24 జనవరి 2024 కరెంట్ అఫైర్స్ తెలుగులో-Daily Telugu Current Affairs

24 January 2024 Current Affairs ముఖ్యాంశాలు:

హమారా సంవిధాన్ హమారా సమ్మాన్:

  • 75వ రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ‘హమారా సంవిధాన్ హమారా సమ్మాన్’ అనే అఖిల భారత ప్రచారాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ప్రారంభించడం జరిగింది.
  • ఈ ప్రచారాన్ని న్యాయ శాఖ,చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
  • దీనితో పాటు,న్యాయ సలహా కోసం ఇంటిగ్రేటెడ్ లీగల్ ఇంటర్ పేస్ ను అందించడానికి న్యాయసేతు కూడా ప్రారంభించబడింది.

ICC  పురుషుల టీ20ఐ క్రికెటర్ అఫ్ ది ఇయర్:

  • భారత్  బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ వరుసగా రెండో ఏడాది ఐసీసీ పురుషుల T20I  క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.
  • వెస్టిండీస్,ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికా మరియు శ్రీలంకపై ఇతను అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు.
  • శ్రీలంకతో జరిగిన పురుషుల టీ20 లో భారత్ తరపున సూర్య కుమార్ యాదవ్ రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు.

‘టు కిల్ ఎ టైగర్’ ఆస్కార్ డైరెక్టర్:

  • ఇటీవల ‘టు కిల్ ఎ టైగర్ ‘ అనే డాక్యుమెంటరీ చిత్రం 96వ అకాడమీ అవార్డులకు ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయ్యింది.
  • ఈ డాక్యుమెంటరీ చిత్రం జార్ఖండ్ కు చెందిన మైనర్ బాలిక కథ ఆధారంగా రూపొందించబడింది.
  • దీనికి భారతీయ-కెనడియన్ ఫిల్మ్ మేకర్ నిషా పహుజా దర్శకత్వం వహించారు.
  • ఆస్కార్ 2024 విజేతలను మార్చి 10న ప్రకటిస్తారు.

ఆసియా మారథాన్ ఛాంపియన్ షిప్ భారత్ కు పసిడి:

  • ఆసియా మారథాన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం సాధించిన రెండో భారతీయ పురుష అథ్లెట్ గా మాన్ సింగ్ నిలిచాడు.
  • 34 ఎల్లా మాన్ సింగ్ రెండు గంటల 14 నిమిషాల 19 సెకన్ల టైమింగ్ తో గోల్డ్ మెడల్ సాధించాడు.
  • 2017లో ఆసియా మారథాన్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకున్న తొలి భారతీయ పురుష అథ్లెట్ గోపీ తోనకల్.

బీసీసీఐ పాలి ఉమ్రిగర్ అవార్డు:

  • బీసీసీఐ అవార్డ్స్-2024 ఫంక్షన్ ను హైద్రాబాద్ లో నిర్వహించారు.
  • ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్(పురుషులు)కి ఇచ్చే పాలీ ఉమిగ్రర్ అవార్డును శుభ్ మన్ గిల్(2022-23),జస్ప్రీత్ బుమ్రా(2021-22),రవిచంద్రన్ అశ్విన్(2020-21),మహ్మద్ షమీ(2019-20) గెలుచుకున్నారు.
  • కల్నల్ సి.ఆర్.నాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును మాజీ క్రికెటర్లు ఫరోఖ్ ఇంజనీర్,రవిశాస్త్రికి అందించారు.

జాతీయ బాలికా దినోత్సవం-2024:

  • ప్రతి సంవత్సరం జనవరి 24న దేశవ్యాప్తంగా జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటారు.
  • ఆడపిల్లల హక్కులు మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పించడం దీని యొక్క లక్ష్యం.
  • ఈ దినోత్సవాన్ని 2008 సంవత్సరంలో జరుపుకోవడం ప్రారంభమైంది.
  • ప్రస్తుతం దేశంలో బాలికల హక్కులకు మద్దతుగా అనేక పథకాలు అమలులో ఉన్నాయి.

ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ గ్రూప్ సీఈఓ:

  • ఇండిగో మాజీ సి.ఎఫ్.ఓ. ఆదిత్యా పాండే ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ గ్రూప్ సీఈఓ గా నియమితులయ్యారు.
  • మార్చి 1 నుండి పాండే గ్రూప్ ఎండీ రాహుల్ భాటియా ఆధ్వర్యంలో పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారు.

బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు:

  • వింగ్స్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ లో ఢిల్లీ,బెంగళూరు విమానాశ్రయాలు ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్-2024’ అవార్డు పొందాయి.
  • వింగ్స్ ఇండియా ప్రదర్శన హైద్రాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్ట్ లో జనవరి 18-21 తేదీల్లో జరిగింది.

నాల్గవ అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా భారత్:

  • బ్లూమ్ బెర్గ్ ప్రకారం భారత్ ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా మారింది.
  • ఇండియన్ స్టాక్ మార్కెట్ క్యాప్ 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరగా..అమెరికా,చైనా,జపాన్ తోలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

భారతరత్న పురస్కారం-2024:

  • స్వాతంత్య్ర సమరయోధుడు,బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ ను భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారతరత్నతో సత్కరించనుంది.
  • బీహార్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందిన ఠాకూర్ ప్రజల్లో ‘జన నాయక్’గా ప్రసిద్ధి చెందారు.

డబుల్స్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం పొందిన టెన్నిస్ ప్లేయర్:

  • 43 ఏళ్ల భారత్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న డబుల్స్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానం పొందిన ఓల్డెస్ట్ టెన్నిస్ ప్లేయర్.
  • అలాగే లియాండర్ పేస్,మహేష్ భూపతి,సానియా మీర్జా తర్వాత డబుల్స్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం పొందిన నాలుగవ భారతీయ టెన్నిస్ ప్లేయర్ గా కూడా బోపన్న నిలిచాడు.

ఐసీసీ మెన్స్ వన్ డే టీమ్ కెప్టెన్:

  • గతేడాది ప్రదర్శన ఆధారంగా మేన్స్ వన్ డే టీమ్ ని ప్రకటించిన ఐసీసీ..జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకి అప్పగించింది.
  • రోహిత్ నడిపిస్తున్న ఈ జట్టులో భారత్ నుంచి శుభ్మన్ గిల్,విరాట్ కోహ్లీ,మహ్మద్ సిరాజ్,కుల్దీప్ యాదవ్,మహ్మద్ షమీ కూడా స్థానం పొందారు.

3 thoughts on “24 జనవరి 2024 కరెంట్ అఫైర్స్ తెలుగులో-Daily Telugu Current Affairs”

Leave a comment

error: Content is protected !!