18 January 2024 Current Affairs in Telugu
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ:
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. అతని తర్వాతి స్థానంలో సూర్య (4), మ్యాక్స్‌వెల్ (4) ఉన్నారు. అలాగే T20ల్లో అత్యధిక పరుగులు (1572) చేసిన భారత కెప్టెన్‌గా హిటా మ్యాన్ నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు కోహ్లి (1570) పేరిట ఉండేది.
వరంగల్‌కు విప్రోను విస్తరించండి:
సీఎం రేవంత్ TS: దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజిబిజీగా గడుపుతున్నారు. విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేంజీతో భేటీ అయ్యారు. వరంగల్, ఇతర టైర్-2 నగరాలకు విప్రో విస్తరణపై చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటుపై సమాలోచనలు జరిపారు. మరోవైపు JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌తో భేటీ అయిన రేవంత్.. పంప్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి రూ.9వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకున్నారు.
2024 ఆరంభంలోనే అరుదైన రికార్డులు:
ఈ ఏడాది ఆరంభంలోనే క్రికెట్లో భారత జట్టు రెండు అరుదైన రికార్డులు నెలకొల్పింది. ఇటీవల సౌతాఫ్రికాతో అతి తక్కువ రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ముగించింది. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఇప్పుడు టీ20ల్లోనూ అలాంటి ఘనతే సొంతం చేసుకుంది. అఫ్గానిస్థాన్‌లో జరిగిన 3వ టీ20 అత్యంత పొడవైన T20I మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఫలితం కోసం ఏకంగా 2 సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది.
అస్సాం సీఎస్ గా శ్రీకాకుళం వ్యక్తి:
APకి చెందిన కోత రవి అస్సాం తదుపరి CSగా నియమితులయ్యారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి(మ) కోటపాడుకు చెందిన ఆయన.. గతంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో దౌత్యాధికారిగా పనిచేశారు. అస్సాం కేడర్‌కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్రంలోని 18 శాఖలకు అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఉల్ఫా తీవ్రవాదులతో జరిగిన శాంతి ఒప్పందంలో కీలకపాత్ర పోషించిన రవి పనితీరును గుర్తించిన ప్రభుత్వం ఈ పదవి అప్పగించింది.
ఆయుష్మాన్ భారత్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు:
కేంద్రం ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ఆయుష్మాన్ భారత్ లబ్ధిని రూ.5లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచనుందట. ఈ ప్రపోజలున్న ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. క్యాన్సర్, అవయవ మార్పిడి వంటి అధిక ఖర్చుతో కూడుకున్న వాటికి ఇది వర్తించనుందట. FEB1న ప్రవేశపెట్టే బడ్జెట్లో దీనిపై ప్రకటించనున్నట్లు PTI తెలిపింది. భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనను 100కోట్ల మందికి చేర్చాలని ప్లాన్ చేస్తోంది.
చైనాలో మరోసారి జనాభాలో క్షీణత:
చైనాలో వరుసగా రెండో ఏడాది జనాభాలో క్షీణత నమోదైంది. తాజా నివేదికల ప్రకారం ఆ దేశ జనాభా 2023 చివరి నాటికి 1.409 బిలియన్లుగా ఉంది. 2022తో పోలిస్తే 20.8 లక్షల మేర తగ్గింది. గత 60 ఏళ్లలో ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి. శిశుజననాల రేటు కూడా వెయ్యి మంది జనాభాకు 6.39గా నమోదైంది. దేశంలో పట్టణీకరణ, తక్కువ జననాల రేటు వల్ల ఈ క్షీణత నమోదైందని నిపుణులు చెప్తున్నారు.
గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్:
డిజిటల్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్‌తో గూగుల్ ఇండియా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంటే విదేశాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా Google Pay సేవలను ఉపయోగించుకోవచ్చు. Google Pay ఇకపై నగదు అవసరం లేదని, అయితే అంతర్జాతీయ చెల్లింపు గేట్‌వేల అవసరాన్ని తొలగిస్తుందని పేర్కొంది. గూగుల్ పేతో విదేశాల నుండి డబ్బును బదిలీ చేయడం సులభం అని కంపెనీ ప్రకటించింది.
‘వింగ్స్ ఇండియా 2024’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి:
TS: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు వైమానిక ప్రదర్శన జరగనుంది. భారీ విమానాలు, ఛార్టెడ్ ఫ్లైట్లు, చాపర్లు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ నెల 20, 21న సందర్శకులకు అనుమతించనున్నారు.
రామ మందిర స్మారక స్టాంపును విడుదల చేసిన ప్రధాని:
అయోధ్య శ్రీరామ మందిరం స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ స్మారక స్టాంపు డిజైన్‌లో రామ మందిరం, మంగళ్ భవన్ అమంగల్ హరి శ్లోకాలు, సూర్యుడు, సరయు నది, ఆలయ పరిసరాల్లోని శిల్పాలు ఉన్నాయి. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రాముడిపై రిలీజ్ చేసిన స్టాంపుల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
2028లో కక్ష్యలోకి స్పేస్ స్టేషన్ బేసిక్ మోడల్:
ఇస్రో భారత అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన తొలి రౌండ్ పరీక్షలను 2025కల్లా నిర్వహిస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. స్పేస్ స్టేషన్ బేసిక్ మోడల్‌ను 2028లో కక్ష్యలోకి పంపించి, 2035 నాటికి దానిని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామన్నారు. ఈ స్టేషన్ మొత్తం 25 టన్నుల బరువు ఉంటుందని, అవసరమైతే దీనిని తర్వాత విస్తరిస్తామని చెప్పారు. దీని ద్వారా మైక్రో గ్రావిటీ పరిశోధనలు చేయనున్నట్లు తెలిపారు.
అత్యధిక బంగారం నిల్వలున్న దేశాలివే:
అత్యధిక బంగారం నిల్వలున్న దేశాల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ లిస్టులో అమెరికా 8,133.46 టన్నులతో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి 8 స్థానాల్లో వరుసగా జర్మనీ(3,352.65), ఇటలీ(2,451.84), ఫ్రాన్స్ (2,436.88), రష్యా (2,332.74), చైనా (2,191.53), స్విట్జర్లాండ్ (1,040), జపాన్ (845.97) ఉన్నాయి. భారత్ 800.78 టన్నుల బంగారంతో 9 స్థానంలో నిలిచింది. దీని విలువ 48,157.71 మిలియన్ డాలర్లు.
డెబ్యూ టెస్టు తొలి బంతికే వికెట్:
అరుదైన ఘనత విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ అరుదైన ఘనత సాధించారు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో డెబ్యూ చేసిన అతను.. తొలి బంతికే వికెట్ తీయడమే కాకుండా ఐదు వికెట్లు పడగొట్టారు. తద్వారా ఈ రికార్డు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచారు. 2011లో శ్రీలంకతో మ్యాచ్ నాథన్ లయన్ ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా ఆసీస్ తొలి ఇన్నింగ్సులో 283 రన్స్ చేయగా, విండీస్ 188 స్కోరుకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్సులో 73కే 6 వికెట్లు కోల్పోయింది.
Also Read: 17 January 2024 Current Affairs in Telugu
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.