06 February 2024 Current Affairs in Telugu

06 February 2024 Current Affairs in Telugu

ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ నూతన కార్యదర్శి:

  • సమాచార మరియు ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
  • వీరు మహారాష్ట్ర కేడరుకు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

ఆపరేషన్ స్మైల్ ఎక్స్:

  • బాల కార్మికులను రక్షించేందుకు తెలంగాణ పోలీసులు ఆపరేషన్ స్మైల్ ఎక్స్ ని ప్రారంభించారు.
  • రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,479 మంది బాల కార్మికులను రక్షించారు.ఈ ఆపరేషన్ లో 676 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పారిస్ ఒలంపిక్స్-2024 టార్చ్ బేరర్:

  • దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా 2024 పారిస్ ఒలంపిక్స్ కు టార్చ్ బేరర్ గా ఎంపికయ్యాడు.
  • ఏప్రిల్ 16న  ఒలింపిక్ టార్చ్ రిలే ప్రారంభం అవుతుంది.
  • అభినవ్ బింద్రా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అథ్లెట్స్ కమిషన్ సభ్యుడు.

భారత్ లో మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ:

  • హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలో దేశంలోనే తొలి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీకి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసారు.దీనిని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించింది.
  • దీనిలో వివిధ భాషలు,కాలాలకు చెందిన సుమారు లక్ష ప్రాచీన శాసనాలను ఇందులో భద్రపరచనున్నారు.

ఉత్తరాఖండ్ హైకోర్టు మొదటి మహిళా సీజే:

  • ఉత్తరాఖండ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రీతూ బహ్రి నియమితులయ్యారు.రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ జస్టిస్ రీతూ బహ్రితో ప్రమాణం చేయించారు.
  • మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన విపిన్ సంఘీ స్థానంలో వీరు నియమితులయ్యారు.
  • అక్టోబర్ 2023లో జస్టిస్ రీతూ బహ్రి హర్యానా మరియు పంజాబ్ హైకోర్టు తాత్కాలిక హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.

రాజస్థాన్ అడ్వకేట్ జనరల్‌గా:

  • రాజస్థాన్ కొత్త అడ్వొకేట్ జనరల్ రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు.కొత్త అడ్వకేట్ జనరల్ నియామకానికి రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఆమోదం తెలిపారు.
  • ఈ విషయంలో జోధ్ పూర్ హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాధానం కోరిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కొత్త అడ్వొకేట్ జనరల్ ను నియమించారు.

ఇండియా ఎనర్జీ వీక్ 2024:

  • ప్రధాని మోడీ గారు గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ 2024లో ప్రారంభించారు.
  • ఇది భారత్ యొక్క ఇంధన రంగాన్ని ప్రోత్సహించడంలో ఒక గొప్ప మైలురాయి.
  • లక్ష్యం:కార్బన్ ఫూట్ ప్రింటును తగ్గించడానికి మరియు గ్రీన్ ఎనర్జీ వనరులను ప్రోత్సహించడం కోసం ఈ ఎనర్జీ వీక్ నిర్వహించబడుతోంది.
  • దాదాపు 100 కంటే ఎక్కువ దేశాల నుండి 4000 మందికి పైగా ప్రతినిధులతో సహా 35,000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఉల్లాస్ మేళా:

  • ఢిల్లీలోని నేషనల్ బాల భవన్ లో రెండు రోజుల ఉల్లాస్ మేళాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు.
  • పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం,విద్యా మంత్రిత్వ శాఖా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
  • వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఏడు వందల మంది పాల్గొనేవారితో పాటు విద్యా మంత్రిత్వ శాఖ మరియు వివిధ సంస్థల నుండి 100 మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

మొదటి BIMSTEC ఆక్వాటిక్స్ ఛాంపియన్ షిప్:

  • బిమ్స్‌టెక్ ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్స్-2024 న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది.
  • కేంద్ర యువజన కార్యక్రమం మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఛాంపియన్ షిప్ ను ప్రారంభించారు.
  • మొదటి BIMSTEC ఆక్వాటిక్స్ ఛాంపియన్ షిప్ ఫిబ్రవరి 6 నుండి 9 వరకు జరుగుతుంది.

మేరా గావ్,మేరీ ధరోహర్ కార్యక్రమం:

  • సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘మేరా గావ్,మేరా ధరోహర్’ కార్యక్రమం క్రింద అన్ని గ్రామాల మ్యాపింగ్ మరియు డాక్యుమెంటేషన్ను సిద్ధం చేస్తోంది.
  • ఈ మ్యాపింగ్ IGNCA-ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సమన్వయంతో అమలు చేయబడుతుంది.

బ్రాండ్ గార్డియన్ షిప్ ఇండెక్స్:

  • ముకేశ్ అంబానీకి బ్రాండ్ గార్డియన్ షిప్ ఇండెక్సులో వరుసగా రెండో ఏడాది ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు.
  • ఇదే సూచీలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ పోయిన సంవత్సరం 8వ స్థానం నుంచి ఈ సంవత్సరం 5వ స్థానంలోకి వచ్చేసారు.
  • మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా 6వ స్థానం,ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ 16వ స్థానంలో నిలిచారు.

డిజిటల్ డిటాక్స్ ప్రారంభించిన రాష్ట్రం:

  • కర్ణాటక ప్రభుత్వం,ఆల్ ఇండియా గేమ్ డెవలప్ ఫోరమ్ సహకారంతో డిజిటల్ డీటాక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
  • సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడం దీని లక్ష్యం.

ఈయూలో మొదటి డిజిటల్ స్కెంజెన్ వీసా:

  • డిజిటల్ స్కెంజెన్ వీసాల జారీకి ఫ్రాన్స్ చొరవ ప్రారంభించింది.ఈ వీసాను జారీ చేసిన యూరోపియన్ యూనియన్ లో మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది.
  • డిజిటల్ వీసాను కోరుకునే యూరోపియన్ యూనియన్ కానీ పౌరులకు నిర్దిష్టమైన అర్హత ప్రమాణాలు వివరించబడ్డాయి.
  • డిజిటల్ వీసా స్టిక్కర్ లను క్రిప్టోగ్రాఫికల్ సైన్ చేయబడిన బార్ కోడ్ లతో ఉంటుంది.

ఆస్ట్రేలియా సెనేటరుగా భారత సంతతి వ్యక్తి:

  • ఆస్ట్రేలియా సెనేటుకు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డు సృష్టించాడు.
  • 1980 లో వారి తల్లి తండ్రులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన వరుణ్ తన 17 ఏండ్ల వయస్సులో లేబర్ పార్టీలో చేరాడు.న్యాయవాది అయిన పశ్చిమ ఆస్టేలియాతో పాటు వరల్డ్ బ్యాంకుకు సేవలు అందించాడు.ఇలా పనిచేస్తూ పార్టీలో కూడా ఆక్టివ్ గా ఉండేవాడు.

బెస్ట్ గ్రీన్ బాండ్-కార్పొరేట్ అవార్డు:

  • మహారత్న సంస్థ ఇది విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఈ సంస్థ REC లిమిటెడ్,సస్టైనబుల్ ఫైనాన్స్ 2024 కోసం అసెట్ ట్రిపుల్ ఏ అవార్డులలో బెస్ట్ గ్రీన్ బాండ్ కార్పొరేట్ అవార్డును అందుకుంది.
  • 2023,ఇది భారత్ నుండి వచ్చిన మొదటి USD బాండ్.

Also Read: Telangana Open B.Ed. Notification

 

11 thoughts on “06 February 2024 Current Affairs in Telugu”

  1. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

    Reply
  2. Excellent beat ! I would like to apprentice at the same time as you amend your website, how could i subscribe for a weblog website? The account helped me a acceptable deal. I have been tiny bit acquainted of this your broadcast provided vivid transparent idea

    Reply

Leave a comment

error: Content is protected !!