8th February 2024 Current Affairs In Telugu
విద్యాంజలి స్కాలర్ షిప్ కార్యక్రమం:
- కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల EdCIL విద్యాంజలి స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
- ఈ ప్రోగ్రాం క్రింద నాణ్యమైన విద్యను పొందడానికి తగినంత డబ్బు లేని విద్యార్థులకు సహాయం అందించబడుతుంది.
- ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఉంది.
సారథి పోర్టల్:
- వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ఇటీవల ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(PMFBY)సహా బీమా ఉత్పత్తుల కోసం ‘సారథి పోర్టల్’ని ప్రారంభించారు.
- పంటల బీమాకు సంబందించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ‘కృషి రక్షక్ పోర్టల్’ మరియు హెల్ప్ లైన్ నంబర్ 14447 కూడా ప్రారంభించడం జరిగింది.
కజకిస్తాన్ నూతన ప్రధాని:
- మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్ అధ్యక్షుడు తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒల్జాస్ బెక్టనోవ్ ను దేశ కొత్త ప్రధానిగా నియమించారు.
- 43 ఏళ్ల బెక్టెనోవ్ అంతకుముందు అవినీతి నిరోధక సంస్థకు అధిపతిగా ఉన్నారు.
RBI రేపో రేటు:
- RBI వరుసగా ఆరోసారి రేపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు.RBI ఎంపీసీలోని మొత్తం 6 మంది సభ్యులు రేపో రేటును 6.5% వద్ద మార్చకుండా ఏకగ్రీవంగా ఓటు వేశారు.
- FY24 కోసం నిజమైన జీడీపీ వృద్ధి అంచనా 6.5% వద్దనే ఉంది.
- ఎంపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
హిందూ మహాసముద్ర సదస్సు:
- ఆస్ట్రేలియాలోని పెర్త్ లో 7వ హిందూ మహాసముద్ర సదస్సులో భారత్ విదేశాంగ మంత్రి డా||ఎస్.జయశంకర్ ప్రసంగించడం జరిగింది.
- ఈ సదస్సులో 22కి పైగా దేశాల మంత్రులు,16 దేశాలు,6 బహుపాక్షిక సంస్థల సీనియర్ అధికారులు పాల్గొంటారు.
- ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటంటే “టువార్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషియన్”.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో తొలి భారత పేసర్:
- ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి చేరిన తొలి భారత పేసర్ గా రికార్డు సృష్టించాడు.
- ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడు ఫార్మాట్లలోనూ ప్రథమ స్థానంలో నిలిచిన తొలి,ఏకైక బౌలర్ గాను చరిత్ర సృష్టించాడు.
సీవీడ్ సాగును ప్రోత్సహించడం కోసం ఫస్ట్ నేషనల్ కాన్ఫెరెన్స్:
- సీవీడ్ సాగును ప్రోత్సహించడానికి ఫస్ట్ నేషనల్ కాన్ఫెరెన్స్ ను గుజరాత్ లోని కచ్ లో నిర్వహించారు.
- ఈ సదస్సుకు కేంద్ర మత్స్య,పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా అధ్యక్షత వహించారు.
గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్:
- గ్లోబల్ బయోఫ్యూయెల్ అలయన్సులో చేరనున్నట్లు ఫిజీ దేశం ప్రకటించింది.
- పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ,ఫిజీ అధికారుల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫిట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్:
- భారత ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ గా GST అడిషనల్ డైరెక్టర్,IRS అధికారి నరేంద్ర కుమార్ యాదవ్ నియమితులయ్యారు.
- రోజువారీ జీవితంలో శారీరక శ్రమ,క్రీడలకు భాగం కల్పించేలా ప్రోత్సహించడం దీని లక్ష్యం.
Hi there
My name is Diana Rossenga and I represent Musgrave Group, Ireland’s largest wholesaler. We’re always on the lookout for fresh opportunities that can help expand our offerings while promoting quality products from other companies around the globe.
We find your product line quite impressive and believe it aligns perfectly with our business model.
I’ve been trying to locate your export department with no luck yet. Can you pass this message to your CEO or Export dep.
Mrs Diana Rossenga
Musgrave Group
Cork,
Ireland
Email: bookings@musgraveimports.com
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good. https://accounts.binance.com/el/register-person?ref=IQY5TET4