29 January 2024 Current Affairs తెలుగులో

29 జనవరి 2024 కరెంట్ అఫైర్స్ ముఖ్యాంశాలు:

Australia Open 2024 పురుషుల సింగిల్స్ టైటిల్:

  • ఇటాలియన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు జానిక్ సిన్నర్-2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్నాడు.
  • ఫైనల్ మ్యాచులో రష్యాకు చెందిన డేనియల్ మెద్వేదేవ్ ను ఓడించడం జరిగింది.సెమీ ఫైనల్ లో జకోవిచ్ ను ఓడించడం జరిగింది.
  • సిన్నర్ 17.25 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.
  • ఇతను 1976 నుండి పురుషుల సింగిల్స్ గ్లాండ్ స్లామ్ టోర్నమెంట్ ను గెలుచుకున్న మూడవ ఇటాలియన్ ఆటగాడిగా నిలిచాడు.

భారత్ మొట్టమొదటి ప్రైవేట్ హెలికాఫ్టర్ అసెంబ్లింగ్ లైన్:

  • ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ ఎయిర్ బస్ టాటా సహకారంతో భారత్ మొట్టమొదటి ప్రైవేట్ హెలికాఫ్టర్ అసెంబ్లీ లైనును ఏర్పాటు చేస్తుంది.
  • సివిల్ హెలికాఫ్టర్ల కోసం టాటా గ్రూపుతో ఎయిర్ బస్ హెలికాఫ్టర్లు భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
  • భారత్ వైమానిక దళానికి 56 విమానాలను సరఫరా చేసే ఒప్పందం ప్రకారం ఎయిర్ బస్ మరియు టాటా ఇప్పటికే సి-295 సైనిక రవాణా విమానం కోసం వడోదరలో FAL ను ఏర్పాటు చేస్తున్నాయి.

యూపీ DSPగా మహిళా క్రికెటర్:

  •  భారత్ స్టార్ మహిళా క్రికెటర్ దీప్తి శర్మ యూపీ DSP గా నియమితులయ్యారు.
  • ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా జాయినింగ్ లెటర్ తో పాటు రూ.3 కోట్ల చెక్కును దీప్తి శర్మకు అందించారు.
  • ఆసియా క్రీడల్లో భారత్ కు బంగారు పతాకం సాధించడంలో ఆగ్రా నివాసి దీప్తి కీలక పాత్ర పోషించడం జరిగింది.
  • డిసెంబర్ 2023లో,దీప్తి శర్మ మొదటి సారిగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకుంది.

ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్: 

  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ గా హైదరాబాద్ క్రికెటర్ తన్మయ్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు.
  • హైదరాబాద్ లో జరిగిన రంజీ ట్రోఫీ 2023/24 ప్లేట్ గ్రూప్ గేమ్ లో హైదరాబాద్ vs అరుణాచల్ ప్రదేశ్ లో తన్మయ్ ఈ ఫీట్ సాధించాడు.
  • తన్మయ్ కేవలం 160 బంతుల్లో 323 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
  • ఇతని ఇన్నింగ్స్ లో ఇతను 33 ఫోర్లు మరియు 21 సిక్సర్లు కొట్టాడు.

రోడ్ సేఫ్టీ ఫోర్స్ ప్రారంభించిన రాష్ట్రం:

  • రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ‘రోడ్ సేఫ్టీ ఫోర్స్’ను ప్రారంభించింది.
  • పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జలంధర్ లో ఈ దళాన్ని ప్రారంభించడం జరిగింది.
  • దీని ఆధ్వర్యంలో 144 హైటెక్ వాహనాలు,5000 మంది ఉద్యోగులు రోడ్లపై ప్రజలకు భద్రతకు కల్పిస్తారు.
  • రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిర్వహణకు అంకితం చేయబడిన దేశంలో ఇది మొదటి దళం అవుతుందని ముఖ్యమంత్రి మాన్ అన్నారు.

సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తి:

  • సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రసన్న బి.వరాలే ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు.
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ జస్టిస్ వరాలేతో ప్రమాణం చేయించారు.
  • అంతకుముందు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా,బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసారు.
  • ఈ నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34 కి చేరింది.

SADA TANSEEQ సంయుక్త సైనిక విన్యాసం:

  • రాజస్థాన్ లో ఉన్న మహాజన్ లో భారత్-సౌదీ అరేబియా సంయుక్త సైనిక వ్యాయామం SADA TANSEEQ మొదటి ఎడిషన్ నిర్వహించబడుతుంది.
  • ఈ వ్యాయామం 29 జనవరి నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు నిర్వహించబడుతుంది.
  • 45 మంది సైనిక సిబ్బందితో కూడిన సౌదీ అరేబియా బృందం రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తోంది.

డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ ద్వారా 5 నిమిషాల్లో రిజల్ట్:

  • తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తొలిసారి ‘డ్రగ్ డిటెక్షన్ టెస్ట్’కిట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
  • దీని ద్వారా అనుమానితుడు డ్రగ్స్ తీసుకున్నాడో లేదో ఐదు నిమిషాల్లో తేల్చేయచ్చు.
  • సదరు వ్యక్తి యూరిన్,లాలాజలం ద్వారా ఐదు నిమిషాల్లోనే 19 రకాల డ్రగ్స్ కు సంబంధించిన టెస్టులను చేయొచ్చని పోలీసులు తెలిపారు.

‘సిమీ’పై నిషేధం పొడిగించిన కేంద్రం:

  • చట్ట వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడుతున్న సిమీపై నిషేధాన్ని ఐదేళ్లు పొడిగించింది.
  • ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ లో పేర్కొన్నారు.
  • నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు ఇది అనుబంధ సంస్థ అని కేంద్రం పేర్కొనడం జరిగింది.చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుందని గతంలోనే నిషేధం విధించింది.

మాజీ మంత్రి కన్నుమూత:

  • కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి పి.నర్సారెడ్డి(92) కన్నుమూశారు.
  • నర్సారెడ్డి స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్ చించోలి గ్రామం.
  • 1971-72లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పని చేసారు.
  • మాజీ సీఎం జలగం వెంగళ రావు హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు.
  • ఎంపీగా,ఎమ్మెల్యేగా,ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో సేవలు అందించారు.

భిక్షా ముక్త్ భారత్:

  • దేశవ్యాప్తంగా ఉన్న యాచకుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర సామజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సిద్ధమైంది.
  • దీనికోసం మొదటగా 30 నగరాలను ఎంచుకుంది.అందులో విజయవాడ,అయోధ్య,గువహటి,త్రయంబకేశ్వర్,తిరువనంతపురం తదితర నగరాలు ఉన్నాయి.
  • మున్సిపల్ అధికారుల మద్దతుతో ఈ నగరాలను 2026 నాటికి బిచ్చగాళ్ల రహితంగా మార్చేందుకు ప్రణాళికలను రచిస్తోంది.
  • భిక్షా ముక్త్ భారత్ కింద యాచకులకు కేంద్రం ఉపాధి కల్పించనుంది.

JIIFలో మంగళవారం సినిమాకు నాలుగు అవార్డులు:

  • మంగళవారం సినిమాకు జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 4 అవార్డులు లభించాయని ఆ సినిమా దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు.
  • పాయల్ రాజ్ పూత్ కు ఉత్తమ నటిగా,రాజకృష్ణన్ కు ఉత్తమ సౌండ్ డిజైనర్ గా,గుల్లపల్లి కుమార్ కు ఉత్తమ ఎడిటర్ గా,ముదాసర్ మహ్మద్ కు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా అవార్డులు గెలుచుకున్నారు.

4 thoughts on “29 January 2024 Current Affairs తెలుగులో”

Leave a comment

error: Content is protected !!