PSLV C-58 ప్రయోగం విజయవంతం

పీ.ఎస్.ఎల్.వీ. సీ-58 ప్రయోగం విజయవంతమైనది

అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన బ్లాక్ హొల్స్ అధ్యయనము లక్ష్యంగా PSLV C-58 రాకెట్ ను ప్రయోగించింది.ఏపీ లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి నిప్పులుచిమ్ముతూ రోదసీలోకి దూసుకెళ్లిన వాహననౌక 21.5 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి ఆధునిక ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది.మరో పది ఉపగ్రహాలని నింగిలోకి మోసుకెళ్తుంది.

pslv c-58 xposat

భారత్ తొలి పొలారిమెట్రీ మిషన్:

ఎక్స్ రే పొలారీమెట్రీ పై మిషన్ ను చేపట్టిన రెండో దేశంగా భారత్ చరిత్రకెక్కింది.ఇంతకుముందు ఈ తరహా మిషన్ అమెరికా చేపట్టింది.సవాళ్లతో కూడుకున్న పల్సర్ లు,బ్లాక్ హోల్ ఎక్స్ రే బైనరీలు,యాక్టివ్ గెలాక్షీ న్యూక్లియోలు,న్యూట్రాన్ స్టార్స్,నాన్ థర్మల్ సూపర్ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్ పోశాట్ అధ్యయనం చేయనున్నది.ఈ ఉపగ్రహాన్ని 500-700 కిలోమీటర్ల వృత్తాకార దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెడతారు.ఐదేండ్ల పాటు సేవలందించనున్న ఎక్స్ పోశాట్ లో రెండు పేలోడ్స్ ఉన్నాయి.

పొలారీమీటర్ పరికరం:

పాలీఎక్స్,ఎక్స్-రే స్పెక్ట్రోస్కోపీ,టైమింగ్ ను అమర్చారు.పాలీఎక్స్ ను రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేయగా,ఎక్స్పెక్ట్ ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ కు చెందిన స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది.ఖగోళ వస్తువులు,తోక చుక్కల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్ పోషాట్ సేకరించనుంది.

21 నిమిషాల్లోనే నిర్దిష్ట కక్ష్యలోకి:

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుండి 9:10 గం|| కి పీ.ఎస్.ఎల్.వీ. సీ-58 నింగిలోకి దూసుకెళ్లింది.ప్రైమరీ పేలోడ్-ఉపగ్రహం ఎక్స్ పోశాట్ ను 650 కి.మీ. లో ఎర్త్ ఆర్బిట్ కు తీసుకువెళ్ళింది.నింగిలోకి వెళ్లిన 21 నిమిషాలకు ఆర్బిట్ లోకి పంపింది.తరువాత శాటిలైట్ ఆల్టిట్యుడ్ ను 350 కి.మీ.లకు తగ్గించడం జరిగింది.ఇది PSLV రాకెట్ ద్వారా ప్రయోగించిన 60వ కావడం ప్రత్యేకం.

మిగిలిన పది శాటిలైట్లు ఏంటంటే???

ఈ ప్రయోగంలో PSLV రాకెట్ ద్వారా మొత్తం 11 శాటిలైట్లను ప్రవేశపెట్టారు.ఫస్ట్ ఎక్స్ పో శాట్ ను ఆర్బిట్ లోకి పంపించారు.దీంతో పాటు టేక్ మీ టు స్పేస్ సంస్థకి చెందిన రేడియేషన్ షీల్డింగ్ ఎక్స్పరిమెంట్ మాడ్యూల్,LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలిజీకి చెందిన ఉమెన్ ఇంజినీర్స్ తయారుచేసిన ఉపగ్రహం..KJ సోమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తయారుచేసిన బిలీఫ్ షాట్..ఇంస్పెసిటీ స్పేస్ లాబ్స్ రూపొందించిన గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్..ధ్రువ స్పేస్ ఏజెన్సీ తయారుచేసిన LEATED బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ రూపొందించిన రుద్రా 0.3  H.P.G .P.,ARAK 200,PRAL,ఇస్రో రూపొందించిన డస్ట్ ఎక్స్పరిమెంట్ విక్రమ్ సారాభాయి అంతరిక్ష సంస్థ రూపొందించిన ఫ్యూయెల్ సెల్ పవర్ సిస్టం,SI బేస్డ్ హాయ్ ఎనర్జీ సెల్ కూడా ఉన్నాయి.

PSLV:

PSLV-పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సంక్షిప్త రూపం.ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తయారుచేసిన శాటిలైట్ నౌక.

Leave a comment

error: Content is protected !!