ముఖ్యంశాలు:
రామ్ లల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవం:
- దేశమంతా వేయి కన్నులతో ఎదురుచూసిన శ్రీరామ్ లల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవం జనవరి 22 వ తేదీన అయోధ్యలో అట్టహాసంగా ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా జరిగింది.
- RSS చీఫ్ మోహన్ భగవత్,UP CM యోగి ఆదిత్యానాథ్ మరియు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు కూడా రామ్ లల్లాకి పూజలు చేశారు.
- అయోధ్య రామయ్య మందిరం ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపురా.
- గుజరాత్ లో ఉన్న సోమనాథ్ ఆలయం,ముంబైలోని స్వామినారాయణ ఆలయం,గుజరాత్ లోని అక్షరధామ్ టెంపుల్ కాంప్లెక్ మరియు కలకత్తాలోని బిర్లా టెంపుల్ వీరు రూపొందించిన ప్రముఖ దేవాలయాలు.
SSB డైరెక్టర్ గా సీనియర్ IPS:
- సీనియర్ ఇండియాన్ పోలీస్ సర్వీస్(IPS) అధికారి దల్జీత్ సింగ్ చౌదరి సశాస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ గా నియమితులు కావడం జరిగింది.
- వీరు UP కేడర్ కు చెందిన 1990 బ్యాచ్ IPS అధికారి.
- ఈ నెల ప్రారంభంలో మాజీ చీఫ్ రష్మీ శుక్లా మహారాష్ట్ర డిజీపిగా నియమితులు అయినా తర్వాత SSB డైరెక్టర్ జనరల్ పోస్ట్ ఖాళీగా ఉంది.
- SSB నేపాల్ మరియు భూటాన్ లతో భారతదేశ సరిహద్దులను కాపాడుతుంది.
ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్:
- 2023 ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్(IISF) జనవరి 17 నుండి 20 వరకు హర్యానాలో నిర్వహించబడుతుంది.
- ఇది హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో ముగిసింది.
- దీనిలో భాగంగా ఫరీదాబాద్ లో 50 ఎకరాల్లో అత్యాధునిక సైన్స్ సిటీని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలని ముఖ్యమంత్రి ప్రకటించారు.
భారత్ కి రానున్న డెన్నిస్ ఫ్రాన్సిస్:
- ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 78వ సెషన్ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ అయిదు రోజుల భారత్ పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు.
- భారతదేశం-ఐక్యరాజ్యాల సంబంధాలను ముందుకి తీకుకెళ్లడానికి మరియు భారత్ ప్రాధాన్యతలు మరియు ప్రపంచ సవాళ్లపై అభిప్రాయాల మార్పిడి చేసుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశం అని విదేశాంగ మంత్రిత్వ శాఖా తెలిపింది.
- రిపబ్లిక్ డే సందర్బంగా ఫ్రాన్సిస్ మహారాష్ట్ర రిపబ్లిక్ డే పరేడ్ లో రాష్ట్ర అతిథిగా పాల్గొననున్నారు.
కూచిపూడి నృత్యకారిణికి బాల పురస్కార్:
- కూచిపూడి నృత్యకారిణి పెండ్యాల లక్ష్మీ ప్రియను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2024 తో సత్కరించారు.
- తెలంగాణ రాష్ట్రంలోని కాజీపేటకు చెందిన 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ప్రియఅనే విద్యార్థిని కళా,సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ కనపరించినందుకు గాను ఆమెను సత్కరించారు.
- ఈ ఏడాది వివిధ విభాగాల్లో సన్మానం పొందిన 19 మంది చిన్నారుల్లో లక్ష్మీ ఒకరు.
ప్రపంచంలోనే పెద్ద షిప్ గా రికార్డు:
- టైటానిక్ షిప్ తో పోలిస్తే అయిదింతలు పెద్దది,20 అంతస్తులతో కూడిన చాల సౌకర్యవంతమైన నౌక ఐకాన్ ఆఫ్ ది సీస్ యాత్రికుల కోసం రెడీ అయ్యింది.
- ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా రికార్డు సృష్టించిన ఈ నౌక తన సముద్రంలో తన ప్రయాణాన్ని ఈ నెలలో 27వ తేదీన మొదలుపెట్టనుంది.
- వాటర్ పార్క్,థ్రిల్ ఐలాండ్,సెంట్రల్ పార్క్ ..ఇలా 8 రకాల సౌకర్యాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
- మరికొన్ని విశేషాలు: దీని యొక్క పొడవు 365 మీటర్లు,2805 గదులు,2,50,800 టన్నుల బరువు మరియు 7,600 ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంది.
- 16,624 కోట్ల ఖర్చుతో రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ దీని నిర్మాణం చేసింది.
టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్-2023:
- ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఎలా ఉందన్న అంశంపై టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకులను విడుదల చేసింది.
- ఇందులో 55 దేశాల్లోని 387 నగరాల్లో సర్వే చేసింది.
- నగరంలోపల ఉండి డైలీ 10 నుండి 15 కి.మీ. ప్రయాణించేవారిపై అధ్యయనం చేయడం జరిగింది.
- దీనిలో వరల్డ్ లో లండన్ నగరం ప్రథమ స్థానంలో ఉంది.ఇక్కడ 10 కి.మీ. దూరానికి సగటున 37 నిమిషాల 20 సెకండ్లు పడుతున్నట్లు పేర్కొంది.
- భారత్ కి చెందిన బెంగళూరులో 28 నిమిషాల 10 సెకండ్లు పడుతుంది.
అమెరికా స్కూల్ లలో హిందీ భాష:
- అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీలో ఉన్న రెండు స్కూల్ ల కరికులంలో హిందీని ఒక భాషగా చేర్చడం జరిగింది.
- కాలిఫోర్నియా ఇలా భారతీయ భాషనీ ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం.
- కాలిఫోర్నియాలో ఉన్న ఇండో అమెరికన్లు తమ పిల్లల కోసం హిందీని ప్రవేశపెట్టండి అని చాల కాలంగా అడుగుతున్నారు.
- అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫ్రెమాంట్ నగరంలో ఎక్కువగా ఇండో అమెరికన్లు ఉన్నారు.ఇక్కడ ఉన్న హొర్నర్ మిడిల్ స్కూల్,ఇర్వింగ్టన్ హైస్కూల్ లో 2024-25 అకాడమిక్ ఇయర్ కి హిందీని ప్రవేశపెట్టాలని అక్కడి బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఐఐటీ కాన్పూర్ నూతన వెబ్సైట్:
- ఐఐటీ కాన్పూర్ రామాయణ వెబ్సైట్ ని ప్రారంభించింది.
- వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్ పేరుతో ఈ వెబ్సైటును అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు.
- వెబ్సైట్ లో లాగిన్ అయ్యాక వాల్మీకీ రామాయణంలో ఉన్న శ్లోకాలు వాటి యొక్క అనువాదానంను పొందవచ్చు.
- మన దగ్గర ఇన్ఫర్మేషన్ పంపి సమాచార సవరణ కూడా చేయవచ్చు.
Also Read: 20 January 2024 Telugu Current Affairs
Your article helped me a lot, is there any more related content? Thanks!