01 February 2024 Current Affairs in Telugu

01 February 2024 Current Affairs in Telugu

01 February 2024 Current Affairs in Telugu

ఖేళో ఇండియా యూత్ గేమ్స్:

  • ఖేళో ఇండియా యూత్ గేమ్స్ 2024 ఈవెంట్స్ ముగిసాయి,గత నెలలో 19వ తేదీ నుండి 31 వరకు జరిగాయి.
  • ఈ ఈవెంటులో 5600 మంది అథ్లెట్లు పాల్గొని 57 బంగారు పతకాలు,48 రజత పతకాలు మరియు 53 కాంస్య పతకాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.
  • తరువాత స్థానంలో తమిళనాడు-98,హరియాణా-103,ఢిల్లీ-56,రాజస్థాన్-47,తెలంగాణ-24,ఉత్తరప్రదేశ్-42,కేరళ-35,కర్ణాటక-47,ఆంద్రప్రదేశ్-26 రాష్ట్రాలు నిలిచాయి.

ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉమెన్ సివిల్ సర్వెంట్ జాబితా :

  • ఇండియన్ బ్యూరోక్రసీలో గతేడాది అద్భుతమైన పనితీరును కనబరిచిన ఉమెన్ సివిల్ సర్వెంట్ జాబితాను ‘బ్యూరోక్రాట్స్ ఇండియా’ రిలీజ్ చేసింది.
  • 23 మందిలో తెలంగాణ నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారిణులు ఎంపికకావడం విశేషం.
  • తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్,HMDA జాయింట్ సెక్రటరీ ఆమ్రపాలి,కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఉన్నారు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ డే:

  • భారత్ లో ప్రతి సంవత్సరం ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని ఫిబ్రవరి 01వ తేదీన జరుపుకుంటారు.
  • కోస్ట్ గార్డ్ యొక్క ప్రాముఖ్యతని అందరికి అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
  • ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని 18 ఆగస్టు 1978న జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది.

ఫైలేరియా వ్యాధిని నిర్మూలించేందుకు ప్రచారం ప్రారంభించిన రాష్ట్రం:

  • ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైలేరియాను సమూలంగా నిర్ములించే విధంగా మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
  • ఈ ప్రచారం 17 జిల్లాల్లో ఫిబ్రవరి 5వ తేదీ నుండి 15 వరకు కొనసాగుతుంది.

ఇటీవల అంతర్జాతీయ హోదా వచ్చిన విమానాశ్రయం:

  • భారత ప్రభుత్వం ఇటీవల గుజరాత్ లోని సూరత్ విమానాశ్రమానికి అంతర్జాతీయ విమానాశ్రయం హోదాను ఇచ్చింది.
  • 2023 డిసెంబర్ లో పీఎం మోడీ గారు 353 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్ ను సూరత్ విమానాశ్రమంలో ప్రారంభించారు.

16వ ఫైనాన్స్ కమిషన్ నూతన సభ్యులు:

  • 16వ ఆర్ధిక సంఘానికి భారత ప్రభుత్వం కొత్తగా నలుగురు సభ్యులను ఎంపిక చేసి నియమిచడం జరిగింది.
  • ఇందులో 15వ ఆర్ధిక సంఘం సభ్యుడు AN ఝూ,వ్యయశాఖ ప్రత్యేక కార్యదర్శి యానీ జార్జ్ మాథ్యూ,SBI ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్,అర్థ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష ఉన్నారు.
  • వీరి పదవీ కాలం ఐదు సంవత్సరాలు.

తొలి మానవ డిఎన్ఏ బ్యాంకు:

  • ఉత్తర భారతదేశంలో తొలి మానవ డిఎన్ఏ బ్యాంకును బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసారు.
  • ఇందులోని యంత్రాలను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశంలోనే తయారు చేసారు.

డీకమిషన్ చేయబడిన నౌక:

  • జనవరి 29న విశాఖపట్నంలో INS నిరుపక్ ను డీకమిషన్ చేసారు.
  • ఈ నౌకను 38 ఏళ్ల క్రితం 1985,ఆగస్టు 14న అప్పటి వైస్ అడ్మిరల్ జయంత్ గణపత్ నాదకర్ణి ప్రవేశపెట్టారు.

ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్:

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
  • ఈ ఒప్పందం ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనుంది.

కో ఆపరేటివ్ బ్యాంకుల కంప్యూటీకరణ పథకం:

  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవసాయ,గ్రామీణాభివృద్ధి బ్యాంకులు,రాష్ట్రాల రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ కోసం కంప్యూటరీకరణ పథకాన్ని ప్రారంభించారు.
  • రైతులకు రుణ పంపిణీని సులభతరం చేయడం,మెరుగైన పర్యవేక్షణ దీని లక్యం.

భారతదేశ జీడీపీ వృద్ధి అంచనా:

  • అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాను 6.7 శాతానికి పెంచింది.ఇది మునపటి అంచనా కంటే 40 బేసిక్ పాయింట్లు ఎక్కువ.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్:

  • బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సంజయ్ వినాయక్ ముదలియార్ నియామకానికి క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంజయ్ పేరును ప్రతిపాదించింది.ప్రస్తుతం వీరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్నారు.

కేంద్ర బడ్జెట్ మొత్తం అంచనా వ్యయం:

  • 2024-25 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ లో మొత్తం అంచనా వ్యయం రూ.47.66 లక్షల కోట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
  • ఈ ఏడాదిలో పన్ను ఆదాయం రూ.26.02 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా వేశారు.
  • అప్పులు మినహా 2023-24 ఏడాదిలో సవరించిన అంచనా రాబడి రూ.27.56 లక్షల కోట్లు అని వెల్లడించారు.

మధ్యంతర బడ్జెటులో అత్యధిక కేటాయింపు:

  • ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మధ్యంతర బడ్జెటును పార్లమెంటులో ప్రవేశ పెట్టారు.
  • ఈ బడ్జెటులో రక్షణ మంత్రిత్వ శాఖకు అత్యధికంగా రూ.6.1 లక్షల కోట్లు కేటాయించారు.
  • దీని తర్వాత,రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రూ.2.78 లక్షల కోట్లతో రెండవ స్థానంలో ఉంది.

కేంద్ర పన్నుల్లో తెలుగు రాష్ట్రాల వాటా:

  • కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి రూ.49,364 కోట్లు,తెలంగాణకు రూ.25,639 కోట్లు రానున్నట్లు బడ్జెటులో వెల్లడైంది.
  • 2023-24 కంటే ఏపీకి రూ.4,666 కోట్లు,టీఎస్ కు రూ.2.423 కోట్లు ఎక్కువ మొత్తం అందనుంది.
  • రాష్ట్ర విభజన తర్వాత 15వ ఆర్ధిక సంఘం నిర్దేశించిన లెక్క ప్రకారం కేంద్ర పన్నుల్లో ఏపీకి 4.047 శాతం,టీఎస్ కు 2.102 శాతం వాటాను కేంద్రం పంపిణీ చేస్తుంది.

మొదటి బీచ్ సేడ్ స్టార్టప్ ఫెస్ట్:

  • భారత్ లో మొదటి బీచ్ సైడ్ స్టార్టప్ ఫస్ట్ మంగళూరులో నిర్వహిస్తారు.ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు ఇది జరగనుంది.కొత్త వెంచర్లను ప్రోత్సహించడంపై ఈ ఈవెంట్ దృష్టి సారిస్తుంది.

సర్వైకల్ క్యాన్సర్ బాధితుల్లో ఏపీకి ఏడో స్థానం:

  • దేశవ్యాప్తంగా 3,42,333 మంది సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.
  • యూపీలో అత్యధికంగా 45,682 మంది బాధితులు ఉన్నారు.ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు(36,014),బెంగాల్(25,822),బీహార్(23,164),కర్ణాటక(20,678),మధ్యప్రదేశ్(18,475) ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్ లో 17,146 మంది బాధితులతో 7వ స్థానంలో మరియు తెలంగాణ 11.525 బాధితులతో 11వ స్థానంలో ఉన్నాయి.

ఫ్రాన్సులో ఇండియా యూపీఐ సేవలు:

  •  భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ సేవలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.ఆ దేశంలోని పారిసులో యూపీఐని లాంచ్ చేసారు.
  • భారతీయ పర్యాటకులు దీని ద్వారా ఈఫిల్ టవర్ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు.
  • ఫ్రాన్సులో భారత యూపీఐ ప్రారంభిస్తామని గతంలో ప్రధాని ప్రకటించడంతో దాంతో భారత యూపీఐ పని చేసే మొదటి యూరోపియన్ దేశంగా ఫ్రాన్స్ అవతరించింది.

7 thoughts on “01 February 2024 Current Affairs in Telugu”

  1. Hello there! Do you know if they make any plugins to assist with SEO? I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very good gains. If you know of any please share. Kudos!

    Reply
  2. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

    Reply
  3. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

    Reply

Leave a comment

error: Content is protected !!