January 28,2024 Daily Current Affairs Updates in Telugu:
ముఖ్యాంశాలు:
శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం ఎత్తివేత:
- శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది.ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.
- బోర్డులో అంతర్గత కలహాలు,బోర్డు వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వంటి కారణాలతో గత నవంబర్ లో SLC పై ఐసీసీ నిషేధం విధించింది.
- సస్పెన్షన్ తరువాత నుంచి బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంతో నిషేధాన్ని ఎత్తివేసింది.
తొమ్మిదవ సారి సీఎం గా నితీష్:
- నితీష్ కుమార్ బీహార్ సీఎంగా 9వ సారి ప్రమాణ స్వీకారం చేశారు.దీంతో భారత్ లో అత్యధిక సార్లు సీఎంగా వీరు రికార్డు సృష్టించారు.
- 2000 ఏడాదిలో తొలిసారి సీఎం అయిన నితీష్ 7 రోజులే పదవిలో ఉన్నారు.
- ఇక అప్పటినుండి ఇప్పటి వరకు 9 సార్లు ఓత్ స్వీకరించారు.
ఫిబ్రవరి 17న ఇస్రో మరో ప్రయోగం:
- ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది.శ్రీహరికోటలోని షార్ నుంచి ఫిబ్రవరి 17న GSLV-F14 రాకెట్ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు.
- ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపే ఇన్ షాట్-3డీ వాతావరణ ఉపగ్రహం ఇప్పటికే షార్ కు చేరింది.
- షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించే ఈ రాకెట్ అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేస్తున్నారు.
మరోసారి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం:
- ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తోంది.వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రయోగం కావడం గమనార్హం.
- అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన క్షిపణిని గతవారం ప్రయోగించేలా ఆదివారం ఉదయం మరో మిస్సైల్ ను దక్షిణ కొరియా దిశగా సముద్రంలోకి ప్రయోగించింది.దీనిపై సియోల్ నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
- అమెరికా,దక్షిణ కొరియా కలిసి తమ సమీపంలో చేస్తున్న సైనిక విన్యాసాలను ఆపాలని ప్యాంగాంగ్ హెచ్చరిస్తుంది.
కుబేరుల్లో అగ్రస్థానానికి బెర్నార్డ్ ఆర్నార్డ్:
- ఫ్రెంచి లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ఎల్.వీ.ఎం.హెచ్. అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానానికి చేరారు.
- ఈ క్రమంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయారు.
- ఆర్నాల్డ్ మొత్తం ఆస్తి విలువ 207.8 బిలియన్ డాలర్లుగా ఉండగా…మస్క్ ఆస్తి 204.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
అతి పెద్ద క్రూయిజ్ నౌక ప్రయాణం ప్రారంభం:
- ప్రపంచంలోనే అతి పెద్ద క్రూయిజ్ నౌక ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ అమెరికాలోని మియామీ నుంచి తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది.
- 7600 మంది సామర్థ్యం,40కి పైగా రెస్టారెంట్లు-బార్లు,7 ఈతకొలనులు దీని ప్రత్యేకతలు.అయితే,మెరైన్ ఇంధనానికి బదులు ఇది ద్రవరూప సహజ వాయువును వాడటం వివాదస్పదంగా మారింది.
- నౌక నుంచి అత్యంత ప్రమాదకరమైన మీథేన్ వాయువు విడుదలవుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేడు సుప్రీం కోర్టు వజ్రోత్సవ వేడుకలు:
- 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రాగా,అదే ఏడాది జనవరి 28న ప్రారంభమైన సుప్రీంకోర్టు నేటితో 75 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
- ఈ వేడుకలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తో పాటు సుప్రీం న్యాయమూర్తులు,కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
కజిరంగా నేషనల్ పార్క్ లో అరుదైన బంగారు పులి:
- ప్రస్తుతం,బంగారు పులుల సంఖ్య తగ్గుతున్నందు వలన అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జాతిగా పరిగణించబడుతున్నాయి.
- ప్రపంచంలోనే ఏకైక బంగారు పులి అని పేర్కొనగా,కజిరంగా నేషనల్ పార్క్ లో అలంటి నాలుగు పులులు ఉన్నాయని తెలిపింది,అలాగే ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి.
- ఇది తూర్పు భారతదేశం,ఆగ్నేయాసియాలో మాత్రమే కనిపిస్తుంది.
ప్రతిష్టాత్మక ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు:
- బ్రిటన్ లోని భారత్ సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది అజిత్ మిశ్రా అక్కడ చేసిన న్యాయ,ప్రజాసేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
- ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ అందిస్తుంది.
- లండన్ ప్రజల జీవితానికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును ప్రకటిస్తుంది.
ప్రపంచంలోనే తొలిసారి మరణ శిక్షకు నైట్రోజన్ గ్యాస్:
- స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ వాడి అమెరికాలో ఓ ఖైదీకి మరణ శిక్ష విధించారు.
- ‘డెత్ పెనాల్టీ ఇన్ఫర్మేషన్ సెంటర్’ ప్రకారం ప్రపంచంలో స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాసును వాడి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి.
Also Read: TSRTC Apprenticeship Online Application
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?