Cyber Crime Number 1930 మరింత బలోపేతం:
- పెరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రణ చేయడానికి హోమ్ అఫైర్స్ మంత్రిత్వ తీసుకువచ్చిన ఫిర్యాదు నంబర్ 1930ను మరింత బలోపేతం చేస్తుంది.
- సైబర్ మోసాల బారినపడిన వారు దీనికి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుంటారు.కానీ ఎక్కువగా కాల్స్ రావడం వాళ్ళ ఈ నంబర్ ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉంటుంది.
- దీనికి పరిష్కారంగా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా లింకును మెస్సేజ్ చేయనున్నారు.
- దీనిద్వారా బాధితుడి వివరాలు సేకరించి తరువాత దర్యాప్తు వేగవంతం చేయనున్నారు.
- ప్రయోగాత్మక పరిశీలనలో ఉన్న దేనిని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తారు.
గతంలో సైబర్ నేరాల నమోదు ఇలా:
- గతంలో సైబర్ మోసాలకు ఎదుర్కున్న వారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తే,సిబ్బంది బాధితుడి ఖాతా ఉన్న బ్యాంకుకి లెటర్ రాసి,నిధులు బదిలీ కాకుండా ఆపాలని కోరేవారు.దీనికి చాలా సమయం పట్టేది.
- చాలా బ్యాంకులు సరిగ్గా స్పందించేవారు కాదు.ఈలోపు నేరగాళ్లు బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకునేవారు.డబ్బు డ్రా చేసిన తర్వాత ఫిర్యాదు నమోదు చేసినా ఉపయోగం ఉండదు.
- దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను సమన్వయ పరచి ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ పరిధిలోకి తెచ్చారు.
- 1930 నంబరుకి కాల్ చేస్తే వెంటనే సిబ్బంది బ్యాంకును అప్రమత్తం చేసి సైబర్ దాడికి గురి అయినా ఖాతా నుండి నగదు బదిలీ అవ్వకుండా ఆపుతారు.
- ఆ తర్వాతా విచారణ జరిపి సైబర్ నేరం జరింగింది అని నిర్ధారణ జరిగితే ఆ డబ్బు తిరిగి బాధితుడి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
గత ఏడాది కేసులు:
- 2023 సంవత్సరంలో దేశంలో అత్యధికంగా తెలంగాణాలో 107కోట్ల సొమ్మును ఆపగలిగారు.అయితే నేరం జరిగిన తరువాత ఎంత వేగంగా పిర్యాదు చేస్తే డబ్బు తిరిగి రాబట్టేందుకు అంత అవకాశం ఉంటుంది.
- ఈ నేపథ్యంలో 1930కి రోజూ వేళల్లో కాల్స్ వస్తున్నాయి.
- గత ఏడాది తెలంగాణ నుంచే 85,030 ఫిర్యాదులు వెళ్లాయి.
కాల్ చేస్తే లింక్ వెళ్లేలా:
- ఈ క్రమంలోనే ఎంగేజ్ సమస్య ఉత్పన్నమవుతుంది.ఇక మీదట ఎంగేజ్ వస్తే ఆటోమేటిక్ గా ఒక లింకు వెళ్లేలా చూస్తున్నారు.దాన్ని తెరవగానే అందులో అడిగిన వివరాలను పూరించి తిరిగి అదే నంబరుకి పంపించాల్సి ఉంటుంది.ఇలా చేయడం ద్వారా ఐ4సి రికార్డుల్లో నిక్షిప్తమవుతుంది.
- దీనివల్ల ఫిర్యాదు చేరి,డబ్బు నేరస్తుల ఖాతాల్లో జమకాకుండా చూడవచ్చు.ఈ కొత్త విధానం విజయవంతమైందని,త్వరలో అందుబాటులోకి తెస్తామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.