5th February 2024 Current Affairs In Telugu

5th February 2024 Current Affairs In Telugu

5th February 2024 Current Affairs In Telugu

Sports News

గ్రేటెస్ట్ అథ్లెట్స్ జాబితాలో కోహ్లీ ఐదో స్థానం:

  • అలీమో ఫిలిప్ సంస్థ విడుదల చేసిన ‘గ్రేటెస్ట్ అథ్లెట్స్ ఆఫ్ ఆల్ టైం’జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.
  • తొలి నాలుగు స్థానాల్లో మెస్సీ(ఫుట్బాల్),రోనాల్డో(ఫుట్బాల్),మహమ్మద్ అలీ(బాక్సింగ్),జోర్డాన్(బాస్కెట్ బాల్) ఉన్నారు.
  • 6-10 స్థానాల్లో ఉసేన్ బోల్ట్(రన్నింగ్),టైసన్(బాక్సింగ్),లిబ్రోన్(బాస్కెట్ బాల్),సెరెనా విలియమ్స్(టెన్నిస్),మైఖేల్ ఫెల్ప్స్(స్విమ్మర్) ఉన్నారు.

చరిత్ర సృష్టించిన భవానీ దేవి:

  • భారత్ ఫెన్సర్ భవానీ దేవి పారిస్-2024 ఒలింపిక్స్ కు అర్హత సాధించారు.దీంతో ఫెన్సింగ్ లో పారిస్ ఒలంపిక్స్ కు అర్హత సాధించిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.
  • ఆమె గతంలో ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పతాకాన్ని గెలుచుకున్న తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచారు.
  • ఇప్పుడు ఒలంపిక్స్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.పారిస్ ఒలంపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.

International News

అత్యధిక ట్రాఫిక్ ఉన్న నగరాలు ఏంటంటే???

  • ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ ఉన్న నగరాల జాబితాలో లండన్ అగ్రస్థానంలో నిలిచింది.
  • 2023 లెక్కల ప్రకారం అక్కడ 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సగటున 37.20 నిముషాలు పడుతోంది.
  • ఆ తర్వాత డబ్లిన్(ఐర్లాండ్),టొరంటో(కెనడా),మిలాన్(ఇటలీ),లిమా(పెరూ),బెంగళూరు,పూణే(ఇండియా),బుచరెస్ట్(రొమేనియా),మనీలా(ఫిలిప్పీన్స్),బ్రస్సెల్స్(బెల్జియం) ఉన్నాయి.

State News

తెలంగాణ రాష్ట్ర గీతం:

  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
  • రాష్ట్ర అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • జయ జయ జయహే తెలంగాణ గేయ రచయిత:అందెశ్రీ .
  • ప్రజాకవి అందెశ్రీ కలం నుంచి జాలువారిన ఈ అత్యద్భుత గీతాన్ని రాష్ట్ర అధికారిక గేయంగా ప్రభుత్వం గుర్తించడం ఇదే తొలిసారి.

TS కి బదులుగా TG:

  • తెలంగాణ మంత్రివర్గం వాహనాలతో పాటు ఇతర రిజిస్ట్రేషన్లకు TS కు బదులుగా TG వాడాలని నిర్ణయించింది. ఇక నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్లలో TS స్థానంలో TG రానుంది.

National News

అతిపెద్ద కాపర్ తయారీ కేంద్రం:

  • గుజరాత్ లోని ముంద్రాలో అదానీ గ్రూప్ నిర్మిస్తున్న అతిపెద్ద కాపర్ తయారీ ప్లాంట్ మార్చి నెలలో ప్రారంభం కానుంది.
  • ప్రపంచంలోనే ఒకే ప్రదేశంలో ఉన్న అతిపెద్ద కాపర్ ప్లాంట్ ఇదేనని కంపెనీ చెబుతోంది.
  • దాదాపు 10వేల కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్ ఏర్పాటు అవుతుంది.ఇది అందుబాటులోకి వస్తే రాగి దిగుమతులపై రాగి దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు ఇంధన మార్పిడికి దోహదపడుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

పోటీ పరీక్షల్లో అవకతవకలు చేస్తే కోటి ఫైన్:

  • ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో అవకతవకలను అడ్డుకునేందుకు పబ్లిక్ ఎక్సమినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్) బిల్లును కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు.
  • దీని ప్రకారం నిందితులకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష,రూ.కోటి వరకు ఫైన్ విధించనుంది.ఇటీవల రాజస్థాన్,హరియాణా,గుజరాత్,బీహార్ రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలతో పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది.

Awards

గ్రామీ అవార్డులు:

ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల(2024) ప్రధానోత్సవం అమెరికాలో ఘనంగా జరిగింది.

  • ప్రముఖ హాలీవుడ్ గాయని టేలర్ స్విఫ్ట్ అరుదైన ఘనత సాధించారు.’ఆల్బమ్ ఆఫ్ ఇయర్’ గ్రామీ అవార్డు గెలుచుకున్న ఆమె..నాలుగు సార్లు ఈ విభాగంలో అవార్డు పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు.
  • మిడ్ నైట్స్ ఆల్బమ్ కు గాను ఆమెను ఈ పురస్కారం వరించింది.కాగా గతంలో ఫియర్ లెస్,ఫోల్కోలోర్,1989కు ఆల్బమ్ ఆఫ్ ఇయర్ విభాగంలో గ్రామీ అవార్డులు గెల్చుకున్నారు.కాగా ఇప్పటివరకు స్విప్టుకు 13 గ్రామీ అవార్డులు వరించాయి.
  • జాకీర్ హుస్సేన్ కు మూడు గ్రామీ అవార్డులు: 66వ గ్రామీ అవార్డుల్లో పాష్తోకి గాను ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మూడు అవార్డులను కైవసం చేసుకున్నారు.ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియా రెండు అవార్డులు గెలుచుకున్నారు.
  • శంకర్ మహదేవన్ బ్యాండుకు గ్రామీ అవార్డు:శంకర్ మహదేవన్ శక్తి బ్యాండుకు గ్రామీ అవార్డు లభించింది.బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో తాజా ఆల్బమ్ దిస్ మూమెంట్ కు పురస్కారం దక్కింది.
  • బ్యాండ్ సభ్యులైన శంకర్ మహదేవన్,గణేష్ రాజగోపాలన్ తో కలిసి అవార్డును తీసుకున్నారు.

Science And Technology

పేగు క్యాన్సరుకు టీకా:

  • పేగు క్యాన్సర్ తొలి దశల్లో ఉండగానే నయం చేయగల సరికొత్త టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాయల్ సర్రే ఎన్ హెచ్ ఎస్ ఫౌండేషన్ ట్రస్టులో పనిచేస్తున్న  బ్రిటీష్ ఇండియన్ వైద్యుడు  డాక్టర్ టోనీ ఢిల్లీ నేతృత్వంలో దానిపై ట్రయల్స్ జరుగనున్నాయి.ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ టిమ్ ప్రయిస్ తో కలిసి ఢీల్లీ ఈ టీకాను అభివృద్ధి చేసారు.
  • ప్రపంచవ్యాప్తంగా కేవలం 44 మంది రోగులపై దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.

మెదడు 3D కృత్రిమ కణం సృష్టి:

  • ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ బ్రెయిన్ కణజాలాన్ని అమెరికా సైంటిస్టులు ఆవిష్కరించారు.
  • ఇది మనిషి మెదడులోని సహజ కణజాలం లాగా పనిచేయగలదని న్యూరోసైన్స్ జర్నల్ తాజా కథనం పేర్కొంది.మానవ మెదడులో కణజాలం పనితీరును అర్థం చేసుకోవడంలో ఇది శక్తివంతమైన మోడల్ అవుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
  • కృత్రిమంగా తయారుచేసిన ఈ త్రీడి ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యు,నాడీ సంబంధిత సమస్యల పరిష్కారంలో విప్లవాత్మక మార్పులకు నాంది కాబోతుంది.
  • పార్కినర్స్,అల్జీమర్స్ వ్యాధి చికిత్సలో సైంటిస్టులు పరిశోధనకు ఇదెంతగానో దోహదపడుతుంది.

రోబో వ్యోమమిత్ర:

  • భారత అంతరిక్ష పరోశోధనా సంస్థ(ISRO) రోబోను అంతరిక్షంలోకి పంపించనుంది.మానవరూప రోబో వ్యోమమిత్రను ప్రయోగించనున్నట్లు కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.గగన్ యాన్ ప్రోగ్రాం లో భాగంగా చేపట్టిన మానవ రహిత అంతరిక్ష ప్రయోగంలో ఇదో భాగమని తెలిపారు.
  • ఈ ఏడాది త్రైమాసికంలో దీనిని ప్రయోగించనున్నారు.వ్యోమమిత్ర ప్యానెల్ లను ఆపరేట్ చేయగలదని,ప్రశ్నలకు ప్రతిస్పందించగలదని సైంటిస్టులు తెలిపారు.

భూమిలాంటి మరో గ్రహం:

  • అంతరిక్షంలో భూమి లాంటి మరో గ్రహాన్ని నాసా కనుగొంది.’టీఓఐ71బీ’ అనే ఈ గ్రాహం భూమికి 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ తిరుగుతోందని సైంటిస్టులు గుర్తించారు.
  • ఈ గ్రాహం భూమికంటే ఒకటిన్నర రెట్లు పెద్దగా ఉంటుందని,దీనిపై నీళ్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
  • ఈ సూపర్ ఎర్త్ 19 రోజుల్లో నక్షత్రం చుట్టూ తిరిగివస్తుంది,దానిపై 19 రోజులకే ఒక ఏడాది పూర్తవుతుందని చెబుతున్నారు.

రష్యా వ్యోమగామి రికార్డు:

  • అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యక్తిగా రష్యా వ్యోమగామి ఒలెగ్ కాననెక్కొ రికార్డు సృష్టించారు.
  • మొత్తం 878 రోజుల 12 గంటలు స్పేస్ లో ఉండి…గతంలో అదే దేశానికి చెందిన గెన్నడీ పేరిట ఉన్న 878 రోజుల 11 గంటల 28ని.ల రికార్డును అధిగమించారు.ఈ మేరకు రష్యా మీడియాతో ఆయన స్పేస్ సెంటర్ నుంచే మాట్లాడారు.

Also Read: Telangana Open B.Ed. Notification 2024

474 thoughts on “5th February 2024 Current Affairs In Telugu”

Leave a comment

error: Content is protected !!