01 February Union Budget 2024 Highlights

మధ్యంతర బడ్జెజ్ ముఖ్యాంశాలు:

01 February Union Budget 2024 Highlights

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.రూ.47.66 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.వివిధ మార్గాల ద్వారా రూ.30.80 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.దీంతో వరసగా ఆరుసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును ఈమె సమం చేసారు.వరుసగా 5 కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్,అరుణ్ జైట్లీ,చిదంబరం,యాశ్వంత్ సిన్హా రికార్డును అధిగమించారు.ఇందిరా గాంధీ తరువాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా వీరు గుర్తింపు పొందారు.

  • బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కలవగా నిర్మలకు ముర్మూ దహీ చీనీ తినిపించారు.

పన్ను ఆదాయం ఎంతంటే??

అప్పులు మినహా 2023-24 ఏడాదిలో సవరించిన అంచనా రాబడి రూ.27.56 లక్షల కోట్లు అని నిర్మల వెల్లడించారు.పన్నుల దవారా రూ.23.24 లక్షల కోట్లు రాగా..మొత్తం ఖర్చు రూ.44.90 లక్షల కోట్లని అంచనా వేశారు.బడ్జెట్ అంచనాలు కంటే రూ.30.03 లక్షల కోట్లు ఎక్కువ రెవెన్యూ రానుందని..ఇది దేశ ఆర్ధిక వృద్ధికి నిదర్శనమన్నారు.ద్రవ్యలోటును 5.8%కు సవరించారు.2024-25 లో పన్ను ఆదాయం రూ.26.02 లక్షల కోట్లకు పెరగొచ్చని అంచనా వేశారు.పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇది కేవలం మధ్యంతర బడ్జెట్ మాత్రమే జులైలో పూర్తిస్థాయి బడ్జెట్ తో వికసిత్ భారత్ సాధన కోసం మా ప్రభుత్వ వివరణాత్మక రోడ్ మ్యాపును ప్రకటిస్తామని చెప్పారు.

ఈ బడ్జెట్ లో శాఖల వారీగా నిధులు:

  • రక్షణ శాఖకి రూ.6.2 లక్షల కోట్లు
  • రోడ్డు రవాణా శాఖకు రూ.2.78 లక్షల కోట్లు
  • రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు
  • వినియోగదారుల వ్యవహారాల శాఖకు రూ.2.13 లక్షల కోట్లు
  • హోమ్ శాఖకు రూ.2.03 లక్షల కోట్లు
  • కెమికల్ అండ్ ఫర్టిలైజర్ శాఖకు రూ.1.68 లక్షల కోట్లు
  • వ్యవసాయ మంత్రిత్వ శాఖకు రూ.1.27 లక్షల కోట్లు

ప్రసంగంలో హైలెట్స్:

2047 నాటికి పేదరికం అంతమే లక్ష్యంగా:

  • కుల,మాట,ఆర్థిక భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సమన అవకాశాలు కల్పిస్తున్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
  • బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ 2047 నాటికి అసమానతలు,పేదరికం కనపడకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని..ఆ ఏడాదికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దుతామని ప్రధాని మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం పేదలు,మహిళలు,యువత,అన్నదాతలను శక్తివంతం చేసింది అని తెలిపారు.

అవినీతిని తగ్గించాం:

  • పదేళ్లుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీతారామన్ చెప్పారు.
  • మోడీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేసాయి.ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వామ్యం అయ్యాడు.
  • ఉచిత రేషన్ వల్ల 80 కోట్ల మంది ఆకలి తీర్చాము.నగదు బదిలీ పథకంతో అవినీతిని గణనీయంగా తగ్గింది.

వివిధ పథకాలకు కేటాయింపులు:

  • గ్రామీణ ఉపాధి హామీ పథకం-రూ.86 వేల కోట్లు
  • సోలార్ విద్యుత్తూ గ్రిడ్-రూ.8500 కోట్లు
  • ఆయుష్మాన్ భారత్-రూ.7,500 కోట్లు
  • సెమీ కండక్టర్లు,డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీ-రూ.6,903 కోట్లు
  • పారిశ్రామిక ప్రోత్సాహకాలు-రూ.6,200 కోట్లు
  • గ్రీన్ హైడ్రోజన్ మిషన్-రూ.600 కోట్లు

టాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్:

  • 2009-10 ఆర్థిక సంవత్సరం వరకు పెండింగులో ఉన్న రూ.25వేల లోపు టాక్స్ డిమాండ్లను విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
  • అలాగే 2011-15 ఆర్ధిక సంవత్సరాల మధ్య రూ.10వేల లోపు ఉన్న వివాదాస్పద పన్ను డిమాండ్లను ఉపసంహరించుకున్నట్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రతిపాదించారు.దీంతో కోటిమంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుంది అన్నారు.

300 యూనిట్ల కరెంట్ ఫ్రీ:

  • కరెంట్ కష్టాలు లేని దేశ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
  • దేశంలో కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్  ఏర్పాటు చేస్తామన్నారు.ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్ లో ప్రకటించారు.
  • దీంతో ప్రతి కుటుంబానికి ఏటా రూ.15-18 వేలు ఆదా అవుతుంది అన్నారు.
  • వినియోగం పోగా మిగిలిన విద్యుత్ ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు.

పేదలకు రూ.34 లక్షల కోట్లు:

  • వివిధ పథకాల ద్వారా పేదల జన్ ధన్ ఖాతాల్లో రూ.34 లక్షల కోట్లు జమ చేసామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
  • 78 లక్షల మందికి వీధి వ్యాపారులకు రూ.2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు అందించాం.11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ ద్వారా ఆర్ధిక సాయం చేశాం.
  • 4.50 కోట్ల మందికి భీమా సౌకర్యం కల్పించాం.స్కిల్ ఇండియా మిషన్ తో 1.40 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చాము అని తెలిపారు.

పదేళ్లలో నారీ శక్తి పుంజుకుంది:

  • తమ పదేళ్ల పాలనలో మహిళల సాధికారత వృద్ధి నమోదు చేసిందన్నారు ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్.ఉన్నత విద్య అభ్యసిస్తున్న మహిళల సంఖ్యా పదేళ్లలో 28 శతం పెరిగిందన్నారు.
  • ట్రిపుల్ తలాక్ రద్దు సహా లోక్ సభ-అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించామన్నారు.
  • పీఎం ఆవాస్ యోజన క్రింద గ్రామీణ ప్రాంతాల్లోని 70% ఇళ్ళు మహిళలకే ఇచ్చామని తెలిపారు.

అంగన్వాడీ,ఆశా కార్యకర్తలకు గుడ్ న్యూస్:

  • దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ,ఆశా వర్కర్లు,హెల్పర్లను ఆయుష్మాన్ భారత్ కిందకు తీసుకొస్తామని ప్రకటించారు.ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ కార్డుపై కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమా సదుపాయం కల్పిస్తోంది కేంద్రం.

మధ్యతరగతి కోసం నూతన గృహ విధానం:

  • బస్తీలు,అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు.ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని చెప్పారు.పీఎం ఆవాస్ యోజన కింద కొత్తగా 2 కోట్ల ఇళ్లను నిర్మించి,పేదలకు అందజేస్తాం అని ప్రకటించారు.

టెక్ యువతకు ఇదో స్వర్ణ యుగం:

  • ఆవిష్కరణే అభివృద్ధికి పునాది అన్నారు సీతారామన్.టెక్నాలజీపై ఆధారపడే యువతకు ఇదో స్వర్ణ యుగం అని తెలిపారు.
  • లక్ష కోట్ల పెట్టుబడి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.దీని ద్వారా లాంగ్ టర్మ్/రీ ఫైనాన్సింగ్ సదుపాయం కలుగుతుందన్నారు.
  • తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేకుండానే సుదీర్ఘ గడువు కాలానికి రుణాలు అందిస్తామన్నారు.దీని ద్వారా ప్రయివేట్ రంగం అభివృద్ధి చెందుతుంది అన్నారు.

బాలికలకు క్యాన్సర్ వ్యాక్సినేషన్:

  • దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు క్యాన్సర్ వ్యాక్సిన్లు వేస్తామని తెలిపారు.భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ కట్టడి లక్ష్యంగా సర్వేకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
  • దేశంలో ఎక్కువగా సోకె క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ 15-20% తో మూడో స్థానంలో ఉంది.దీంతో ఏటా లక్ష మందికి పైగా చనిపోతున్నారు.
  • 15-35 సంవత్సరాల లోపు మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు.

పన్ను రేట్లలో మార్పులు లేవు:

  • పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయట్లేదని ఆర్ధిక మంత్రి నిర్మల చెప్పారు.దిగుమతి సుంకాలతో పాటు ప్రత్యక్ష,పరోక్ష పన్నులకు ఇప్పుడు ఉన్న రేట్లే కొనసాగుతాయని తెలిపారు.

దీవుల్లో వసతులు పెంచుతాం:

  • దేశంలో టూరిజం బాగా అభివృద్ధి చెందుతోందని నిమ్మల గారు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి,స్థానికులకు అవకాశాలు పెంచేలా దేశ పరిధిలోని ద్వీపాలను అభివృద్ధి చేస్తామన్నారు.
  • లక్షద్వీప్ వంటి దీవుల్లో వసతులు,ఇతర సౌకర్యాలను పెంచుతామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.అటు ఆధ్యాత్మిక టూరిజం పట్ల దేశ ప్రజల్లో ఆసక్తి పెడుతుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

నిర్మలమ్మ ప్రసంగ సమయం:

  • కేవలం 57 నిమిషాల్లోనే వీరు బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.ఆర్ధిక మంత్రిగా ఆమె ప్రసంగాల్లో ఇదే అత్యల్పం.
  • ఇక అత్యధిక సమయం ప్రసంగించిన రికార్డు కూడా వీరి పేరిట ఉంది.2020-21 బడ్జెట్ ప్రవేశపెడుతూ 2.42 గంటలపాటు మాట్లాడారు.

Also Read: బ్రిక్స్ లో మరో అయిదు దేశాలు

9 thoughts on “01 February Union Budget 2024 Highlights”

  1. Good day! I know this is kind of off topic but I was wondering which blog platform are you using for this website? I’m getting sick and tired of WordPress because I’ve had problems with hackers and I’m looking at options for another platform. I would be great if you could point me in the direction of a good platform.

    Reply

Leave a comment

error: Content is protected !!