2024 January 20 Telugu Current Affairs
IIL నుండి హెపటైటిస్-A టీకా:
IIL -ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన భారత్ మొట్టమొదటి హెపటైటిస్-A అందుబాటులోకి రానుంది.హవిష్యూర్ అనే బ్రాండు పేరుతో విడుదల చేయడం జరిగింది.ఇప్పటిదాకా హెపటైటిస్ టీకాను మనం వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం.ఇకనుండి ఆ అవసరం లేదు అని ఐఐఎల్ ఎండీ డా.కె.ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.ఈ టీకా పిల్లలకి 12 నెలల తరువాత ఫస్ట్ డోస్ ఆ తరువాత 6 నెలలకి రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కర్ణాటక హైకోర్టు CJ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా:
కర్ణాటక రాష్ట్ర హైకోర్టు CJ జస్టిస్ బి.వరాలెను సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిగా నియామకం చేయాలనీ సీజేఐ చంద్రచూడ్ నాయకత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది.ఇతని స్థానంలో కర్ణాటక CJ గా పి.ఎస్.దినేష్ కుమార్ పేరును సూచించింది.కేంద్రం ఈ నియామకాన్ని ఆమోదిస్తే జస్టిస్.బి.ఆర్.గవాయ్,జస్టిస్ సి.టి.రవి కుమార్ ల తర్వాత ఎస్.సి. వర్గానికి చెందిన మూడవ వ్యక్తిగా వీరు నిలుస్తారు.
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం:
మిస్ వరల్డ్-71వ పోటీలకు 2024 సంవత్సరానికి గాను భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది.18 ఫిబ్రవరి నుండి 9 మార్చ్ వరకు ఢిల్లీలో ఉన్న భారత్ మండపం,ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించనున్నారు.28 ఏళ్ళ తర్వాత మిస్ వరల్డ్ కి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
చందమామ ఉపరితలంపై జపాన్:
చంద్రుడిపై ప్రయోగించిన లూనార్ ల్యాండర్-జపాన్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది.దీనితో చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ చేసిన అయిదవ దేశంగా జపాన్ గుర్తింపు పొందింది.ఇప్పటిదాకా USA ,రష్యా,చైనా,భారత్ ఈ నాలుగు దేశాలు చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ చేశాయి.స్మార్ట్ ల్యాండర్ ఫార్ ఇన్వెస్టిగేషన్ మూన్-స్లిమ్ వ్యోమనౌక శుక్రవారం రోజున రాత్రి 8:50 గం|| కి చందమామని తాకింది.
ప్రధాన మంత్రి ఇద్దరు తెలుగు చిన్నారులకి పురస్కారాలు :
పీఎం రాష్ట్రీయ బాల పురస్కారం 2024 సంవత్సరానికి గాను 19 మంది బాలలకి జనవరి 26న పురస్కారం అందించనుంది.తెలంగాణ నుండి ఆర్ట్-ట్రెడిషన్ విభాగంలో పెండ్యాల లక్ష్మీప్రియ,AP నుంచి ఆర్.సూర్యప్రకాష్ లను ఎంపిక చేయడం జరిగింది.
125 అడుగుల BR అంబేద్కర్ కాంస్య విగ్రహం:
ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉన్న స్వరాజ్ మైదానంలో 125 అడుగుల ఎత్తున్న విగ్రంహంను ప్రారంభించారు.స్టాచ్యూ ఆమ్ సోషల్ జస్టిస్ పేరు పెట్టడం జరిగింది.DR.B.R.అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని సహకారానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది.
మత్స్యకారుల కోసం కృత్రిమ రీఫ్ యూనిట్ల ఏర్పాటు:
మత్స్యకారుల గ్రామాల యొక్క ఒడ్డున ఆర్టిఫిషల్ రీఫ్ యూనిట్ల ఏర్పాటు కోసం కేంద్రమంత్రి పరుషోత్తం రూపాయలా రూ.302 కోట్లు కేటాయింపు చేస్తున్నట్టు ప్రకటించారు.పి.ఎం.ఎం.ఎస్.వై.-ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన-స్కీం క్రింద ప్రారంచించారు.సస్టైనబుల్ మత్స్య సంపద & జీవనోపాధిని ప్రోత్సహించడం కోసం ప్రారంభించడం జరిగింది.
ఛత్తీస్‌గఢ్ కొత్త పథకం:
మహతరీ వందన యోజన-2024 పథకాన్ని ఛత్తీస్‌గఢ్ ఇటీవల ప్రారంభించడం జరిగింది.ఈ స్కీం కింద ఉమెన్స్ కి ప్రతి నెల 1000/- ఇలా సంవత్సరానికి 12000/- సహాయం అందివ్వడానికి నిర్ణయం తీసుకుంది.ఈ పథకం వర్తించాలంటే ఛత్తీస్‌గఢ్ నివాసి అయ్యుండాలి.
ఎనిమిది అమృత్ ప్రాజెక్టులకు శంఖుస్థాపన:
దాదాపు 2,000 కోట్ల విలువైన 8 అమృత్సర్-అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ ట్రాన్స్ఫర్మేషన్ లో భాగంగా ఉన్న ప్రాజెక్టులకి పీఎం మోడీ గారు మహారాష్ట్ర లోని షోలాపూర్ లో శంకుస్థాపన చేసాడు.
ఎస్.సి. వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు:
S.C. రిజర్వేషన్ వర్గీకరణ అంశంపైన అధ్యయనం చేయడానికి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి-రాజీవ్ గాబా నాయకత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కమిటీలో 5గురు సభ్యులుగా కేంద్ర హోంశాఖ,సామాజిక న్యాయశాఖ,న్యాయశాఖ,గిరిజన శాఖల కార్యదర్శులుగా ఉన్నారు.ఈ నెలలో 23వ తేదీన మొదటిసారి సమావేశం అవ్వనున్నట్లు తెలిపాయి.ఎస్.సి. కులాల యొక్క వర్గీకరణ జరపండి అని ఏపి,కర్ణాటక మరియు తెలంగాణ ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేసారు.
eమొబిలిటీ సిమ్యులేషన్ లాబ్:
ఐఐటీ మద్రాసు eమొబిలిటీ సిమ్యులేషన్ ల్యాబ్ ను ప్రారంభించేందుకు అల్టెయిర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read: 19 January 2024 Telugu Current Affairs