ఇటాలియన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు జానిక్ సిన్నర్-2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్నాడు.
ఫైనల్ మ్యాచులో రష్యాకు చెందిన డేనియల్ మెద్వేదేవ్ ను ఓడించడం జరిగింది.సెమీ ఫైనల్ లో జకోవిచ్ ను ఓడించడం జరిగింది.
సిన్నర్ 17.25 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.
ఇతను 1976 నుండి పురుషుల సింగిల్స్ గ్లాండ్ స్లామ్ టోర్నమెంట్ ను గెలుచుకున్న మూడవ ఇటాలియన్ ఆటగాడిగా నిలిచాడు.
భారత్ మొట్టమొదటి ప్రైవేట్ హెలికాఫ్టర్ అసెంబ్లింగ్ లైన్:
ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ ఎయిర్ బస్ టాటా సహకారంతో భారత్ మొట్టమొదటి ప్రైవేట్ హెలికాఫ్టర్ అసెంబ్లీ లైనును ఏర్పాటు చేస్తుంది.
సివిల్ హెలికాఫ్టర్ల కోసం టాటా గ్రూపుతో ఎయిర్ బస్ హెలికాఫ్టర్లు భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
భారత్ వైమానిక దళానికి 56 విమానాలను సరఫరా చేసే ఒప్పందం ప్రకారం ఎయిర్ బస్ మరియు టాటా ఇప్పటికే సి-295 సైనిక రవాణా విమానం కోసం వడోదరలో FAL ను ఏర్పాటు చేస్తున్నాయి.
యూపీ DSPగా మహిళా క్రికెటర్:
భారత్ స్టార్ మహిళా క్రికెటర్ దీప్తి శర్మ యూపీ DSP గా నియమితులయ్యారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా జాయినింగ్ లెటర్ తో పాటు రూ.3 కోట్ల చెక్కును దీప్తి శర్మకు అందించారు.
ఆసియా క్రీడల్లో భారత్ కు బంగారు పతాకం సాధించడంలో ఆగ్రా నివాసి దీప్తి కీలక పాత్ర పోషించడం జరిగింది.
డిసెంబర్ 2023లో,దీప్తి శర్మ మొదటి సారిగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకుంది.
ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్:
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ గా హైదరాబాద్ క్రికెటర్ తన్మయ్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు.
హైదరాబాద్ లో జరిగిన రంజీ ట్రోఫీ 2023/24 ప్లేట్ గ్రూప్ గేమ్ లో హైదరాబాద్ vs అరుణాచల్ ప్రదేశ్ లో తన్మయ్ ఈ ఫీట్ సాధించాడు.
తన్మయ్ కేవలం 160 బంతుల్లో 323 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
ఇతని ఇన్నింగ్స్ లో ఇతను 33 ఫోర్లు మరియు 21 సిక్సర్లు కొట్టాడు.
రోడ్ సేఫ్టీ ఫోర్స్ ప్రారంభించిన రాష్ట్రం:
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ‘రోడ్ సేఫ్టీ ఫోర్స్’ను ప్రారంభించింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జలంధర్ లో ఈ దళాన్ని ప్రారంభించడం జరిగింది.
దీని ఆధ్వర్యంలో 144 హైటెక్ వాహనాలు,5000 మంది ఉద్యోగులు రోడ్లపై ప్రజలకు భద్రతకు కల్పిస్తారు.
రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిర్వహణకు అంకితం చేయబడిన దేశంలో ఇది మొదటి దళం అవుతుందని ముఖ్యమంత్రి మాన్ అన్నారు.
సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తి:
సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రసన్న బి.వరాలే ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ జస్టిస్ వరాలేతో ప్రమాణం చేయించారు.
అంతకుముందు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా,బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసారు.
ఈ నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34 కి చేరింది.
SADA TANSEEQ సంయుక్త సైనిక విన్యాసం:
రాజస్థాన్ లో ఉన్న మహాజన్ లో భారత్-సౌదీ అరేబియా సంయుక్త సైనిక వ్యాయామం SADA TANSEEQ మొదటి ఎడిషన్ నిర్వహించబడుతుంది.
ఈ వ్యాయామం 29 జనవరి నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు నిర్వహించబడుతుంది.
45 మంది సైనిక సిబ్బందితో కూడిన సౌదీ అరేబియా బృందం రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తోంది.
డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ ద్వారా 5 నిమిషాల్లో రిజల్ట్:
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తొలిసారి ‘డ్రగ్ డిటెక్షన్ టెస్ట్’కిట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
దీని ద్వారా అనుమానితుడు డ్రగ్స్ తీసుకున్నాడో లేదో ఐదు నిమిషాల్లో తేల్చేయచ్చు.
సదరు వ్యక్తి యూరిన్,లాలాజలం ద్వారా ఐదు నిమిషాల్లోనే 19 రకాల డ్రగ్స్ కు సంబంధించిన టెస్టులను చేయొచ్చని పోలీసులు తెలిపారు.
‘సిమీ’పై నిషేధం పొడిగించిన కేంద్రం:
చట్ట వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడుతున్న సిమీపై నిషేధాన్ని ఐదేళ్లు పొడిగించింది.
ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ లో పేర్కొన్నారు.
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు ఇది అనుబంధ సంస్థ అని కేంద్రం పేర్కొనడం జరిగింది.చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుందని గతంలోనే నిషేధం విధించింది.
మాజీ మంత్రి కన్నుమూత:
కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి పి.నర్సారెడ్డి(92) కన్నుమూశారు.
నర్సారెడ్డి స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్ చించోలి గ్రామం.
1971-72లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పని చేసారు.
మాజీ సీఎం జలగం వెంగళ రావు హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు.
ఎంపీగా,ఎమ్మెల్యేగా,ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో సేవలు అందించారు.
భిక్షా ముక్త్ భారత్:
దేశవ్యాప్తంగా ఉన్న యాచకుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర సామజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సిద్ధమైంది.
దీనికోసం మొదటగా 30 నగరాలను ఎంచుకుంది.అందులో విజయవాడ,అయోధ్య,గువహటి,త్రయంబకేశ్వర్,తిరువనంతపురం తదితర నగరాలు ఉన్నాయి.
మున్సిపల్ అధికారుల మద్దతుతో ఈ నగరాలను 2026 నాటికి బిచ్చగాళ్ల రహితంగా మార్చేందుకు ప్రణాళికలను రచిస్తోంది.
భిక్షా ముక్త్ భారత్ కింద యాచకులకు కేంద్రం ఉపాధి కల్పించనుంది.
JIIFలో మంగళవారం సినిమాకు నాలుగు అవార్డులు:
మంగళవారం సినిమాకు జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 4 అవార్డులు లభించాయని ఆ సినిమా దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు.
పాయల్ రాజ్ పూత్ కు ఉత్తమ నటిగా,రాజకృష్ణన్ కు ఉత్తమ సౌండ్ డిజైనర్ గా,గుల్లపల్లి కుమార్ కు ఉత్తమ ఎడిటర్ గా,ముదాసర్ మహ్మద్ కు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా అవార్డులు గెలుచుకున్నారు.
4 thoughts on “29 January 2024 Current Affairs తెలుగులో”
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me. https://accounts.binance.com/en-IN/register-person?ref=UM6SMJM3
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.