03 February 2024 Telugu Current Affairs:
LK అద్వాణీకి భారతరత్న ప్రకటన:
- మాజీ ఉప ప్రధాని,బీజేపీ సహా వ్యవస్థాపకులు LK అద్వానీకి కేంద్రం భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది.
- దివంగత ప్రధాని,భారతరత్న వాజ్ పేయీ నేతృత్వంలో వీరు ఉప ప్రధానిగా పనిచేసారు.
- దేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని భారతరత్న పురస్కారం లభించడంతో ప్రధాని మోడీ గారు అద్వానీ గారికి అభినందనలు తెలిపారు.
INS సంధాయక్:
- తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన నేవల్ డాక్ యార్డు కార్యక్రమంలో INS సంధాయక్ నౌకను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేసారు.
- గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజినీర్స్ సంస్థ ఈ నౌకను నిర్మించింది.
- 110M పొడవు,3800 టన్నుల సామర్థ్యంతో పాటు హెలిపాడ్,సర్వేకు సంబంధించిన సాంకేతిక పరికరాలను నౌకలో ఏర్పాటు చేసింది.
- సముద్ర జలాల్లో నిఘా,సర్వే కోసం నేవీ దీన్ని వినియోగించుకోనుంది.
జైస్వాల్ డబుల్ సెంచరీ:
- ఇంగ్లాండుతో రెండో టెస్టులో డబుల్ సెంచరీ(209) చేసిన యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు.
- 22 ఏళ్ల 37 రోజుల వయసులో ద్విశతకం బాదిన మూడో భారత ప్లేయరుగా నిలిచారు.
- 1993లో వినోద్ కాంబ్లీ(21 ఏళ్ల 32 రోజులు) ఇంగ్లాండుపై,1971లో సునీల్ గవాస్కర్(21 ఏళ్ల 271 రోజులు) విండీస్ పై డబుల్ సెంచరీ చేసారు.
- అలాగే 2019లో మయాంక్ అగర్వాల్ తర్వాత టెస్టుల్లో భారత ప్లేయర్ ద్విశతకం బాదడం ఇదే తొలిసారి.
ఐరాస బడ్జెటుకు భారత్ విరాళం:
- అంతర్జాతీయ ఉమ్మడి వేదిక ఐక్యరాజ్య సమితి 2024 వార్షిక బడ్జెటుకు భారత్ దాదాపుగా రూ.32.89 మిలియన్ డాలర్ల(రూ.2730 కోట్ల)ను విరాళంగా ఇవ్వడం జరిగింది.
- సమయానికి ఐరాస బడ్జెటుకు విరాళాలు అందించిన గౌరవం పొందిన 36 దేశాల పక్కన భారత్ చేరింది.
ఐఐటీల్లో స్పోర్ట్స్ కోటా:
- అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలిసారిగా స్పోర్ట్స్ కోటను ప్రవేశపెట్టిన ఐఐటీగా ఐఐటీ మద్రాసు నిలించింది.
- 2024-25 అకాడమిక్ సెషన్ నుంచి ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అదనంగా రెండు సీట్లను ఇందుకోసం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ తెలిపారు.
- స్పోర్ట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అడ్మిషన్ ప్రోగ్రాం కింద సృష్టించిన ఈ రెండు సీట్లలో భారతీయ విద్యార్థులకు అడ్మిషన్ కోసం అవకాశం ఇస్తామని చెప్పారు.
- ఇందులో ఒకటి విద్యార్థినులకు రిజర్వు చేస్తామన్నారు.ఐఐటీల్లో ప్రస్తుతం స్పోర్ట్స్ కోటా లేదు.
ఒడిశాలో నూతన ప్రాజెక్టుల ప్రారంభం:
- ఒడిశాలో రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
- సంబల్ పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజెమెంట్ లో రూ.400 కోట్లతో శాశ్వత క్యాంపస్,విద్యుత్,రోడ్లు,రైల్వేలు వంటి వివిధ రంగాల్లో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోడీ ఆవిష్కరించారు.
- ఈ ఐఐఎం క్యాంపసుకు 2021లో మోదీ శంఖుస్థాపన చేసారు.
రూఫ్ టాప్ సోలార్ స్కీంలో పెంచిన సబ్సిడీ:
- ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు సబ్సిడీని పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి RK సింగ్ ప్రకటించారు.
- ప్రస్తుతం 40% ఉన్న ఈ సబ్సిడీని 60%కి పెంచుతున్నట్లు వెల్లడించారు.
- పర్వత,ఈశాన్య రాష్ట్రాలకు 70% సబ్సిడీ అందిస్తామన్నారు.ప్రజలపై భారం పడకుండా మిగిలిన మొత్తానికి లోన్ ఇచ్చి అధిక యూనిట్లు జనరేట్ అయితే వచ్చే ఆదాయంతో బాకీ వసూలు చేయాలని కేంద్ర విద్యుత్ సంస్థలకు సూచించారు.
పంజాబ్ గవర్నర్ రాజీనామా:
- పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేసారు.అలాగే కేంద్రపాలిత ప్రాంతం చండీఘడ్ అడ్మినిస్ట్రేటర్ గానూ తప్పుకుంటున్నట్లు చెప్పారు.వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భన్వరీలాల్ తెలిపారు.
15 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెటులోకి ఎంట్రీ:
- జింబాబ్వే మహిళా క్రికెటర్ బిలవుడ్ బిజా అరుదైన ఘనత సాధించారు.15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసారు.
- ఐర్లాండులో జరిగిన T20లో బిజాకు తుది జట్టులో చోటు దక్కింది.జింబాబ్వే మహిళా క్రికెటులో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కురాలిగా ఈమె రికార్డు సృష్టించింది.
- ఓవరాల్ గా అతి తక్కువ వయసులో క్రికెటులోకి అరంగేట్రం చేసిన రికార్డు పాక్ ప్లేయర్ సజ్జిద్ షా పేరిట ఉంది.ఈమె 12 ఏళ్ల వయసులోనే డెబ్యూ మ్యాచ్ ఆడింది.
చైనా జియ్ లాంగ్-3 ప్రయోగం విజయవంతం:
- చైనా జియ్ లాన్గ్ రాకెట్టును విజయవంతంగా ప్రయోగించింది.9 ఉపగ్రహాలను రోదసీలోకి పంపించింది.
- దక్షిణ గువాంగుడాండ్ ప్రావిన్సులోని యాంగ్జియాంగ్ తీరం నుండి ఈ ప్రయోగం చోటుచేసుకుంది.
- రోదసీ రంగాన్ని వాణిజ్యపరంగా విస్తరించాలని అధ్యక్షుడు జిన్ పింగ్ ఇచ్చిన పిలుపుమేరకు ప్రయోగాలను ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు.ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలను నిర్వహించనుంది.
జస్ప్రీత్ బుమ్రా కొత్త రికార్డు:
- వైజాగులో ఇంగ్లాండుతో జరుగుతున్నా రెండో టెస్టు మ్యాచులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త రికార్డును సృష్టించారు.
- మొత్తం ఆరు వికెట్లను పడగొట్టి టెస్టుల్లో అత్యంత వేగంగా 34 మ్యాచుల్లో 150 వికెట్లు సాధించిన భారత పేస్ బౌలరుగా నిలిచాడు.
- అశ్విన్ 29 మ్యాచుల్లో,జడేజా 32 మ్యాచుల్లో ఈ మైలురాయిని చేరారు.వేగంగా 150 వికెట్లు తీసిన తొలి ఐదుగురు భారత బౌలర్లలో బుమ్రా మాత్రమే పేసర్ కావడం విశేషం.
పేమెంట్ బ్యాంకుపై ఆంక్షలు విధించిన RBI:
- నిబంధనలను ఉల్లగించినందుకు పేటీఎం పేమెంట్ బ్యాంకుపై ఆంక్షలు విధిస్తున్నట్లు RBI ప్రకటించింది.
- బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్,1949లోని సెక్షన్ 35A ప్రకారం సెంట్రల్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్ మొబిలిటీ ఎక్స్పో ప్రారంభం:
- భారత్ మొబిలిటీ ఎక్స్పోను ప్రధాని నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో ఎక్స్పోను ఏర్పాటు చేసారు.
- భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ఎక్స్పోను నిర్వహించారు.
ట్రాయ్ నూతన చైర్మన్:
- TRAI టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మనుగా రైల్వే బోర్డు మాజీ చీఫ్ అనిల్ కుమార్ లాహోటి నియమితులయ్యారు.డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఈ నియామకాన్ని ఆమోదించింది.
గర్భాశయ ముఖద్వార క్యాన్సరుకు కొత్త ఔషధం:
- గర్భాశయ ముఖద్వార క్యాన్సరును తొలిదశలోనే గుర్తించి రోగనిరోధక వ్యవస్థను ఉద్దీపింపజేస్తే ఆ వ్యాధిని సమర్థంగా అరికట్టవచ్చని అమెరికాలో రట్జర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం తేల్చింది.
- హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుంది.
- ఈ వైరసును నిర్మూలించడానికి టీకాలను రూపొందించినా..పేద దేశాల మహిళలకు అవి అవి అందుబాటులో ఉండటం లేదు.
- భారత్ లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సరులో రెండో స్థానంలో ఉంది.
- దీని చికిత్సకు రేడియేషన్,మందులతో పాటు రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పెంబ్రోలిజుమాబ్ అనే కొత్త ఔషధాన్ని అమెరికా ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదించింది.
Also Read: 01 జనవరి 2024 Current Affairs In Telugu
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.