బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవం-2024

ప్రతిష్టాత్మక బీసీసీఐ అవార్డుల కార్యక్రమం ప్రారంభమైంది.

  • దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత హైదరాబాద్ లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది.
  • ఈ కార్యక్రమానికి బీసీసీఐ కార్యదర్శి జైషా,ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా,కెప్టెన్ రోహిత్ శర్మా తో పాటు  భారత క్రికెటర్లు హాజరయ్యారు.

బెస్ట్ ఉమెన్ ఇంటర్నేషనల్ క్రికెటర్:

  • టీమ్ ఇండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన బెస్ట్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ గా వరుసగా రెండు సార్లు గెలుచుకుంది.
  • 2020-21,2021-22 సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు బీసీసీఐ ఆమెకు అవార్డును బహుకరించింది.
  • అలాగే ఆల్ రౌండర్ దీప్తి శర్మ కూడా రెండు సీజన్లకు అవార్డు అందుకున్నారు.2019-20 మరియు 2022-23 సీజన్లకు అవార్డు దక్కించుకున్నారు.

గిల్ కు పాలి ఉమ్రిగర్ అవార్డు:

  • టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్ ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.
  • బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ గా నిలిచినందుకు ఆయనకు పాలి ఉమ్రిగర్ అవార్డును బీసీసీఐ ప్రధానం చేసింది.
  • 2022-23 సీజన్ ప్రదర్శనకు గాను గిల్ కు ఈ అవార్డు వచ్చింది.
  • అలాగే మహ్మద్ షమీ(2029-20),రవిచంద్రన్ అశ్విన్(2020-21),జస్ప్రీత్ బుమ్రా(2021-22) కూడా ఉమ్రిగర్ అవార్డులు అందుకున్నారు.

బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూగా జైస్వాల్:

  • బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూటంట్ 2022-23 గా టీమ్ ఇండియా క్రికెటర్ యశస్వి జైస్వాల్ నిలిచారు.
  • అలాగే 2021-22 సీజనూకి శ్రేయస్ అయ్యర్,2020-21 సీజన్ కి అక్షర్ పటేల్,2019-20 సీజన్ కి మయాంక్ అగర్వాల్ నిలిచారు.వీరందరికి బీసీసీఐ అవార్డులు అందజేసింది.
  • ఇక మహిళా విభాగంలో ప్రియా పూనియా(2019-20),షఫాలీ వర్మ(2020-21),మేఘన(2021-22),అమన్ జోత్ కౌర్(2022-23) బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూగా నిలిచారు.

జీవితకాల సాఫల్య పురస్కారం:

  • టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రికి కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది.
  • భారత్ జట్టుకు సేవలు అందించిందినందుకు ఆయనకు ఈ పురస్కారాన్ని బీసీసీఐ అందజేసింది.
  • ఈ సందర్బంగా రవిశాస్త్రి మాట్లాడుతూ ‘గబ్బా మైదానంలో ఆసీస్ పై భారత్ విజయం సాధించడం నేను మర్చిపోలేను.రిషబ్ పంత్ యొక్క విన్నింగ్ షాట్ నా కెరీర్ లోనే బెస్ట్ మూమెంట్ అని పేర్కొన్నారు.

జయదేవ్ ఉనద్కత్ ప్రతిష్టాత్మక అవార్డు:

  • టీమ్ ఇండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్(సౌరాష్ట్ర,2019-20)కు మాధవరావు సింథియా అవార్డు దక్కింది.
  • రంజీల్లో అత్యధిక వికెట్లు తీసినందుకు ఆయనకు బీసీసీఐ ఈ అవార్డును ఇచ్చింది.

అలాగే రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించినందుకు మయాంక్ అగర్వాల్(కర్ణాటక 2022-23),సర్ఫ్ రాజ్ ఖాన్(ముంబై 2021-22)కు కూడా ఈ అవార్డును బీసీసీఐ బహూకరించింది.

Also Read: ఈ సంవత్సరం రిప్లబిక్ పరేడ్ లో తెలంగాణ శకటం

2 thoughts on “బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవం-2024”

Leave a comment

error: Content is protected !!