25 జనవరి 2024 కరెంట్ అఫైర్స్ తెలుగులో-Daily Telugu Current Affairs

25 January 2024 Telugu Current Affairs ముఖ్యాంశాలు:

జాతీయ ఓటర్ దినోత్సవం:

  • భారత్ లో ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు.
  • ప్రజాస్వామ్యంలో ఓటు ఏంటో విలువైనదని,ప్రతి ఒక్కరూ తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం.

మొట్టమొదటి గిగా కంపెనీ:

  • తెలంగాణ రాష్ట్రంలో అమర రాజా అనే గిగా కంపెనీ 2025 సంవత్సరం నాటికి బ్యాటరీస్ యొక్క ఉత్పత్తిని మొదలుపెట్టే అవకాసహం ఉంది అని అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ అధ్యక్షుడు అయిన విజయానంద గారు తెలపడం జరిగింది.
  • ఈ-పాజిటివ్ ఎనర్జీ లాబ్స్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
  • శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అమరరాజా ఆర్&డి కేంద్రం ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
  • నూతమైన టెక్నాలజీతో పాటు సరికొత్త ఇన్వెన్షన్స్ లకు పరిశోధనలు చేయు విధంగా కేంద్రం పని చేయబోతుంది అని వీరు తెలిపారు.

భారత్ గౌరవ్ ట్రైన్:

  • జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర కొరకు ఏర్పాటు చేయబడిన ట్రైన్ ‘భారత్ గౌరవ్’ని సికింద్రాబాద్ స్టేషన్ నుండి ప్రయాణం మొదలుపెట్టింది.

రిపబ్లిక్ డే వేడుకల్లో బాలక్ రామ్:

  • బాలక్ రామ్ ప్రతిమతో రాష్ట్రం యొక్క శకటాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది.
  • ఈ సంవత్సరం కర్తవ్యపథ్ లో నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో అయోధ్య బాలక్ రామ్ యొక్క దివ్య ప్రతిమ ఉండనుంది.
  • ప్రయాగ్ రాజ్ పట్టణంలో నిర్వహించబడే మాఘ్ మేళా,2025సంవత్సరంలో మహా కుంభమేళా కూడా ఉండే విధంగా శకటాన్ని రూపొందించనున్నారు.
  • ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 30 శకటాలు ఉండనున్నాయి.

TS లో 5వేల కోట్లతో కొరియా యొక్క తయారీ సంస్థ:

  • డూసన్-సౌత్ కొరియాకు చెందినటువంటి ప్రముఖ కాస్మొటిక్ తయారీ సంస్థ హైద్రాబాద్ లో తమ సంస్థను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.
  • దాదాపుగా అయిదు వేల కోట్లతో భారత్ లోనే మొదటి కాస్మొటిక్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
  • డూసన్ సంస్థ ప్రతినిధులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని సచివాలయంలో కలిసి వీరు కల్పించే ఉద్యోగాలు మరియు పెట్టుబడుల ద్వారా స్థానికంగా ఉన్నవారికి చేకూరే లాభాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు.

భారత్ లోనే మొదటి డార్క్ స్కై పార్క్:

  • భారత్ లోనే మొట్ట మొదటి ఆర్టిఫిషియల్ కాంతి -తొలి డార్క్ స్కై కృతిమ కాంతి కాలుష్యంను నియంత్రించగల అడవిగా మహారాష్ట్రలో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ గుర్తింపును సాధించింది.
  • ఆసియా ఖండంలో ఇది అయిదవది.
  • కాంతి యొక్క కాలుష్యాన్ని తగ్గించే స్ట్రీట్ లైట్లను బఫర్ ఏరియాలోని విలేజెస్ లో ఏర్పాటుచేసామని తెలిపారు.

బెస్ట్ సిటీగా న్యూయార్క్:

  • టైం అవుట్ విడుదల చేసిన వార్షిక జాబితాలో న్యూయార్క్ నగరం బెస్ట్ సిటీగా నిలిచింది.
  • సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ రెండవ స్థానంలో నిలవగా… తర్వాత స్థానంలో బెర్లిన్(జర్మన్),లండన్(యూకే),మాడ్రిడ్(స్పెయిన్) దక్కించుకున్నాయి.
  • మొత్తం 50 నగరాలతో కూడిన జాబితాలో భారత్ నుండి ముంబై(12) కి మాత్రమే అవకాశం లభించింది.
  • ఇక టాప్-10 లో మెక్సికో,లివర్ పూల్,టోక్యో,రోమ్,పోర్టో నాగరాలున్నాయి.

మాదిక భాష:

  • అంతరించిపోయే దశకు చేరిక మాదిక భాషను కేరళ రాష్ట్రంలోని చాకలియ కమ్యూనిటీ ప్రజలు మాట్లాడుతారు.
  • ప్రస్తుతం ఇద్దరు మాత్రమే మాట్లాడుతున్న ఈ భాషకు లిపి లేదు.

స్థానిక భాషల్లో ఉన్నత విద్య కోసం యాప్:

  • స్థానిక భాషల్లోనే ఉన్నత విద్యను ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం ‘అనువాదిని’ అనే ప్రత్యేక యాప్ ని విడుదల చేసింది.
  • ఈ యాప్ ద్వారా డిగ్రీ,ఇంజినీరింగ్ సహా అన్ని రకాల ఉన్నత విద్యకు సంబందించిన పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లోకి అనువదించుకోవచ్చని తెలిపింది.

సౌత్ ఈస్ట్ ఆసియా రీజినల్ డైరెక్టర్:

  • బాంగ్లాదేశ్ కి చెందిన సైమా వాజిద్ WHO సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్ గా జనవరి 23న నియమితులయ్యారు.
  • సైమా ఢిల్లీలో ఉన్న WHO రీజినల్ ఆఫీస్ నుంచి సౌత్ ఈస్ట్ ఆసియా పరిధిలోని 11 దేశాలను పర్యవేక్షిస్తారు.

రికార్డు సృష్టించిన అశ్విన్:

  • ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC)లో 150 వికెట్లు తీసిన తొలి భారత్ బౌలర్ గా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డులకెక్కారు.
  • ఇంగ్లాండులో జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్లు తీసిన అశ్విన్ ఈ రికార్డును నెలకొల్పారు.
  • భారత్ తరపున 30 WTC లో 150,అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో బౌలర్ గా అశ్విన్ నిలవగా..పాట్ కమిన్స్,నాథన్ లియాన్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

3 thoughts on “25 జనవరి 2024 కరెంట్ అఫైర్స్ తెలుగులో-Daily Telugu Current Affairs”

Leave a comment

error: Content is protected !!