07 February 2024 Current Affairs in Telugu

 

07 February 2024 Current Affairs in Telugu

భారతీయులకు వీసా రహిత ప్రయాణం:

  • ఇటీవల ఇరాన్ ప్రభుత్వం భారతీయ వాసులకు వీసా రహిత సేవలను ప్రకటించింది.
  • ఈ సౌకర్యం కేవలం టూరిజం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది.దీని ప్రకారం సాధారణ పాస్పోర్ట్ కల్గి ఉన్న భారతీయ సిటిజెన్స్ ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి గరిష్టంగా 15 రోజుల పాటు వీసా లేకుండానే ఇరానుకు ప్రయాణం చేయవచ్చు.ఇరాన్ లాగా మరో 27 దేశాలు భారతీయులకు వీసా లేకుండానే ప్రవేశాన్ని అందిస్తున్నాయి.ఈ దేశాలలో మలేషియా,ఇండోనేషియా,థాయిలాండ్ వంటి దేశాలు ఉన్నాయి.

దివ్య కళా మేళా:

  • NDFDC ఆధ్వర్యంలో త్రిపురలోని అగర్తలాలో దివ్య కళా మేళా 2024 నిర్వహించబడుతోంది.
  • ఇది ఫిబ్రవరి 6 నుండి 11 వరకు నిర్వహించబడుతుంది.

దీనబంధు చోటూ రామ్ థర్మల్ పవర్ ప్లాంట్:

  • హర్యానా రాష్ట్ర ప్రభుత్వం యమునా నగర్ లో 800 మెగావాట్ల దీనబంధు చోటూ రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
  • హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేని యొక్క నిర్మాణ భాద్యతను BHEL కు అప్పగించారు.దీని నిర్మాణానికి రూ.6,900 కోట్లు వెచ్చించనున్నారు.

గౌహతి హైకోర్టు సీజేగా:

  • గౌహతి హైకోర్టు సీజేగా జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసారు.వీరితో అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా పాల్గొన్నారు.

ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కొత్త డైరెక్టర్:

  • ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇటీవల భారత్ లోని బ్యాంకు కొత్త డైరెక్టరుగా టేకో కొనిషి స్థానంలో మియో ఓకాను నియమించింది.
  • భారత్ లో ఏడీబీ కార్యకలాపాలు మరియు ఇతర అభివృద్ధి పనులను ఓకా బాధ్యత వహిస్తుంది.

యూఏఈ గోల్డెన్ వీసా లభించిన భారత సెలెబ్రిటీ:

  • సూపర్ 30 ఫౌండర్ ఆనంద్ కుమార్ కు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది.
  • ఇంతకుముందు బాలీవుడు నటులైన సల్మాన్ ఖాన్,షారుఖ్ ఖాన్,సంజయ్ దత్ లకు ఈ వీసా లభించింది.

హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ ప్రెసిడెంట్ మృతి:

  • చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా(74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.నలుగురు వ్యక్తులతో కలిసి ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది.ఈ ప్రమాదంలో వీరు మరణించగా మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు.
  • పినేరా రెండుసార్లు(2009-14,2018-23) చిలీ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు.బిలీనియర్ అయినా ఆయన దేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరు.

NRSCతో టీఎస్ ఏవియేషన్ అకాడెమి ఒప్పందం:

  • ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటరుతో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడెమీ ఒప్పందం చేసుకుంది.
  • డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై ఈ రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది.

యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం:

  • ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ప్రవేశపెట్టిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.దీంతో దేశంలోనే ఈ బిల్లును అమల్లోకి తీసుకురానున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది.
  • ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఒకే చట్టం అమలులోకి రానుంది.

కొత్త పార్టీ పేరు ప్రకటించిన శరద్ పవార్:

  • నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు,గుర్తును ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గానికి కేటాయించడంతో శరద్ పవార్ కొత్త పార్టీ పేరు ప్రకటించారు.
  • తన వర్గానికి ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్ చంద్ర పవార్’గా పేర్కొన్నారు.ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.

భారత్ రంగ్ మహోత్సవ్:

  • భారత్ అగ్రగామి నాటక ఉత్సవమైన ప్రతిష్టాత్మక “భారత్ రంగ్ మహోత్సవ్” గుజరాత్ లోని కచ్ జిల్లాలో ప్రారంభించబడింది.
  • బరోడా మహారాజా శాయాజీరావు యూనివర్సిటీకి చెందిన డాక్టర్ చవాన్ ప్రమోద్ దర్శకత్వం వహించిన,భవభూతి విరచిత ‘ఉత్తరా రామచరితం’ నాటక ప్రదర్శనతో ఈ మహోత్సవం ప్రారంభమవుతుంది.

PT ఉషకు జీవితకాల సాఫల్యత పురస్కారం:

  • ప్రస్తుత భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు PT ఉషను స్పోర్ట్స్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకమైన జీవితకాల సాఫల్యత పురస్కారం అందుకుంది.
  • ఈమె భారత్ తరపున 103 అంతర్జాతీయ పతకాలు సాధించి ప్రపంచ వేదికపై తన సత్తా చాటింది.

మా కామాఖ్య దివ్యలోక్ పరియోజన:

  • మా కామాఖ్య దివ్యలోక్ పరియోజనకు ప్రధాని నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేసారు,దీనిని మా కామాఖ్యా యాక్సెస్ కారిడార్ అని కూడా పిలుస్తారు.
  • దీని యొక్క లక్ష్యం-అస్సాంలో తీర్థయాత్రలు మరియు పర్యాటక రంగాన్ని పెంపొందించడం.ఇది పీఎం డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్ పథకంలో భాగం.

గోబర్ గ్యాసుతో రాకెట్ ప్రయోగం:

  • జపాన్ కు చెందిన ఇంటర్ స్టెల్లార్ టెక్నాలజీస్ అనే అంకురా సంస్థ పర్యావరణ రహిత రాకెట్ ఇంజిన్ ను రూపొందించింది.
  • ఇది ఆవు పేడ నుండి తీసిన బయో మీథేన్ వాయువు సాయంతో పనిచేస్తుంది.ఈ మధ్యనే దీన్ని విజయవంతంగా పరీక్షించారు.

నాసా పేస్ మిషన్:

  • నాసా యొక్క పేస్ అంతరిక్ష నౌక,ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది.
  • ప్లాంక్టన్,ఏరోసోల్,క్లౌడ్,ఓషన్ ఏకో సిస్టం,సముద్రపు రంగులను గుర్తించి మ్యాప్ చేయడం మరియు శాస్త్రవేత్తలకు మహా సముద్రాల ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో ఇది సహకరిస్తుంది.

జిగర్తాండా పరీక్ష సక్సెస్:

  • భారత గగనతల పరిశోధన,రక్షణ సామర్థ్యాల పెంపులో కీలక ముందడుగు వేసింది.
  • ఐఐటీ కాన్పూర్ దేశంలోనే “మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్ పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీ”ని నిర్మించి విజయవంతంగా పరీక్షించింది.
  • ఈ పరీక్ష విజయంతో అధునాతన హైపర్ సానిక్ టెస్టింగ్ సామర్థ్యం గల దేశాల సరసన భారత్ నిలిచింది.

మలేషియాకు 17వ రాజు:

  • జోహార్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్ ఇబ్రహీం(65) మలేసియాకు 17వ రాజుగా సింహాసనం అధిష్టించారు.
  • మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని నేషనల్ ప్యాలెసులో సుల్తాన్ ఇబ్రహీం నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

టైప్ బార్ టీసీవి వ్యాక్సిన్:

  • హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తయారుచేసిన “టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్-టైప్ బార్”పై నిర్వహించిన పేజ్-3 ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు రావడం జరిగింది.
  • ఆఫ్రికా ఖండంలోని మలావిలో 9 నెలల నుంచి 12 ఏండ్ల మధ్య వయసు గల పిల్లలపై ట్రయల్స్ నిర్వహించగా కనీసం నాలుగేండ్లపాటు ఈ టీకా టైఫాయిడ్ జ్వరానికి వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.

Also Read: TSRJC CET 2024 Notification

 

4 thoughts on “07 February 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!