23 January 2024 కరెంట్ అఫైర్స్ తెలుగులో-Daily Current Affairs Updates

23 జనవరి 2024 కరెంట్ అఫైర్స్ ముఖ్యాంశాలు:

పరాక్రమ్ దివాస్-2024:

  • భారత్ లో ప్రతి సంవత్సరం జనవరి 23 న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని పరాక్రమ్ దివస్ గా జరుపుకుంటారు.
  • 2021 నుండి ఈ దినోత్సవాన్నిజరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
  • నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా ఎర్రకోటలో జరిగే శౌర్య దినోత్సవ వేడుకల్లో మోడీ పాల్గొంటారు.
  • దీనితో పాటుగా,తొమ్మిది రోజుల కార్యక్రమం భారత్ పర్వ్ ని కూడా మోడీ ప్రారంభించనున్నారు.

ప్రధానమంత్రి సూర్యోదయ యోజన:

  • ఇటీవల ప్రధాని మోడీ గారు ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు.
  • ఇది ఒక కేంద్ర ప్రాయోజిత పథకం.
  • దీని క్రింద 1 కోటి కంటే ఎక్కువ ఇళ్లపై రూఫ్ టాప్ సౌర ఫలకాలను ఏర్పాటు చేయనున్నారు.
  • ఈ పథకం యొక్క లక్ష్యం:ఈ పథకం క్రింద పేద మరియు మధ్య తరగతి వ్యక్తులను రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రాం క్రింద చేర్చడం.మరియు ఇంధన రంగంలో స్వావలంబన తీసుకురావడం.

సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అవార్డు:

  • ఉత్తరప్రదేశ్ లో ఉన్న 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్స్ విపత్తు నిర్వహణ రంగంలో వారి విశిష్టమైన కృషికి గాను 2024 సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అవార్డుకు ఎంపిక అయ్యాయి.
  • ఈ విషయాన్ని కేంద్ర హోమ్ శాఖ ప్రకటించింది.
  • ఈ అవార్డు పొందిన సంస్థకి 51 లక్షల నగదు బహుమతి మరియు సర్టిఫికెట్ అందజేస్తారు.
  • అదేవిధంగా ఒక వ్యక్తి అయితే 5 లక్షల నగదు మరియు ధ్రువీకరణ పత్రం ఇవ్వబడుతుంది.

జాంబియా దేశం సందర్శించనున్న భారత ప్రతినిధి ప్రభుత్వం ఎందుకంటే??

  • రాగి అన్వేషణ మరియు మైనింగ్ ప్రాజెక్టుల కోసం భారత ప్రతినిధి బృందం జాంబియా దేశాన్ని సందర్శించనుంది.
  • దీనికోసం భారతీయ పరిశ్రమ ప్రతినిధి బృందాన్ని పమ్పాలని గనుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
  • రాగి అనేది ఎరుపు-గోధుమ రంగు కల్గిన రసాయన మూలకం.
దక్షిణ అమెరికా దేశం చిలీ ప్రపంచంలోనే రాగిని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం.

ఉత్తరప్రదేశ్ గౌరవ సమ్మాన్:

  • ఉత్తరప్రదేశ్ దినోత్సవం సందర్బంగా చంద్రయాన్ మిషన్ లో ముఖ్యమైన పాత్ర పోషించిన డా||రీతూ కరిధాల్ శ్రీవాస్తవ మరియు కాన్పూర్ కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ తివారీలను ఉత్తరప్రదేశ్ గౌరవ్ సమ్మాన్ తో సత్కరించనున్నారు.

ఇండియా ఓపెన్ 2024 ఉమెన్స్ సింగిల్స్ టైటిల్:

  • చైనా దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తాయ్ ట్జు యింగ్ అద్భుతమైన ఆటను ప్రదర్శించి ఇండియా ఓపెన్-2024 మహిళల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకుంది.
  • తాయ్ ట్జు యింగ్ ఫైనల్లో చైనాకి చెందిన చెన్ యు ఫీని ఓడించింది.
  • ఇండియా ఓపెన్-2024 ఫైనల్ న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ హాల్ లో జరిగింది.

ఖోడాల్దామ్ ట్రస్ట్ క్యాన్సర్-ఆసుపత్రికి శంఖుస్థాపన:

  • కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య,గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇటీవల రాజ్ కోట్ లోని ఖోడల్‌ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రికి శంఖుస్థాపన చేసారు.
  • దీనిని రాజ్ కోట్ లోని శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్ట్ నిర్మిస్తోంది.

కుల ఆధారిత గణన ప్రారంభించిన రాష్ట్రం:

  • భారతదేశంలో బీహార్ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుల ఆధారిత జనగణన ప్రారంభించిన రెండో రాష్ట్రంగా నిలిచింది.
  • చివరిసారిగా దేశంలో కులగణన 1931 నాటి బ్రిటీష్ పాలనలో జరిగింది.

ఆపరేషన్ సర్వశక్తి:

  • జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్వశక్తి’ని ప్రారంభించింది.
  • ఈ ఆపరేషన్ కోసం ఇండియన్ ఆర్మీకి జమ్మూ కాశ్మీర్ పోలీసులు,CRPF,స్పెషల్ ఆపరేషన్ టీమ్స్,ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సహకరిస్తున్నాయి.

DCB బ్యాంక్ ఎండీ,సీఈఓ:

  • DCB బ్యాంక్ ఎండీ,సీఈఓగా ప్రవీణ్ అచ్యుతను కుట్టి నియామకానికి ఆర్.బి.ఐ. ఆమోదించింది.
  • ప్రస్తుతం ఆ మురళీ నటరాజన్ ఉండగా..అచ్యుతన్ కుట్టి ఏప్రిల్ 29 న బాధ్యతలు చేపడతారు.

WHO ప్రకటించిన మలేరియా రహిత దేశం:

  • వెస్ట్ ఆఫ్రికాలోని కాబో వెర్దేని మలేరియా రహిత దేశంగా WHO ప్రకటించింది.
  • ఇప్పటివరకు WHO నుంచి 43 దేశాలు,ఓ టెరిటరీ మలేరియా ఫ్రీ సర్టిఫికేట్ పొందగా..చివరి మూడేళ్ళలో వల్ల మలేరియా కేస్ కూడా నమోదు కాకపోతే ఆ దేశం మలేరియా ఫ్రీ కంట్రీగా నిలుస్తుంది.

మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్:

  • ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన పాపులర్ తెలుగు మేల్ యాక్టర్స్ జాబితాలో అత్యంత ఆదరణ పొందిన నటుడిగా ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచాడు.
  • ఇక మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ గా సమంత టాప్ లో నిలించింది.

ఆసియా మారథాన్ ఛాంపియన్ షిప్స్-2024:

  • భారత మారథాన్ రన్నర్ మాన్ సింగ్ ఆసియా మారథాన్ ఛాంపియన్ షిప్స్-2024 గెలుచుకొని ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు.
  • 2017 లో గోపి తొనకాల్ తొలిసారి భారత్ తరపున గోల్డ్ మెడల్ సాధించాడు.

మెన్స్ టీ20 క్రికెట్ టీమ్-2023 సారథ్య బాధ్యతలు:

  • గతేడాది ప్రదర్శన ఆధారంగా మేన్స్ టీ-20 టీమ్ ని ప్రకటించిన ఐసీసీ జట్టు సారథ్య బాధ్యతలను సూర్య కుమార్ యాదవ్ కు అప్పగించింది.
  • ఈ జట్టులో భారత్ నుండి రవి బిష్ణోయ్,అర్షదీప్ సింగ్ కూడా ఉన్నారు.

1 thought on “23 January 2024 కరెంట్ అఫైర్స్ తెలుగులో-Daily Current Affairs Updates”

Leave a comment

error: Content is protected !!