27 January 2024 Telugu Current Affairs ముఖ్యాంశాలు:
2024 రిపబ్లిక్ డే వేడుకల థీమ్:
ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఈ ఏడాది థీమ్ గా భారత్-లోక్ తంత్ర కీ మాతృక,వికసిత్ భారత్ ఉన్నాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన వేడుకలు జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్.
కర్తవ్యపథ్ లో నిర్వహించే కవాతుకు పెద్ద ఎత్తున వీక్షకులు వచ్చే అవకాశం ఉండడంతో భారీగా సిబ్బందిని మోహరించారు.
గణతంత్ర వేడుకల్లో కర్తవ్యపథ్ లో నారీశక్తి సత్తా చాటుతుంది.
వివిధ దళాలకు చెందిన మహిళలు కవాతు నిర్వహించారు.
రోహన్ బోపన్న ఆస్టేలియా ఓపెన్ విజేత:
భారత్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించారు.తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్న ఆయన అత్యధిక వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా నిలిచారు.
తన పార్ట్నర్ మాథ్యూ ఎబిడెన్ తో కలిసి ఫైనల్లో 7-6(7-0),7-5తో ప్రత్యర్థి జోడీని మట్టి కురిపించారు.
అటు లియాండర్ పేస్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన రెండో భారత ఆటగాడిగాను బోపన్న ఘనత సాధించారు.
భారత్-శ్రీలంక వారధి నిర్మాణానికి కసరత్తు:
పర్యాటకాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య వంతెనను నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది.
తమిళనాడులోని ధనుష్కోడి,శ్రీలంకలోని తలైమన్నార్ ను కలిపేలా 23 కి.మీ. మేర ఈ వారధిని నిర్మించాలని చూస్తున్నారు.
దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.
భారత్ మాల-2 పథకంలోని కృష్ణా బ్రిడ్జి:
ఏపీ-తెలంగాణ మధ్య సోమశిల నుంచి సిద్ధేశ్వరంగుట్ట మధ్య కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి భారత్ మాల-2 స్కీమ్ లోకి చేరింది.
హైవే,రోడ్డు నెట్ వర్క్,సరుకు రవాణా మేరుపరచడమే లక్ష్యం.
హైదరాబాద్-తిరుపతి మధ్య దూరం తగ్గించేలా కొల్లాపూర్-నంద్యాల మధ్య నిర్మించే 1.5KM వంతెన నిర్మాణానికి రూ.1083 కోట్లు అవుతుందని అంచనా.
ఇదే సమయంలో 2 రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం రూ.1500 కోట్లు మంజూరు చేసింది.
మార్స్ పై ముగిసిన నాసా హెలికాఫ్టర్ ప్రస్థానం:
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మార్స్ పైకి ప్రయోగించిన ఇంజెన్యూటీ హెలికాఫ్టర్ కథ ముగిసింది.
మూడేళ్ళ క్రితం మార్స్ పైకి చేరిన ఇంజెన్యూటి,వేరే గ్రహంపై గాల్లో ఎగిరిన తొలి వాహనంగా పేరు తెచ్చుకుంది.
చివరిసారిగా అక్కడ ఎగిరినప్పుడు రోటర్ లో సమస్యలు తలెత్తడంతో పనిచేయడం మానేసిందని నాసా ప్రకటించింది.
మార్స్ పై మొత్తంగా 2 గంటల పాటు అది ఎగిరిందని,భవిష్యత్తు పరిశోధనలకు కీలకంగా నిలిచిందని తెలిపింది.
ఆర్ధిక మంత్రి రికార్డు:
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించనున్నారు.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ తో ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో ఆర్ధిక మంత్రిగా నిలవనున్నారు.
గతంలో మాజీ మంత్రి మొరార్జీ దేశాయ్ 1959-64 మధ్య ఐదు పూర్తిస్థాయి,ఒక మధ్యంతర బడ్జెట్ ను సమర్పించారు.
అరుణ్ జైట్లీ,చిదంబరం,యాశ్వంత్ సిన్హా,మన్మోహన్ సింగ్ వరుసగా ఐదు కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రులుగా నిలిచారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్:
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలంటే విద్య,ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి పెట్టాలని ఆర్.బి.ఐ. మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు.
గత 25 ఏళ్లుగా దేశం సగటున ఆరు శాతం వృద్ధి రేటును కొనసాగిస్తోందని ఓ కార్యక్రమంలో వెల్లండించారు.
లక్ష్యాన్ని చేరుకోవాలంటే వార్షిక వృద్ధి రేటు 7% సాధించాలన్నారు.
దీంతో ప్రస్తుతం 2400 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం పదివేల డాలర్లకు పెనుగుతుందని తెలిపారు.
దేశంలోనే అరుదైన చేతి మార్పిడి శస్త్ర చికిత్స:
హరియాణా వైద్యులు అరుదైన చేతి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంత చేశారు.
ఇద్దరు రోగులకు ఫరీదాబాద్ లోని అమృత హాస్పిటల్ లో ఈ శస్త్ర చికిత్సలు జరిగాయి.
గౌతమ్(65) పదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో మణికట్టుపై వరకు ఎడమ చేతిని కోల్పోయారు.అతనికి బ్రెయిన్ డెడ్ అయిన 40 ఏళ్ల వ్యక్తి చేతిని మార్పిడి చేసారు.
మరో హ్యాండ్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఢిల్లీకి చెందిన దేవాన్ష్ గుప్తా అనే 19 ఏళ్ల వ్యక్తికి జరిగింది.
ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా సబలెంకా:
ఆస్ట్రేలియా ఓపెన్-2024 ఉమెన్స్ సింగిల్ విజేతగా బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా నిలిచారు.
ఫైనల్ లో చైనా ప్లేయర్ జెంగ్ పై 6-3,6-2 తేడాతో ఆమె గెలిచారు.దీంతో ఆమెకు దాదాపు రూ.17.25 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది.
సబలెంకా ఆస్టేలియా ఓపెన్ టైటిల్ ను గెలవడం ఇదే రెండవసారి.గత ఏడాది కూడా ఆమె ఈ టైటిల్ ను గెలుచుకున్నారు.
2 thoughts on “27 January 2024 కరెంట్ అఫైర్స్ తెలుగులో”
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Your article helped me a lot, is there any more related content? Thanks!