30 January 2024 Telugu Current Affairs

Daily Telugu Current Affairs:

అమరవీరుల సంస్మరణ దినోత్సవం:

Martyrs’ Day
                  Martyrs’ Day

14వ ఆల్ ఇండియన్ పోలీస్ కమాండో పోటీలు:

  • విశాఖపట్నంలో జనవరి 22న 14వ ఆల్ ఇండియన్ పోలీస్ ప్రారంభమయ్యాయి.
  • 16 రాష్ట్రాలు,7 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 23 జట్ల మధ్య 5 విభాగాల్లో జరిగే ఈ పోటీలు జనవరి 30న ముగుస్తాయి.

సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు 63వ సమావేశం:

  • మధ్యప్రదేశ్ లోని భోపాల్ వేదికగా జనవరి 22న సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు 63వ సమావేశం జరిగింది.
  • వచ్చే ఫీల్డ్ సీజన్ 2024-25 కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సుమారు 1055 శాస్త్రీయ కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో వివరించింది.

రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసింది ఎవరినంటే??

  • చండీఘడ్ యూనివర్సిటీ ఫౌండర్,ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధూను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసారు.ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
  • మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సత్నామ్ సింగ్.. 2001లో మొహాలీలో చండీఘడ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలను స్థాపించారు.
  • ఆ తర్వాత 2012 లో చంఢీగడ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసారు.

NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం???

  • NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ మరియు డెరివేటివ్స్ సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల వరకు అభివృద్ధి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
  • వచ్చే ఐదేళ్లకు ఈ ఒప్పందం కుదిరింది మరియు సుమారు 80,000 కోట్ల పెట్టుబడి పెట్టబడుతుంది.

భారత్ మొట్టమొదటి నేచురోపతి హాస్పిటల్:

  • ఆయుష్ శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ గారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ తో కలిసి ఈశాన్య రాష్ట్రం అయిన అస్సాంలో మొట్టమొదటి యోగా మరియు నేచురోపతి ఆసుపత్రికి శంకుస్థాపన చేసారు.
  • ఈ 100 పడకల ఆసుపత్రికి అస్సాంలోని దిబ్రూగర్ లో పునాది వేయడం జరిగింది.
  • దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 15 ఎకరాల స్థలంలో ఈ హాస్పిటల్ ను నిర్మించారు.

FIH  హాకీ 5S మహిళల ప్రపంచ కప్ టైటిల్:

  • FIH హాకీ 5S మహిళల ప్రపంచ కప్ టైటిల్ ను నెదర్లాండ్స్ మహిళల హాకీ జట్టు గెలుచుకుంది.
  • మస్కట్ లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ భారత్ ను ఓడించి టైటిల్ ను గెలుచుకుంది.
  • నెదర్లాండ్స్ 7-2 తేడాతో భారత జట్టును ఓడించింది.భారత్ తరపున జ్యోతి ఛత్రీ,రుతాజా దాదాసో గోల్స్ చేసిన విజయానికి సరిపోలేదు.

ISSF ప్రపంచ కప్ రైఫిల్ షూటింగ్ ఈవెంట్:

  • కైరోలో జరిగిన ISSF ప్రపంచ కప్ 2024లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఈవెంట్ లో భారతదేశానికి  దివ్యాన్ష్ సింగ్ పన్వార్ స్వర్ణ పతాకాన్ని గెలుచుకున్నాడు.
  • క్వాలిఫికేషన్  రౌండ్ లో ఒలింపియన్ దివ్యాన్ష్ సింగ్ పన్వార్ 632.4 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు.
  • మహిళల విభాగంలో భారత షూటర్ సోనమ్ ఉత్తమ మస్కర్ రజత పతకం సాధించింది.

ఉత్తమ పాపులర్ ఫిలిం అవార్డు 2024:

  • విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన 12th ఫెయిల్ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.IPS అధికారి మనోజ్ కుమార్ మిశ్ర జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఉత్తమ దర్శకుడి అవార్డు విధు వినోద్ చోప్రాకు దక్కింది.
  • యానిమల్ చిత్రానికి గాను రణబీర్ కపూర్ కు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.

బాబా రాందేవ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ:

  • యోగా గురు బాబా రాందేవ్ కు అరుదైన గౌరవం దక్కింది.మేడం టుస్సాడ్స్ న్యూయార్క్ రూపొందించిన రాందేవ్ మైనపు విగ్రహాన్ని ఢిల్లీలో స్వయంగా ఆయనే ఆవిష్కరించారు.
  • వృక్షాసన భంగిమలో ఈ విగ్రహం ఉంది.దీనిని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు.
  • మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న తొలి భారత సన్యాసిగా రాందేవ్ నిలిచారు.

అవినీతిలో భారత్ ఏ స్థానంలో ఉందంటే??

  • అవినీతిలో భారత్ 93వ స్థానంలో ఉన్నట్లు కరప్షన్ ఇండెక్స్ వెల్లడించింది.
  • 2023 ఏడాదికి రిలీజైన ఈ నివేదికలో మొత్తం 180 దేశాలు ఉన్నాయి.నూటికి 90 పాయింట్లతో తక్కువ అవినీతి ఉన్న దేశంగా నంబర్ 1 స్థానంలో డెన్మార్క్ ఉంది.
  • మరోవైపు 11 పాయింట్లతో అత్యంత అవినీతి కలిగిన దేశంగా సోమాలియా(180) అట్టడుగున నిలిచింది.
  • కాగా 2022లో భారత్ 40 పాయింట్లతో 85వ ర్యాంక్ దక్కించుకోగా 2023కి 8 స్థానాలు కొల్పోయింది

జ్ఞానవాసిలో సంస్కృత,ద్రవిడ శాసనాలు:

  • కాశీలోని జ్ఞానవాసి మసీదులో సంస్కృత,ద్రావిడ భాషల్లో శాసనాలు ఉన్నట్లు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది.ఆ నివేదికను ఏ.ఎస్.ఐ. విడుదల చేసింది.
  • దాని ప్రకారం 12,17 శతాబ్దాలకు చెందిన 34 సంస్కృత,ద్రవిడ భాషల శాసనాలు లభ్యమయ్యాయి.
  • ఒక దానిలో మల్లనభట్టు,నారాయణ భట్లు అనే పేర్లు తెలుగులో రాసి ఉన్నాయి.
  • తనకు లభించిన ఆధారాలను బట్టి అక్కడ ఖచ్చితంగా హిందూ దేవాలయం ఉండేదని ASI నిర్దారణ చేసింది.

డా.భీమ్ రావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు:

  • రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వెలుగు సామజిక స్వచ్చంద సంస్థ ప్రతినిధి డా.సురభి శ్రీధర్ కు స్ఫూర్తి సొసైటీ సర్వీస్ ఆధ్వర్యంలో డా.భీమ్ రావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు.
  • HYD-ముషీరాబాద్ సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో అవార్డును పంచాయతీరాజ్ శాఖ మాజీ జాయిట్ డైరెక్టర్ డా.యాదయ్య గౌడ్,సొసైటీ ఇండియా ఫౌండర్ లయన్ డా.ఆకుల రమేష్ చేతుల మీదుగా అందుకున్నారు.

ఏపీ విద్యా శకటానికి థర్డ్ ప్రైజ్:

  • ఇటీవల ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ వేడుకల పరేడ్ లో ప్రదర్శించిన రాష్ట్ర విద్య శాఖ శకటానికి థర్డ్ ప్రైజ్ వచ్చింది.
  • పీపుల్స్ ఛాయిస్ విభాగంలో డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్ తో రూపొందించిన ఈ శకటం అందరినీ ఆకట్టుకుందని ప్రభుత్వం వెల్లడించింది.
  • మొత్తం 28 రాష్ట్రాల శకటాలు పరేడ్ లో పాల్గొనగా గుజరాత్,యూపీ రాష్ట్రాలకు ప్రథమ,ద్వితీయ బహుమతులు వచ్చాయి.
రిపబ్లిక్ పరేడ్ లో తెలంగాణ శకటం

రికార్డు స్థాయిలో భారతీయులకు వీసాలు:

  • భారతీయులకు 2023లో 14 లక్షల వీసాలు జారీ చేసినట్లు అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
  • అన్ని విభాగాల్లోనూ డిమాండ్ భారీగా ఉందని..2022 తో పోలిస్తే ఇది 60 శాతం అధికమని పేర్కొంది.
  • విజిటర్ వీసా ఆపాయిట్మెంట్ నిరీక్షణ సమయాన్ని 75 శాతం తగ్గించినట్లు అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.
  • మరోవైపు ఏ దేశంలోనూ లేని విధంగా భారత్ కు 2023లో 1.40 లక్షలకు పైగా స్టూడెంట్ వీసాలు జారీ చేసి రికార్డు సృష్టించింది.

3 thoughts on “30 January 2024 Telugu Current Affairs”

Leave a comment

error: Content is protected !!