.
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ తో పాలీసెట్ అప్లికేషనులో లాగిన్ అవ్వాలి.
- Pay Now పై క్లిక్ చేయాలి.
- చెల్లింపు గేట్ వేని ఎంచుకొని,చెల్లింపు ప్రక్రియ కొనసాగించాలి.
- ఫీజు చెల్లించాక అప్లికేషన్ ఫిల్ చేయడం ప్రారంభించాలి.
- వ్యక్తిగత వివరాలను నమోదు చేసి,Get Details పై క్లిక్ చేయాలి.
- కమ్యూనికేషన్ వివరాలను నమోదు చేసి,Next పై క్లిక్ చేయాలి.
- కేటగిరీ వివరాలను నమోదు చేసి,Next పై క్లిక్ చేయాలి.
- ప్రత్యేక కేటగిరీ వివరాలను నమోదు చేసి,Next పై క్లిక్ చేయాలి.
- పరీక్షా కేంద్రం వివరాలను నమోదు చేసి,Next పై క్లిక్ చేయాలి.
- తరువాత స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేసి Next పై క్లిక్ చేయాలి.
- ఫోటో అండ్ సైన్ అప్లోడ్ చేసి,సేవ్ మరియు ప్రివ్యూపై క్లిక్ చేయాలి.
- జనరేట్ హాల్ టికెట్ పై క్లిక్ చేసి,పాలీసెట్ పరీక్ష కోసం హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
పరీక్ష జరిగే విధానం:
పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించబడుతుంది.
పరీక్ష నిర్వహించబడు సమయం:
2 1/2 గంటల సమయంలో పరీక్ష నిర్వహించబడుతుంది.
- 150 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ఉండి 150 మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఇవ్వడం జరుగుతుంది.
- నెగటివ్ మార్కింగ్ అనేది ఉండదు.
పరీక్షలో ఉండే విభాగాలు:
సెక్షన్ | సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | మార్కులు |
---|---|---|---|
I | మ్యాథెమటిక్స్ | 60 | 60 |
II | ఫిజిక్స్ | 30 | 30 |
III | కెమిస్ట్రీ | 30 | 30 |
IV | బయాలజీ | 30 | 30 |
మొత్తం మార్కులు | 150 | 150 |
- ఎంపీసీ(120 మార్కులు) మరియు MBiPc (150 మార్కులు) రెండు వేర్వేరు ర్యాంకులు రూపొందించడం జరిగింది.
- పాలిటెక్నిక్ లలో మరియు అగ్రికల్చరల్ డిప్లొమాలలో మరియు వెటర్నరీ మరియు హార్టికలుతురే డిప్లొమాలలో ప్రవేశం పొందడానికి రెండు వేర్వేరు ర్యాంకులు రూపొందించబడతాయి.
- ఎంపీసీ ర్యాంక్: SBTETకి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ లలో డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందే విద్యార్థులకు మ్యాథ్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ మార్కుల ఆధారంగా ర్యాంక్ జారీ చేయబడుతుంది.
- ఎం.బై.పి.సి. ర్యాంక్: PJTSAU,SKLTSHU,PVNRTVU డిప్లొమా కోర్సులలో మ్యాథ్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ మరియు బయాలజీలో పొందిన మార్కుల ఆధారంగా ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది.
పాలీసెట్ సిలబస్:
గణితం:
- బీజగణితం
- క్షేత్రగణితం
- జ్యామితి
- బహుపదులు
- వర్గీకరణ సమీకరణాలు
- సాంఖ్యక శాస్త్రం
- శ్రేఢులు
- సమితులు మరియు వాస్తవ సంఖ్యలు
- సంభావ్యత
- సంఖ్యా వ్యవస్థ
- ఉపరితల వైశాల్యాలు మరియు ఘన పరిమాణామాలు
- త్రికోణమితి
- రేఖీయ సమీకరణాలు
- మాథమెటికల్ మోడలింగ్
ఫిజిక్స్:
- ఉష్ణం
- ఆమ్లాలు,క్షారాలు మరియు లవణాలు
- రసాయన సమీకరణాలు మరియు ప్రతిచర్యలు
- మెటలర్జీ
- పరమాణు నిర్మాణం
- నునుపు తలం వద్ద కాంతి వక్రీభవనం
- విద్యుత్ ప్రవాహం
- కార్బన్ మరియు దాని సమ్మేళనాలు
- విద్యుదయస్కాంతం
- రసాయన బంధం
- మానవుని కన్ను మరియు రంగుల ప్రపంచం
- వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం
- కాంతి ప్రతిబింబం
- మూలకాల వర్గీకరణ
కెమిస్ట్రీ:
- పదార్థం యొక్క స్థితి
- రసాయన పరమాణు శాస్త్రం
- రసాయన గతి శాస్త్రం
- రసాయన మరియు అయానిక్ సమతుల్యత
- పరమణు నిర్మాణ శాస్త్రం
- విద్యుత్ రసాయన శాస్త్రం
- ఫేజ్ ఈక్విలిబ్రియం మరియు పరిష్కారాలు
- రోజువారీ జీవితంలో రసాయన శాస్త్రం
- రెడాక్స్ రియాక్షన్స్
- రసాయన ఉష్ణ గతిక శాస్త్రం
- పర్యావరణ రసాయన శాస్త్రం మరియు యూరియా పాలిమర్స్
- ఆర్గానిక్ కెమిస్ట్రీ
- స్టీరియో కెమిస్ట్రీ యొక్క ప్రాథమిక భావన
- మాలోనిక్ ఈస్టర్
పాలిసెట్ లో క్వాలిఫైయింగ్ మార్కులు:
- SBTET ద్వారా పాలిటెక్నిక్ కోర్సులో కౌన్సిలింగులో పాల్గొనాలంటే 120 మార్కులతో 30% అంటే మ్యాథ్స్,ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ కలిపి మొత్తం 36 మార్కులు రావాలి.
- SBTET కాకుండా మిగతా యూనివర్సిటీలు అయినా PJTSAU (లేదా)PVNRTVU(లేదా)SKLTSHU లలో కౌన్సిలింగ్ లో పాల్గొనాలంటే 120 మార్కులతో 30% అంటే గణితం(60/2),బయాలజీ,ఫిజిక్స్ తో కలిపి 36 మార్కులు రావాలి.
పాలిటెక్నిక్ లో సీటు పొందే విధానం:
- పాలిసెట్-పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టును స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్ నిర్వహిస్తుంది.
- పాలిసెట్ లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కింది కోర్సులలో సీటు కేటాయించబడింది.
- తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించే డిప్లొమా స్థాయి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ,గవర్నమెంట్ ఎయిడెడ్,ప్రయివేట్ అన్-ఎయిడెడ్ లో SBTET పాలిటెక్నిక్ లు మరియు ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ అన్-ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలలో నడుస్తున్నాయి.
- ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ అందించే డిప్లొమా కోర్సులు మరియు దానికి అనుబంధ పాలిటెక్నిక్ కోర్సుల్లో సీటు పొందవచ్చు.
- శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ అందించే డిప్లొమా కోర్సులు మరియు దానికి అనుబంధ పాలిటెక్నిక్ కోర్సుల్లో సీటు పొందవచ్చు.
- పి.వి.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం అందించే డిప్లొమా కోర్సుల్లో సీటు పొందవచ్చు.
- పాలిసెట్ కి హాజరైన అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులు కేటాయించబడతాయి.
- దీనిద్వారా అభ్యర్థులు SBTET అందించే డిప్లొమా కోర్సులను లేదా PJTSAU(లేదా)PVNRTVU(లేదా)SKLTSHU లలో అందించే కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు.
- పాలిటెక్నిక్ అందించే ఇంజనీరింగ్ లేదా నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందాలి అనుకునే అభ్యర్థులకు అడ్మిషన్ కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారం అవసరం లేదు,పాలిసెట్ కోసం నింపిన అప్లికేషన్ ఫారం సరిపోతుంది.
- PJTSAUలో అందించే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది.దీనిలోనే పాలిటెక్నిక్ కాలేజీల వివరాలు,ఖాళీల వివరాలు మరియు ఫీజుకు సంబంధించి అన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్సైటులో అఫీషియల్ వెబ్సైటులో ఉంచబడతాయి.
- PJTSAU యొక్క డిప్లొమా కోర్సుల సీట్లను భర్తీ పాలిసెట్ లో అభ్యర్థులు పొందిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.
- PVNRTVU ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది.
- PVNRTVU నిర్వహించే కౌన్సిలింగ్ లో పాలిసెట్ లో పొందిన ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేయడానికి ప్రత్యేక అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.
- PVNRTV యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైటులో సమాచారం ఇస్తారు.
- PVNRTVU ఎనిమల్ హస్బెండరీ మరియు ఫిషరీస్ కి సంబంధించిన కోర్సులను అందిస్తుంది.
- ఫార్మసీ మరియు హోటల్ మేనేజ్మెంట్ లలో ప్రవేశం పొందడానికి పాలిసెట్ అవసరం లేకుండానే దోస్త్ ద్వారా 10+2 అర్హతతో అప్లై చేసుకోవచ్చు.
- SKLTSHU ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది.
- SKLTSHU నిర్వహించే కౌన్సిలింగ్ లో పాలిసెట్ లో పొందిన ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేయడానికి ప్రత్యేక అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.
- SKLTSHU యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైటులో సమాచారం ఇస్తారు.
కోర్సు వివరాలు కోసం: క్లిక్ చేయండి
Also Read: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
I have recently started a website, the information you offer on this web site has helped me greatly. Thanks for all of your time & work.
I dugg some of you post as I thought they were invaluable handy