02 February 2024 Telugu Current Affairs

World Wet Land Day
             

02 February 2024 Telugu Current Affairs:

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం:

  • ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఫిబ్రవరి 2వ తేదీన జరుపుకుంటారు.
  • 2024 చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే: వెట్లాండ్స్ మరియు వెల్ బీయింగ్-మన జీవితాలను మెరుగుపరచడంలో చిత్తడి నేలలు పోషించే కీలక పాత్రను నొక్కి చెబుతుంది.
  • 1971లో అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఉన్న చిత్తడి నెలలపై రామ్ సర్ కన్వెన్షన్ పై సంతకం చేసిన గుర్తుగా ఫిబ్రవరి 2 న ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం.
  • భారత్ ఇందులో 1982వ సంవత్సరం నుండి ఈ కన్వెన్షన్ లో భాగస్వామిగా ఉంది .
  • 2024 సంవత్సరం వరకు భారత్ లో కొత్తగా 5 చిత్తడి నేలల చేరికతో ప్రస్తుత రామ్ సర్ సైట్ల సంఖ్యా 80కి చేరింది.
  • వీటిలో మూడు ప్రదేశాలు అంకసముద్రం బర్ద్ కన్జర్వేషన్ రిజర్వ్,అఘనాశిని ఈస్ట్యూరి మరియు మగాడి కేర్ కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటకలో ఉన్నాయి.మరో రెండు కరైవెట్టి పక్షుల సంరక్షణ కేంద్రం మరియు లాంగ్ వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడులో ఉన్నాయి.
  • కొత్తగా ఈ అయిదు చిత్తడి నేలలను చేర్చడంతో ప్రస్తుతం 1.33 మిలియన్ హెక్టార్ల వైశాల్యం ఆక్రమించాయి.
  • చిత్తడి నేలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు (16) ప్రథమ స్థానంలో ఉండంగా,తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్(10) ఉంది.

జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు???

  • జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఝార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నాయకుడు చంపై సొరేన్ ప్రమాణ స్వీకారం చేసారు.
  • ఈ రాష్ట్ర సీఎం అయిన హేమంత్ సోరెన్ గారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కేసులో అరెస్టు చేయడం జరిగింది.
  • వారి స్థానంలో జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ గారి చేత ఆ రాష్ట్ర గవర్నర్ అయినా రాధాకృష్ణన్ వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

లఖ్ పతి దీదీ పథకం:

  • ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ లో లఖ్ పతి దీదీ పథకం గురించి ప్రకటన చేసారు.
  • స్వయం సహాయక బృందాల క్రింద లఖ్ పతి దీదీ పథకం లక్ష్యాన్ని ప్రభుత్వం పెంచింది.
  • ఈ పథకం విజయం సాధించడంతో దీని యొక్క లక్ష్యాన్ని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పేర్చనున్నట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు.
  • ఈ పథకం క్రింద మహిళలకు ప్లంబింగ్,ఎల్.ఈ.డీ. బల్బుల తయారీ మరియు వాటి రిపేర్ లకు సంబందించిన శిక్షణ ఇస్తారు.
Also Read: Union Budget 2024 Highlights

సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్:

  • ఉత్తరాఖండ్ పోలీసులు ఇటీవల స్మార్ట్ పోలీసింగ్ ను ప్రోత్సహించే లక్ష్యంతో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయడం జరిగింది.
  • పర్యాటకులు మరియు స్థానిక పౌరుల భద్రతా కోసం హరిద్వార్ లోని పోలీసులు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటరులతో పెట్రోలింగ్ చేస్తారు.ఈ స్కూటర్లను ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకును విరాళంగా అందించింది.

ఉత్తరాఖండ్ UCC కమిటీ చైర్మన్:

  • ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ కమిటీ  చైర్ పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ సభ్యులతో కలిసి UCC తుది నివేదికను ఉత్తరాఖండ్ సీఎం అయినా పుష్కర్ సింగ్ ధామికి సమర్పించాడు.
  • ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ధామి మాట్లాడుతూ ఫిబ్రవరి 5న జరిగే అసెంబ్లీయే సమావేశాల్లో తమ ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లును తీసుకువస్తామని ప్రకటించారు.

వాయు శక్తి-24 వ్యాయామం:

  • వాయుశక్తి-24 వ్యాయామం ఫిబ్రవరి 17,2024 న జైసల్మేర్ సమీపంలోని పోఖ్రాన్ ఎయిర్ టు గ్రౌండ్ రేంజ్ వద్ద నిర్వహిస్తుంది.
  • చివరగా ఫిబ్రవరి 16,2019 న నిర్వహించబడింది.
  • ఈ సంవత్సరం స్వదేశీ విమానాలు తేజాస్ తో సహా 121 విమానాలు వైమానిక దళంలో ప్రచండ మరియు ధృవ్ పాల్గొన్నాయి.

67వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్:

  • 67వ ఆల్ ఇండియా డ్యూటీ మీట్ ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 16,2024 వరకు లక్నోలో నిర్వహించబడుతుంది.
  • ఈసారి సమావేశాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నిర్వహిస్తుంది.
  • ఏఐపిడిఎమ్ సెంట్రల్ కోర్డినేషన్ కమిటీ ఈ కార్యక్రమ బాధ్యతను RPFకి అప్పగించింది.

మొదటి మహిళా సుబేదారు???

  • భారత్ సైన్యంలో మొదటి మహిళా సుబేదారుగా ట్రాప్ షూటర్ హవల్దార్ ప్రీతి రజాక్ సుబేదారుగా పదోన్నతి పొందారు.
  • భారత సైన్యంలో ఈ ర్యాంక్ పొందిన తొలి మహిళగా ప్రీతి రజక్ చరిత్ర సృష్టించారు.
  • చైనాలోని హాంగ్ జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడలు 2022లో ఉమెన్ టీమ్ ఈవెంటులో ప్రీతీ రజత పతకాన్ని కైవసం చేసుకొని,కార్ప్స్ ఆఫ్ మిలిటరీలో చేరారు.

ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి:

  • 1988 బ్యాచుకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాధా రాటూరి ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
  • విభజనకు ముందు ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ లో పనిచేసిన రాధా రాటూరికి విస్తృతమైన పరిపాలనా అనుభవం ఉంది.

విజయ్ పార్టీ అర్థము ఏంటంటే??

  • తమిళ హీరో విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని ప్రకటించారు.
  • ఈ పేరులోని మొదటి పదం తమిళగ అంటే తమిళనాడు.వెట్రి అంటే విక్టరీ/సక్సెస్ అనే అర్థాన్ని సూచిస్తుంది.
  • పూర్తిగా తమిళగ వెట్రి కళగం అంటే తమిళనాడు విక్టరీ పార్టీ అనే అర్థం వస్తుంది.

భారత్ లో మొదటి ప్రయివేటు వ్యోమగామి శిక్షణా కేంద్రం:

  • మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాలు,అంతరిక్ష పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
  • ముంబైకి చెందిన ఆస్ట్రోబోర్న్ ఏరోస్పేస్ సంస్థ… ఆసియాలో మొట్టమొదటి ప్రైవేట్ వ్యోమగామి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
  • దీనికోసం ముంబైలో 4 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ చర్చలు జరుపుతోంది.భూమి లభించిన తర్వాత 18-24 నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటులు ఎవరంటే???

  • ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల జాబితాను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసింది.
  • జామి గెర్ట్జ్ 3 బిలియన్ డాలర్లు,బ్రాక్ పియర్స్ 2 బిలియన్ డాలర్లు,జెర్రీ సీన్ ఫిల్డ్ 950 మిలియన్ డాలర్లు,డ్వేన్ జాన్సన్ 800 మిలియన్ డాలర్లతో తొలి 4 స్థానాల్లో ఉన్నారు.
  • సల్మాన్ ఖాన్ 260 మిలియన్ డాలర్లు,అక్షయ్ కుమార్ 240 మిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు.

2 thoughts on “02 February 2024 Telugu Current Affairs”

  1. It is perfect time to make some plans for the longer term and it is time to be happy. I have learn this submit and if I may I desire to suggest you few interesting issues or tips. Maybe you could write next articles referring to this article. I want to read even more issues approximately it!

    Reply

Leave a comment

error: Content is protected !!